గుప్పెడంతమనసు 266 ఎపిసోడ్: మీ జ్ఞాపకాల్లో నేనున్నానా సార్ అంటూ రిషీని అడిగేసిన వసుధార..ఏం చెప్తాడో..!

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూని జగతి రెస్టారెంట్ లో డ్రాప్ చేస్తుంది. వసూ కాఫీ తాగివెళ్లొచ్చుకదా అంటే..వద్దులే వసూ అని వెళ్లిపోతుంది. రిషీ కారుదగ్గరకు వెళ్తుంటే..మహేంద్ర వస్తాడు. రిషీ డ్రాప్ చేయమంటరా అంటాడు. లేదు నీతో మాట్లాడదాం అని వచ్చా అంటాడు మహేంద్ర. నేనే మీతో మాట్లాడదాం అనుకున్నాను..నా మీద మీకు ఏమైన కోపం వచ్చిందా అని అడుగుతాడు రిషీ. మహేంద్ర దానికి చాలా ప్రేమగా సమధానం చెప్తాడు. గుండెల్లో నీ మీద ప్రేమ బోలెడంత ప్రేమ ఉంది రిషీ అంటాడు. ఇలా ఇద్దరు ఒకరిమీద ఒకరు ప్రేమ గురించి మాట్లాడుకుంటారు.
రెస్టారెంట్ లో వసుధార సర్వ్ చేస్తుంది. రిషీ వస్తాడు. వసూ చూసుకోదు. రిషీ అలా చూస్తాడు..కాసేపటికి వసూ వస్తుంది. మీరెప్పుడు వచ్చారు. పిలవొచ్చుకదా అంటే..నాకు ఇక్కడ అధికారాలు ఎక్కువ ఉండవు కదా అంటాడు. వసూ కాఫీ తెస్తాను అంటుంది. కాఫీతో పాటు నాకు కంపెనీ కూడా కావాలి అంటాడు రిషీ.. అయితే రెండు కాఫీలు తెస్తాను అంటుంది. నాతో బయటకురావాలి అంటాడు రిషీ. కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు సార్ అంటుంది.. సరే రెస్టారెంట్ క్లోస్ అయ్యేవరకూ ఉంటాను అంటాడు. నేనే ఏదో మేనేజ్ చేస్తాను సార్ అంటుంది వసూ..మళ్లీ రాత్రి కాల్ ఎందుకు చేశారు అని అడుగుతుంది. రిషీ కొంచెం సేపు ఆటపట్టించి మొత్తానికి అసలు విషయం చెప్తాడు. అభినందించటానికి చేశానులే అంటాడు. అలా వాళ్లిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు..రిషీ నీకు చాలా విద్యలు తెలుసు వసుధార అంటే..వసూ మనసులో అన్నీ వచ్చు మిమ్మల్ని మీ మూడ్ ని అర్థంచేసుకోవటం తప్ప అనుకుంటుంంది.
కట్ చేస్తే ఇద్దరు రాత్రి ఒక ప్లేస్ లో ఉంటారు. వసూ ఎందుకో ఇక్కడ వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది సార్ అని అంటుంది. రిషీ అది మనం చూసే మూడ్ ని బట్టి ఉంటుంది అనుకుని వసూని గతంలో కౌగిలించుకున్న సీన్ గుర్తుచేసుకుంటాడు. వసూ చలికి వణుకుతుంది. రిషీ కారులోంచి పొద్దున ఇచ్చిన శాలువా తీసి వసూకి కప్పుతాడు. సార్ ఇది మహేంద్రసార్, ఫణీంద్ర సార్ ఇచ్చిన శాలువాకదా కోపంతో ఇస్తున్నారా అని అడుగుతుంది వసుధార. దానికి రిషీ భలేగా చెప్తాడు. చిన్నప్పుడు మనం ఆడుకున్న వస్తువులను ఎవ్వరికి ఇవ్వము..మనసుకి బాగా దగ్గరైన వాళ్లకు తప్ప అంటాడు. వసూ మురిసిపోతుంది. నీకు ఎప్పటినుంచే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నా..డబ్బు పెడితే ఖరీదు పెరుగుతుంది తప్పా విలువ ఉండదు అందుకే మా డాడీ, పెద్దనాన్న ప్రేమతో నాకు కప్పిన శాలువాను నీకు ఇవ్వటం కంటే పెద్ద గిఫ్ట్ ఇంకోటి ఉండదు అనుకన్నాను..అందుకే మనస్పూర్తిగా నీకు కప్పాను అంటాడు రిషీ. వసూ మనసులో ఎంత మంచి మనిషి సార్ మీరు అనుకుంటుంది. ఇంతలో జగతి వసూకి మెసేజ్ చేస్తుంది. ఏంటి మీ మేడమ్ హా అంటాడు రిషీ. హా ఇంకా ఇంటికి రాలేదని ఆరటపడుతున్నారు సార్ అంటుంది వసూ..ఆరటపడుతున్నరా, ఆరాతీస్తున్నారా అని అంటాడు రిషీ.
ఇంకోసీన్ లో మహేంద్ర పొద్దున జరిగింది తులుచుకుని పాపం జగతి బాగా ఫీల్ అయింది అనుకుంటాడు. ఇటువైపు జగతి కూడా అలానే అనుకుంటుంది. ఇంతలో మహేంద్ర ఫోన్ చేసి వసుధార ఇంటికి వచ్చిందా అంటాడు. ఏ రిషీ ఇంకా రాలేదా అంటుంది జగతి. అంటే ఇద్దరు కలిసేవెళ్లారని మహేంద్ర అంటాడు. నువ్వు ఫిక్స్ అయిపోయావా మహేంద్ర అంటుంది జగతి. ఇలా మాట్లాడుకుంటూ ఉంటూ.మహేంద్ర జగతీ ఈ రిషీ వసుధారలు ఎక్కడికి వెళ్లిఉంటారంటావ్ అంటాడు. జగతి మహేంద్రో నీకు మాట చెప్పనా అని గుడ్ నైట్ చెప్తుంది.
ఇటువైపు రిషీ- వసూ కారులో వెళ్తుంటారు. పెళ్లి భరాత్ జరుగుతుంది. ఏంటిది అని హారన్ కొడుతాడు..5నిమిషాలు ఆగండి సార్ మీరు అంటాడు ఒకడు. వసూ మాత్రం పెళ్లి, జ్ఞాపకాలు అంటుంది. కారులోంచి వెళ్లి బొకే ఇచ్చి వాళ్లతో మాట్లాడుతుంది వసూ. కారులో ఉన్న రిషీ ఈ వసుధారకు కొత్తపాత ఏం ఉండదు అనుకుంటాడు. ఒక అతను వచ్చి డ్యాన్స్ చేయండి అంటాడు….వసూ ఇరగదీస్తుంది డ్యాన్స్.. కారులో రిషీ షాక్ అవుతాడు. కారు దిగి బయటకొచ్చి చూస్తాడు. రిషీ డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది. అక్కడున్నవాల్లు వచ్చి రిషీని కూడా ఒక స్టెప్ వేయమని తీసుకొచ్చి మధ్యలో నిలబెడతారు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో రిషీ కూడా డ్యాన్స్ వేస్తాడు. రిషీ నువ్వు ఇలాంటి జ్ఞాపకాలను బాగా వెనకేసుకుంటావ్ కదా అంటాడు వసూతో. మీ జ్ఞాపకాల్లో నేనున్నానా సార్ అంటుంది వసూ..ఇంకోసీన్ లో మహేంద్రతో రిషీ..ఈ తీన్మార్ డ్యాన్స్ గురించి మీకు తెలుసా డాడ్ అంటాడు ..నువ్వు వేశావా అంటే మీరు వేశారా అంటూ మహేంద్ర ఎటకారంగా అంటాడు. రిషీ ఏం చెప్తాడో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
– Triveni Naidu