గుప్పెడంతమనసు 305 ఎపిసోడ్ : నాకు వసుధార కావాలని తల్లిని అడిగేసిన రిషీ..!

-

గుప్పెడతంమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ, మహేంద్ర, ఫణీంద్ర మాట్లాడుకుంటారు. ఎగ్జామ్స్ అయిపోయాక చేసే కార్యచరణను రిషీ మహేంద్రవాళ్లకు చెప్తాడు. ఇంతలో వసూ మహేంద్రకు కాల్ చేస్తుంది. అది రిషీ చూసి ఈ పొగరేంటో పొద్దున్నే డాడ్ కి కాల్ చేసింది అనుకుంటాడు. మహేంద్ర బయటకు వచ్చి మాట్లాడతాడు. వసూ మిమ్మల్ని కలవాలి సార్ అంటే.. అవును నేను చాలా మాట్లాడాలి అంటాడు మహేంద్ర. సాయంత్రం రెస్టారెంట్ కి రండి అంటుంది. సరే అమ్మా, జగతిని పిలవకు అంటాడు. కాల్ కట్ చేసి వెనక్కుతిరిగి చూస్తే..రిషీ ఉంటాడు. ఏంటి డాడ్.. తనతో కూడా పక్కకి వచ్చి మాట్లాడాలా అంటే.. అక్కడ అన్నయ్య ఉన్నాడుగా అని మహేంద్ర చెప్పి కవర్ చేస్తాడు.

ఇంకోవైపు కాలేజ్ లో వసుధార, పుష్పా మాట్లాడుకుంటూ వస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ టాపిక్ వస్తుంది. గతంలో ప్రాజెక్టు నుంచి వసూని తీశేశారుగా..ఇప్పుడు మళ్లీ తీసుకోరా, సార్ మనసులో ఏముంది అనుకుంటుంది. ఎగ్జామ్ మొదలవుతుంది. కట్ చేస్తే ఎగ్జామ్ అయిపోతుంది. పుష్పా, వసూ మాట్లాడుకుంటూ వస్తారు. మహేంద్ర కాల్ చేస్తాడు. త్వరగా వచ్చేయమ్మా నేను రెస్టారెంట్ దగ్గర్లోనే ఉన్నాను అంటాడు. వసూ బయలుదేరుతుంది. రిషీ క్యాబిన్ లో ఉండే వసూ కోసం చూస్తాడు. ఎగ్జామ్ రాసాకా వచ్చికలవాలిగా, నేను పిలుస్తాను అని పిలవాలి అని చూస్తుందా, నేను ఎందుకు పిలవాలి అని బెల్ కొట్టి అటెండెర్ తో వసూని పిలవమంటాడు. జగతి వస్తుంది. ఎగ్జామ్ పేపర్స్ ని ప్రోపర్ గా సీల్ చేశాను అంటుంది. ఇంతలో అటెండర్ వచ్చి వసూధార వెళ్లిపోయింది అంటాడు. అంతే..రిషీకి కోపం వస్తుంది. వాట్ అలాఎలా వెళ్లిపోతుంది. ఎగ్జామ్ అయిపోయాక కలవాలికదా మేడమ్, మనం వసుధార పనిచేసే రెస్టారెంట్ కి వెళ్లాలి మీరు మీ కారులో బయలుదేరండి మేడమ్ అంటాడు. జగతీకి ఏం అర్థంకాదు. సరే సార్ అంటుంది.

రిషీ కారు దగ్గరకు వచ్చే సరికి ఫణీంద్ర తన కారు ట్రబుల్ ఇచ్చిందని ఇద్దరం కలిసి వెళ్దాం అంటాడు. రిషీ తన కారు తీసుకొని వెళ్లండి పెద్దన్నాన్న, నేను క్యాబ్ లో వెళ్తాను అంటాడు. ఫణీంద్ర మొదట ఒప్పుకోడు..రిషీ ఒప్పించి పంపిస్తాడు. జగతి కూడా బయటకు వస్తుంది. అంతా చూస్తుంది. సార్ మీ కారు అని జగతి అంటే..మా పెద్దనాన్నగారికి ఇచ్చాను అంటాడు. వసూని కలుద్దాం అన్నారు, అవును కలుద్దాం అంటాడు రిషీ. మీరు ఎలా వస్తారు సార్ అంటే..క్యాబ్ లో వస్తాను అంటాడు రిషీ. జగతి లిఫ్ట్ ఆఫర్ చేయబోతే..రిషీ ఒప్పుకోడు, ఒక్కోసారి అన్నీ ఉన్నా అవసరానికి ఏదీ ఉండదు అంటూ కొటేషన్స్ చెప్తాడు. జగతి నేనూ అటే వెళ్తున్నాను కదా, నా కారులో రావొచ్చుకదా సార్ అంటుంది. రిషీ మొదట ఒప్పుకోడు..సరే మీరు నా వ్యక్తిగత విషయాలు మాట్లాడనంటే…నేను మీ కారులో వస్తాను అంటాడు. జగతి మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను రండి సార్ అంటుంది. నేను డ్రైవ్ చేస్తాను కీ ఇవ్వండి అంటే..పర్లేదు సార్ నేను డ్రైవ్ చేస్తాను అంటుంది జగతి. రిషీ వెళ్లి కుర్చుంటాడు. జగతి డ్రైవింగ్ సీట్ లో కుర్చుంటుంది. జగతి మనసులో ఆనందంపడిపోతూ ఉంటుంది. స్టాట్ అవుతారు.

జగతి డ్రైవింగ్ చేస్తూ..పక్కనే కొడుకునూ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. రిషీ మనసులో అనవసరంగా కారులో కుర్చున్నానా అనుకుంటాడు. జగతి రిషీ వైపే చూస్తూ డ్రైవ్ చేస్తుంటుంది. రిషీ ముందుకు చూసి డ్రైవ్ చేయండి అంటే..ఇది నా కారు సార్ నేను చెప్పినట్లే వింటుంది అంటుంది జగతి. జగతి పదే పదే రిషీనే చూస్తుంది. రిషీ కారు ఆపండి మేడమ్ అని కారు దిగి..నేను డ్రైవ్ చేస్తాను అంటాడు. జగతి సరే అని ఒప్పుకుంటుంది. రిషీ వెనక కుర్చోమన్నా, మీరు డ్రైవ్ చేస్తుంటే నేను వెనుక కుర్చోవటం బాగుండదు సార్ అని పక్కనే కుర్చుంటుంది. భవిష్యత్ ఏమనుకుంటున్నారు మేడమ్ అంటాడు రిషీ..జగతి చూసేసరికి..నేను వసుధార భవిష్యత్ గురించి అడుగుతున్నాను మేడమ్ అంటాడు రిషీ. వసుధార భవిష్యత్తు డిసైడ్ చేయటానికి నేను ఎవర్ని సార్, తన జీవితం తన ఇష్టం, తనకంటూ ఒక గోల్ ఉంది..అందులో ఏమైన సాయం చేయగలిగితే నేను చేస్తాను అంటుంది జగతి. రిషీ నాకు వసుధార కావాలి మేడమ్ అంటాడు. జగతికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news