గుప్పెడంతమనసు ఎపిసోడ్ 264 : వసూ ముందు అడ్డంగా బుక్కైన రిషీ..నువ్వు నా స్టూడెంట్ వా, మీ మేడమ్ స్టూడెంట్ వా అని వసూకి సూటి ప్రశ్న

గుప్పెడంతమనసు ఈరోడు ఎపిసోడ్ లో జగతి రిషీ చేసిన ఫోన్ లిఫ్ట్ చేసి..నేను వేరేవాళ్ల ఫోన్ తీయొద్దు అనుకున్నాను..కానీ రెండుసార్లు ఫోన్ చేసేసరికి ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుంది అని తీశాను అంటుంది. చెప్పండి సార్ ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది. రిషీ అంటే అది అని నసుగుతాడు..సర్ ఈ టైంలో ఫోన్ చేశారంటే..ఏదో ఇంపార్టెంట్ విషయమై ఉంటుంది కదా అంటుంది. మేడమ్..కాలేజ్ లో జరిగిన ఈవెంట్ గురించి తనని నేను ప్రత్యేకంగా అభినందిచాలనుకున్నాను అంటాడు. రేపొద్దునైనా అభినందించొచ్చుకదా సార్ అంటుంది. రిషీకి కాలిపోతుంది..ఇంత రాత్రివేళా… అంటుంది. రిషీ..మేడమ్ నా మనసుకు ఏదైనా అనిపిస్తే వెంటనే చెప్పేస్తాను, మంచైనా చెడైనా..చాలామంది దాన్ని కోపం అంటారు, దాన్ని నేను నా వ్యక్తిత్వం అంటాను..

వసుధారను నేనప్పుడు ప్రత్యేకమైన దృష్టితో చూస్తాను..ఎందుకంటే తను నాకు చాలా ప్రత్యేకం మేడమ్ అంటాడు. జగతి..సార్ మీ ప్రత్యేకమైన స్టూడెంట్ ని నిద్రలేపమంటారా అంటుంది. ఎందుకు అంటాడు రిషీ..అదే సార్ మీరు అభినందిస్తా అన్నారుగా, మనసులో ఏదైనా ఉంటే దాచుకోను అన్నారుగా, ఇప్పుడే అభినందిస్తారా..వసూని లేపనా అంటూ..వసూని లేపబోతుంది.. రిషీ.. మేడమ్ ఏంటి మీరు..తనని పడుకోనివ్వండి అంటాడు..మనసులో కావాలని చేస్తుందా ఏంటి అనుకుంటాడు. ఈ సీన్ భలే కామెడీగా ఉంటుంది. జగతి ఇక వసూ నిద్రపోతుంది నేను ఫోన్ కట్ చేయొచ్చా సార్ అంటుంది. రిషీ ఓకే ఒకే అంటాడు. జగతి ఫోన్ పెట్టేసి నవ్వుతుంది. మనసులో దాచుకుంటే బయటకి చెప్పలేవా రిషీ.. నీ మనసు నాకు తెలియదా రిషీ..నువ్వు వసుధారను ప్రేమిస్తున్నావు అంటే ఒప్పుకోలేదు..ఏదైనా ఒప్పుకుంటే నువ్వు రిషివి ఎలా అవుతావ్ అని వసూ చెవిలో గుడ్ నైట్ ప్రత్యేకమైన స్టూడెంట్ అంటుంది.

తెల్లారి..రిషీ కారులో వెళ్తూ రాత్రననగా ఫోన్ చేస్తే పొద్దున లేవగానే ఫోన్ చేయాలి కదా..ఈ యూత్ ఐకాన్ కి రానురాను భయంతగ్గిపోతుంది అనుకుంటాడు..ఇంతలో ఆటోలో వస్తూ వసూ ఫోన్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. రిషీ ఏం మాట్లాడడు..వసూ మళ్లీ గుడ్ మార్నింగ్ చెప్తుంది. వినబడింది అని రాత్రనగా ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తున్నావా అంటాడు. ఓ మీరు రాత్రి ఫోన్ చేశారంట కదా ఎందుకు సార్ అంటుంది వసూ. ఓహో తెలిసిందా..పర్లేదే..తెలిసినప్పుడు ఫోన్ చేయాలి కదా అంటాడు. వసూ సార్ అదీ అంటూ సాగిదీస్తుంది. రిషీ వద్దులే నువ్వేం చెప్పకు, నువ్వేదో కొత్తకథ చెప్తావ్ నేను నమ్మేస్తాను అంటాడు.

సార్ ఫోన్ ఎందుకు చేశారో తెలుసుకోవచ్చా, ఎప్పటిలాగే మర్చిపోయారా అంటుంది. గుర్తింది కానీ నేనిప్పుడు చెప్పను అంటాడు రిషీ..వసూ అదేంటి సార్ అంటుంది. అదంతే ..అవును నేనెప్పుడు ఫోన్ చేసినా..ఇద్దురూ ఒకే ఫోన్ వాడుతున్నట్లు ఆవిడతీస్తారేంటి అంటాడు. అదేంలేదుసార్..అలిసిపోయాను కదా తొందరగా నిద్రపోయాను, మీరు ఫోన్ చేసినప్పుడు మేడమ్ వచ్చారంట అంటుంది వసూ. ఓహో..ఇప్పుడేంటి మీ మేడమ్ తో పాటే వస్తున్నావా, స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతున్నావ్ కదా అంటాడు రిషీ. సార్ అలా నేనెందుకు చేస్తాను అంటుంది వసూ. ఏమో నా భయాలు నాకు ఉంటాయ్ కదా అంటాడు. అలా ఏంలేదు సార్ ఆటోలో వస్తున్నాను సార్ అంటుంది. సరే బాయ్ అంటాడు. వసూ ఫోన్ ఎందుకు చేశారో తెలుసుకోవచ్చా అంటుంది. చెప్తానులే తొందర ఎందుకు, ఆటోలో ఖాళీగా వస్తున్నావుగా ఆలోచించు అంటాడు. వసూ ఏదైనా క్లూ ఇస్తారా అంటే మనోడు బాయ్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

కాలేజ్ లో మహేంద్ర ఏదో ఫైల్స్ చూసుకుంటూ ఉండగా జగతి వస్తుంది. ఇంతకీ ఎందుకు రమ్మనట్టో అంటుంది జగతి. మీ పుత్రరత్నం గురించి అంటాడు మహేంద్ర. రాత్రంతా రిషీ ఫుల్ జోష్ గా ఉన్నాడంటా అని చెప్తాడు. మధ్యలో ఈ అట ఏంటి అంటుంది జగతి. ధరణి చెప్పింది నేను వెళ్లేవాడ్ని..మావయ్యగారు రిషీ ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు ఎందుకులే వెళ్లటం అనింది ధరణి అందుకే పోలేదు అంటాడు. అవును అక్కడ వసుధార పరిస్థితి ఏంటి అంటాడు. జగతి రాత్రి జరిగింది తలుచుకుని..వసుధార కూడా ఈ మధ్య ఎక్కువసేపే మేలుకూగా ఉంటుంది. కానీ రాత్రి నేను వెళ్లేలోపే నిద్రపోయింది అంటుంది. ఇంకోవైపు రిషీ వస్తూ ఉంటాడు. జగతి మహేంద్రతో..రిషీ మనసులో ఏముంది అని మనం అనటం కాదు..అది రిషీయో తెలుసుకోవాలి, తన మనసు తెలుసుకోలేని ప్రేమ అది ప్రేమెలా అవుతుంది, రెండూకళ్లూ మూసుకుని చుట్టూ చీకటి ఉందంటే తప్పు కదా మహేంద్ర అంటూ మాట్లాడుతుంది. ఇంతలో రిషీ వచ్చేస్తాడు. ఎక్స్క్యూస్మీ అంటాడు. జగతి లేచి నిలబడుతుంది. లోపలికిరావచ్చా డాడ్ అంటాడు. లోపలకి వచ్చి సారీ నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అంటాడు. మహేంద్ర అయ్యెయ్యో అలాంటిది ఏం లేదు రిషీ అంటాడు. అంటే మీ ఇద్దరు కాలేజ్ గురించి, మిషన్ ఎడ్యూకేషన్ గురించి మాట్లాడుకుంటున్నారేమో..డిస్టబ్ చేశానా అని నా ఉద్దేశం అంటాడు. మహేంద్ర మనసులో కొంపదీసి మా మాటలు విని ఇలా మాట్లాడుతున్నాడా అనుకుని కాలేజ్ గురించికాదు..జనరల్ టాపిక్స్ ఉంటాయ్ కదా అంటాడు. రిషీ జగతి ఇందాక అన్న మాటలను చెప్తూ..చీకటీ వెలుగు ఇవి జనరల్ టాపిక్స్ అని నాకు తెలుసు అంటాడు..కాలేజ్ లో జరిగిన ఎడ్యూకల్చర్ షో ను మీడియా బాగా కవర్ చేసింది కంగ్రాట్స్ చెప్తదామని వచ్చా అని ఇద్దరికి చెప్తాడు. జగతితో ఇంతకముందు చీకటి గురించి జగతి చెప్పిన ఉదాహరణు రిషీ తనవైపుకు చెప్పుకుని వెళ్లిపోతాడు.

వసూ మెట్లపై దిగి వస్తూ ఉంటుంది. రిషీ చూసి అమ్మో ఇప్పుడు చూసిందంటే…నిన్న ఫోన్ ఎందుకు చేశారని అడుగుతుంది అనుకుని కాల్ రాకపోయినా ఏదో కల్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తాడు. వసూ చూసి సార్ అని పిలుస్తుంది. అయినా రిషీ డమ్మీకాల్ లో మాట్లాడుకుంటూ వెళ్తాడు. అయినా మన వసూ వదలదుగా వెళ్లి రిషీకి అడ్డంగా నిలబడుతుంది. రిషీ ఇంకా ఆ డమ్మీకాల్ లో మాట్లాడుతున్నట్లే యాక్ట్ చేస్తాడు. అప్పుడే రిషీకి ఫోన్ వస్తుది..పిచ్చ కామెడీగా ఉంటుంది. వసూ నవ్వుతుంది. రిషీ అదీ అంటూ ఏదో చెప్పటానకి కవర్ చేస్తాడు..ఇలా దొరికిపోయానేంటి అనుకుంటాడు. వసూ సార్ మీరు నిన్న ఫోన్ ఎందుకు చేశారో చెప్పరా ప్లీజ్ అంటుంది. రిషీ సాయంత్రం తీరిగ్గా చెప్తాను అంటాడు.

ఇంతలో ఓ మేడమ్ వచ్చి నిన్న నువ్వు ప్రోగ్రామ్ చాలాబాగా చేశావ్ అంటూ వసూకి కంగ్రాట్స్ చెప్పి..రిషీతో కూడా చెప్తుంది..బాగా చేసిందికదా సార్ అని..రిషీ ఏం మాట్లడకుండా వెళ్లిపోతాడు. ఆ టీచర్ మాత్రం..నిన్ను జగతి మేడమ్ బాగా తీర్చిదిద్దారు, విద్యావికాస్ కాలేజీలో నువ్వు తన బెస్ట్ స్టూడెంట్ వి అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు, జగతీ మేడమ్ గ్రేట్ కదా అంటుంది.ఆ మాటలు విన్న రిషీ ఎక్స్క్యూస్ మీ మేడమ్ అని దగ్గరకు వచ్చి మేడమ్ మీరు అన్న మాటలను కొంచెం సరిదిద్దుకోవాలి అని..వసుధార ఇప్పుడు విద్యావికాసిని స్టూడెంట్ కాదిప్పుడు, వసుధార డీబీఎస్టీ కాలేజ్ స్టూడెంట్ అంటాడు. సారీ సార్ అని మేడమ్ చెప్పి వెళ్లిపోతుంది. నువ్వైనా చెప్పొచ్చుకదా నువ్విప్పుడు డీబీఎస్టీ కాలేజ్ స్టూడెంట్ వి, మీ మేడమ్ కూడా ఈ కాలేజ్ స్టాఫ్ మీ ఇద్దరు ఇంకా ఆ కాలేజ్ ని మర్చిపోలేదా అంటాడు. ఒక విషయం అడుగుతాను సూటిగా చెప్పు..నువ్వు ఇప్పుడు నా స్టూడెంట్ వా, మీ మేడమ్ స్టూడెంట్ వా అంటాడు. వసూ మైండ్ బ్లాక్ అవుతుంది..ఏం మాట్లడదు, రిషీ మళ్లీ అడుగుతాడు. వసూ జగతి మేడమ్ నా గురువు సార్, మీకు నేను స్టూడెంట్ సార్ అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ‌విడ గురువు అంది, నాకు స్టూడెంట్ అంది, మార్చి మార్చి చెప్పి నన్ను కన్‌ఫ్యూస్ చేసిందా అనుకుంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.