గుప్పెడంతమనసు 324 ఎపిసోడ్: వసూ కోసం ఏకంగా కాలేజ్ కే వచ్చేసిన గౌతమ్..చూసి ఉడుక్కుంటున్న రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసుధార గౌతమ్ కి కాల్ చేస్తుంది. ఇప్పుడెందుకులే అని వీడు ఎత్తడు…మహేంద్ర వాళ్లను బతిమిలాడతాడు. ముందా ఫోన్ ఎత్తులే గౌతమ్ అని మహేంద్ర అనటంతో.. గౌతమ్ లిఫ్ట్ చేసి..స్పీకర్ ఆన్ చేస్తాడు. వసుధారను మాట్లాడుతున్నాను అంటుంది. గౌతమ్ కి ఒక్కసారిగా ఆనందం మామూలుగా ఉండదు. రిషీ వచ్చి రేయ్ వసుధార నీకు ఫోన్ చేసిందా అంటే..కొంచెం పర్సనల్ కాల్..మళ్లీ మాట్లాడతాను అంటాడు. వసూ మీ కార్డ్స్ కొన్ని నా బ్యాగ్ లో ఉండిపోయాయి అంటే..గౌతమ్ అవునా సో నైస్ అని ఇది మీ నంబర్ హేనా నేను సేవ్ చేసుకోవచ్చా అంటాడు. చేసుకోండి అంటుంది వసుధార. వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం మహేంద్ర, రిషీ వాళ్లు అదే పనిగా చూస్తారు. రిషీకి కోపం మాములుగా రాదు. కార్డు ఎప్పుడు తీసుకుంటారు అని వసూ అడగితే..ఈవినింగ్ మీ రెస్టారెంట్ కి వస్తాను..ఓ కప్పు కాఫీ షేర్ చేసుకుందాం అంటాడు గౌతమ్. సరే అని వసూ ఫోన్ పెట్టేస్తుంది. గౌతమ్ మాత్రం బాయ్ వసుధార అంటూ సాగదీస్తాడు.

ఫోన్ కట్ చేసి..ఈవినింగ్ కాఫీకి వెళ్దాం వస్తారా అంటే..రాను అంటారు. వసుధార నీకు ఎందుకు ఫోన్ చేసింది..నీ నంబర్ తన దగ్గర ఎలా ఉంది అని రిషీ అడగడంతో..గౌతమ్ పర్సనల్ మ్యాటర్స్ అడగొద్దు మిత్రమా అంటాడు. రిషీ మనసులో వసుధార తనకెందుకు కాల్ చేసి ఉంటుంది అనుకుంటాడు. జగతి, వసుధార కాలేజ్ లో వస్తుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాం..ఆ వివరాలు నువ్వు రిషీతో చెప్పాలి అంటే..వసూ నేను వెళ్లను అంటుంది వసూ. నువ్వు రోజు రోజుకి మొండిగా తయారవుతున్నాను అంటే..రోజు రోజుకి స్ట్రాంగ్ గా తయారువుతున్నాను అంటుంది వసూ. సరే నువ్వు చేయకుండే నాకు తప్పదుగా అని మహేంద్రకు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేయ్ అంటుంది. మహేంద్రకు మ్యాటర్ చెప్పి..మీటింగ్ పెట్టించమంటుంది. కాల్ కట్ చేసి..ఏంటో వసూ నీ పనులు కూడా నేనే చేయాల్సివస్తుంది అంటుంది జగతి. మేడమ్ మీరు రిషీ సార్ తల్లిగానే ఆలోచిస్తున్నారు, వసుధార గురువుగా ఆలోచించండి..నేనెందుకు సారీ చెప్పాలి మేడమ్ అంటుంది. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.

క్లాస్ లో వసూధార సీరియస్ గా రాసుకుంటూ ఉంటుంది. క్లాస్ కి రిషీ వస్తాడు. అందరూ లెస్తారు. వసూ చూసుకోదు. పుష్పా వసూ అన్నా వినిపించుకోదు. రిషీ వసూధరా అనటంతో లేచి నుల్చుంటుంది. లాస్ట్ క్లాస్ లో నోట్స్ ఎవరూ రాశారు అంటే..వసూ తప్ప ఎవరూ రాయరు. రిషీ వసూతప్ప ఎ‌వరు రాశారు అంటే..క్లాస్ లో ఎవరూ రాయరూ..రిషీ తిట్టడం మొదలుపెడతాడు. వసూ మెల్లిగా..పుష్పా నా నోడ్స్ తీసుకెళ్లి సార్ కి ఇవ్వు..లేదంటే ఇప్పుడు అందరిని తిడతారు అంటుంది. సార్ చూస్తారు అని పుష్ప అంటే..సార్ అవి అన్నీ ఏం చూడరు అని వసూ నోట్స్ పుష్పకి ఇస్తుంది. పుష్ప రిషీకి ఇస్తుంది. ఆ నోట్స్ లో గౌతమ్ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. రిషీ నోడ్స్ తీసుకోగానే అవి కిందపడతాయి. నోడ్స్ మీద పేరు చూసి..పుష్పని పిలిచి లాస్ట్ క్లాస్ లో చెప్పిన లెక్క వచ్చి బోడ్ మీద రాయి అంటాడు.

వసూ నోట్ బుక్ నాదే అని తెలిసినట్లు ఉంది..ఇప్పుడు ఇదొక తలనొప్పా..పక్కనే కుర్చోనే..దేవయాని గారి విషయంలో చేసినదానికి సారీ చెప్పమంటారేమో..నేను అసలు చెప్పను అనుకుంటుంది.రండి వచ్చి కుర్చోండి..మీరు ఎంత తిట్టినా నేను మాత్రం సారీ చెప్పను అనుకుంటుంది. రిషీ వస్తాడు. పక్కన కుర్చుంటాడు అనుకుని..వసూ జరుగుతుంది. మనోడు వేరే బేంచ్ లో కుర్చుంటాడు.

మరోసీన్ లో జగతి, మహేంద్రలు ఫణీంద్రకు మ్యాటర్ చెప్తారు. దేవయాని విషయంలో జరగింది చెప్తారు. ఫణీంద్ర ఇది మన ఫ్యామిలి ప్రాబ్లమ్..దేవయాని ఎప్పుడూ ఇలానే చేస్తుంది కదా అంటాడు. మొత్తానికి మీరో, నేనో చెప్తే..రిషీ అస్సలు నమ్మడు, నమ్మించడానికి చూస్తే అది నిజం ఎలా అవుతుంది అంటాడు ఫణీంద్ర. మరి ఏం చేద్దాం అని మహేంద్ర అంటే..ఈ విషయాన్ని కొన్నాళ్లు పట్టించుకోవద్దు, మీటింగ్ అన్నీ సిద్దం చేశారా అంటే..చేశాను అని జగతి అంటుంది. మీరు ఆ పనిలో ఉండండి అంటాడు ఫణీంద్ర. ఇద్దరూ బయటకు వస్తారు.

బయటకురాగానే..గౌతమ్ ఉంటాడు. మహేంద్ర జగతి, గౌతమ్ లను ఒకరికొకరు పరిచయం చేస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి చెప్పి ఆ ప్రాజెక్టు రూపకర్త ఈ మేడమే అంటాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటుండగా..వసుధార వస్తుంది. గౌతమ్ నువ్వు మా రిషీకి ప్రాజెక్టులో రైట్ హ్యాండ్ అంటకదా అంటాడు. వీళ్లు ఇలా మాట్లాడుకోవటం..రిషీ చూస్తాడు. ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో వసూ పుష్పాతో గౌతమ్ గురించి బాగా చెప్తుంది. నవ్వుతూ గలగలా మాట్లాడతాడు గౌతమ్ సార్..మన రిషీ సార్ ఉన్నారు అసలు నోట్లోంచి మాటే రాదు అంటుంది. ఇవన్నీ రిషీ వింటాడు. వసూ పుష్ప కు నోట్ బుక్ ఇద్దాని ఓపెన్ చేస్తూనే..అందులోంచి నెమలీక ఎగిరి రిషీ షట్ లో ఇరుక్కుంటుంది. అది తీసుకుని రిషీ వసూ దగ్గరకు వచ్చి నువ్వు మీ మేడమ్ మా పెద్దమ్మకు సారీ చెప్పాలి, చెప్పున్నారు అంటాడు. వసూ చెప్పడం లేదు సార్ అంటుంది. జగతి ఆరోజు దేవయాని మాట్లాడేది అంతా రికార్డ్ చేసినట్లు సమాచారం..ఒకవేళ అదే నిజమైతే..వసూ రెస్టారెంట్ లో సీసీ టీవీ ఫుటేజ్ కూడా తీసి రెండు కలిపి రిషీకి చూపిస్తుందట..ఒకవేళ వసూ చూపిస్తే..దేవయాని బండారం బయటపడనిట్లే.