గుప్పెడంతమనసు సెప్టెంబర్ 17 ఎపిసోడ్-245: రెస్టారెంట్ లో శిరీష్-వసుధారలను చూసేసిన రిషీ..బాధ్యతలేదని వసూకి చివాట్లు

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రెస్టారెంట్ లో ఉన్న శిరీష్ కాఫీ తాగుతూ చాలా బాగుంది అంటాడు. షాపింగ్ అన్నావ్ అయిపోయింది, కాఫీ అన్నావ్ తెచ్చి ఇచ్చాను ఇంకాసేపాగి డిన్నర్ అంటావేమో నాకస్సలు కుదరదు అంటుంది వసు. ఈ ఐడియేదో బాగుంది అంటాడు శిరీష్. అయినా నువ్వేంటి వసూ ఎప్పుడుచూసిన వెళ్లిపోమంటావ్, నా కంపెనీ, నా మాటలు చాలా బాగుంటాయ్ అంటారు చాలా మంది అంటాడు. వసూ నవ్వురావటం లేదంటూనే నవ్వుతుంది. ఇలా మాటల్లో మునిగిపోతారు. కరెక్ట్ టైంకి రిషీ వస్తాడు. వాళ్లను అలా చూసి.. కాలేజ్ లో మీటింగ్ ఎగ్గొట్టి వచ్చింది ఇందుకా అనుకుని పక్క టేబుల్ లో కుర్చుంటాడు. వాళ్లను అలానే చూస్తాడు. శిరీష్ ఇకనువ్వెళ్లు, నేను రిషీసార్ కి ఫోన్ చేయాలి అక్కడ ఆయన ఎంతకోపంగా ఉన్నారో ఏంటో అంటుంది వసూ. శిరీష్ చేయ్ ఎవరొద్దన్నారు అంటాడు. వసూ ఫోన్ చేస్తుంది. సౌండ్ పక్కనే రావటంతో వసూ అటుఇటూ చూసి రిషీసార్ ని చూస్తుంది. లేచి నిలబడి శిరీష్ రిషీసార్ వచ్చారు అని ఇద్దరు రిషీ దగ్గరకు వెళ్తారు.

రిషీసార్ మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది వసూ. వచ్చేముందు నీ పర్మిషన్ తీసుకుందాం అని ఫోన్ చేశాను, కానీ స్విచ్ఛ్ ఆఫ్ వచ్చింది అంటాడు. శిరీష్ హాయ్ సార్ అంటాడు. శిరీష్ తన గురించి పెట్టిన మెసేజ్ గుర్తుచేసుకుని రిషీ..హలో శిరీష్ గారు, మీరు మెసేజ్ లు భలే పడతారు సార్ అంటాడు రీషీ. సార్ అదీ అంటూ శిరీష్ అంటాడు. కానీ రిషీ.. నా గురించి బాగానే స్టడీ చేసినట్లు ఉన్నారు, కానీ మీరు అనుకున్నవి అన్నీ నిజాలే అవ్వాలని లేదు కదా శిరీష్ గారు అంటాడు రిషీ.. శిరీష్ సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతాడు.

వసూ టెన్షగ్ ఏం తీసుకుంటారు అని అడుగుతుంది. రిషీ..కొంచె క్లారిటీ తీసుకుంటాను అంటాడు. వసుధార, నువ్వు తెలివైందానివి, అన్నీ తెలిసిందానివి, పైగా యూత్ ఐకాన్ టైటిల్ విజేతవి. ఇవన్నీ అర్హతలు ఉన్నాయనే కదా నిన్ను ప్రాజెక్టులో నా అసిస్టేంట్ గా పెట్టుకుంది. అవునా కాదా అంటాడు. వసూ అవును సార్ అంటుంది. మరి నీకు పర్మిషన్ అవసరమైతో ఎవర్ని అడగాలి నన్నా మహేంద్ర సార్ నా అంటాడు. అవును సార్ కానీ అంటుంది వసు. ఈ కానీలు, కాకపోతేలు వద్దు వసుధార, నువ్వు చాలా సమర్థతకలదానివి.. సిన్సియర్ గా పనిచేస్తావని నేను నిన్ను నమ్మాను కానీ నా నమ్మకం కరెక్ట్ కాదని నువ్వు దర్జాగా నిరూపించావ్. నువ్వు గొప్ప ర్యాంక్ స్టూడెంట్ వే కాదనను, ఎక్కడికి వెళ్లినా నీకు సీటు ఇస్తారేమో..కానీ బాధ్యత అని ఒకటి ఉంటుంది కదా..మరిదాన్ని మర్చిపోతే ఎలా చెప్పు, మీ మేడమ్ గారు ఫైల్ మిస్సయిందని నిన్నుకోప్పడితే నేను నిన్ను సపోర్ట్ చేశాను. ఆరోజు నిన్ను మీ మేడమ్ తిట్టడం కరెక్ట్ నేమో కదా అంటాడు.

మీటింగ్ కి రాకుండా ఇక్కడ శిరీష్ తో మీటింగ్ పెట్టావ్ కదా అంటాడు. వసూ చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నీ మీటింగ్ బాగానే ఉంది, అక్కడ నీ వల్లే మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అనాల్సివి అన్నీ అనేసి..రిషీ సర్లే నీకు బాధ్యత లేదు, ఇది కాలేజ్ కాదు, నేను ఎండీని కాదు అంటాడు. వసూ పాపం అమాయకంగా..ఏంటీ సార్ మీరు నేను చెప్పేది అంటుంది..రిషీ కోపంగా ఒక కాఫీ ప్లీజ్ అంటాడు. వద్దులే కాఫీ తాగే మూడ్ కూడా పోయింది అని లేచి వెళ్లిపోతాడు. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.

ఆరోజు రాత్రి ఇంట్లో వసు లాప్ టాప్ లో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. జగతి చూస్తుంది. వసూ పడుకోవచ్చుగా ఇంకా ఏం చేస్తున్నావ్ అంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా నేను రిషీ సార్ స్లం ఏరియా విజిట్స్ కి వెళ్లిన వర్క్ అంతా టైప్ చేస్తున్నాను అంటుంది. ఇప్పుడే చెయ్యాలే అంటే రిషీ సార్ ఈరోజు మీటింగ్ లో ఆ చాట్ అడిగేవారే, ఒకవేళ ఇవ్వకపోతే కోప్పడతారు కదా అంటుంది. జగతి..వసు నీ సిన్సియారిటీకి మెచ్చుకోవాలో, నీకు రిషీమీద ఉన్న అతిభయానికి కోప్పడాలో అర్థంకావటం లేదు వర్క్ అయిపోగానే పడుకో అని వెళ్లిపోతుంది. మేడమ్ ఏంటి ఇలా మాట్లాడారు అనుకుని వర్క కంప్లీట్ చేస్తుంది. రిషీ సార్ ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు నిద్రపోతుంటారా అనుకుంటుంది

ఇటుపక్క రిషీ..తనకో వర్క్ అప్పచెప్పాను, ఈ పాటికి ఫినిష్ చేసి ఉంటుందా, ఇంకా మెసేజ్ చేయలేదంటే నిద్రోపోయి ఉంటుంది, మనం కూడా పడుకుందాం అనుకుంటాడు. ఇంతలో వసూ మెసేజ్ వస్తుంది. వర్క్ అయిపోయింది అని. రిషీ అది చూసి ఈ ముక్క రేపొద్దున అయినా చెప్పొచ్చుగా, రిప్లైయ్ ఇ‌వ్వాలా..ఇస్తే ఇంకా పడుకోలేదు తన మెసేజ్ కోసం ఇంకా పడుకోలేదు, తన మెసేజ్ కోసం నేను కళ్లు కాయలు కాసేలా ఎదురుచుశానేమో అనుకుంటుంది.నేను రిప్లైయ్ ఇవ్వను అనుకుంటాడు.

వసూ రిషీ సార్ ఏంటీ రిప్లైయ్ ఇవ్వటం లేదు అని వేరే మేసేజ్ పంపుతుంది. అదే మ్యాటర్ ని మార్చిపంపంది ఎన్ని తెలివితేటలు వసుధార అనుకుంటాడు రిషీ. వసూ..సార్ ఏంటి మెసేజ్ చూసికూడా రిప్లైయ్ ఇవ్వటం లేదు కాల్ చేయాలా అనుకుని చేయబోతుంది మళ్లీ వద్దులే అనుకుంటుంది..కానీ బై మిస్టేక్ కాల్ వెళ్లిపోతుంది. రిషీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అనుకోకుండా కాల్ వచ్చేసింది సార్ అంటుంది. ఓహో అవునా అనుకోకుండా కాల్ వచ్చే కొత్త ఆప్షన్ ఉందా నీ ఫోనులో అంటాడు. అంటే కాల్ చేయాలా వద్దా అనుకుంటుంటే వచ్చేసింది అని వసూ అంటుంది. అప్పుడు అనుకుంటుండగానే వచ్చినట్లేగా అంటాడు. సరే మెసేజ్ పంపాను అంటుంది వసూ. ఆ రెండు లైన్లను తారుమారు చేసి పంపావు. అవి కూడా అనుకోకుండానే వచ్చాయా అంటాడు రిషీ..

మన ఏరియా విజిట్ వివరాలన్ని చాట్ గా పాయింట్ వైజ్ గా తయారు చేశాను సర్ అంటుంది వసూ. ఒకే ఇప్పుడు టైం ఎంతమవుతుంది అంటాడు. ఇక్కడ 12దాటింది సార్ అంటుంది వసూ. ఇక్కడ 13 దాటుతుందా అని ఈ టైంలో ఈ మెసేజ్ అ‌వసరమా అంటాడు. అంటే మీరు చెప్పిన వర్క్ అయిపోయిందని చెప్పాలిగా అంటుంది. సిన్సియారిటీకే సిన్సియారిటీ నేర్పేలా ఉన్నావే అని గుడ్ నైట్ చెప్పి కాల్ చేస్తాడు. వసూ ఏంటో మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేస్తాడు అనుకుంటుంది. ఇదంతా జగతి చూస్తుంది. వసూకి దిమ్మతిరిగిపోతుంది.

మేడమ్ అంటుంది. వసూ టైం ఎంత అయింది, వసూ మళ్లీ ఇక్కడ 12దాటింది మేడమ్ అంటుంది. ఇక్కడేంటి ఇక్కడ ఈ టైంలో ఎ‌వరితో ఫోన్ అంటుంది. రిషీ సార్ తోనే వర్క్ అయిపోయిందని చెప్పాను అంటుంది వసూ. మెసేజ్ చేస్తే సరిపోతుందిగా కాల్ చేయాలా అని అడుగుతుంది. అనుకోకుండా వెళ్లిపోయింది మేడమ్ అని వసూ అంటుంది. జగతి..రిషీ నీకు ఒక లెక్చరర్ గురువు అంతవరకే..హద్దుల్లో ఉంటే మంచిదేమో అంటుంది. మీ అబ్బాయి అని తెలిశాక మీకు ఇచ్చే గౌరవం రిషీసార్ కి ఇవ్వకూడదా అంటుంది. వీలైతే నువ్వు రిషీకి దూరంగా ఉంటే మంచిది. అలా ఎలా కుదురుతుందని రిషీ సార్ ను పొగుడ్తుంది, సార్ జెంటిల్ మెన్ , సూపర్ అంటుంది. జగతి వెళ్లిపోబోతుంది. వసూ సారీ మేడమ్..నేనెమన్నా ఎక్కువగా మాట్లాడి ఉండొచ్చుకానీ నేను చెప్పినవన్నీ నిజం మేడమ్ అంటుంది. నువ్వు చెప్పాలనుకున్నవి అన్నీ చెప్పావ్ ఇక పడుకో అంటుంది.

మరుసటి రోజు ఉదయం రిషీ, మహేంద్ర కాఫీ తాగుతూ ఉంటారు. మహేంద్ర పేపర్ చదువుతూ ఉంటాడు. రిషీ పిలుస్తాడు. మహేంద్రకు వినపడదు. మళ్లీ పిలుస్తాడు. సారీ రిషీ, వినపడలేదు అంటాడు మహేంద్ర. ఉదయాన్నే సారీలతో మొదలుపట్టకండి, పేపర్ చదవండి కానీ నా ఎదురుగా చదివితే నాకెలా ఉంటుంది. మళ్లీ ఏమన్నా అంటే రిషీకి కోపం ఎక్కువా అంటారు. మహేంద్ర రిషీతో..నిన్ననే ఓ పుస్తకంలో ఒక వ్యాసం చదివాను అంటాడు. ఏం డాడ్ అది అంటాడు రిషీ. నువ్వు కోపగించుకోను అంటే చెప్తాను అంటాడు మహేంద్ర. కచ్చితంగా కోపం వచ్చేదే అయి ఉంటుందని రిషీ అంటాడు. కోపం తగ్గించుకోవటం ఎలా అని మూడు చిట్కాలు, భలే అనిపించింది లే అంటాడు మహేంద్ర. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news