గుప్పెడంతమనసు ఎపిసోడ్ 276: వసుధారతో శిరీష్ తన పెళ్లిగురించి మాట్లాడాడని తెలిసి ఫైర్ అయిన రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ పిల్లలను కాలేజ్ గ్రౌండ్ లో ఆడుకోమన్నందుకు వసు మీరు చాలా గ్రేట్ సార్ అంటుంది. నేను కోల్పోయిన బాల్యం విలువేంటో నాకు తెలుసుకదా వసుధార అని కారులో వెళ్లి కుర్చుంటాడు. ఇటుపక్క రెస్టారెంట్ లో శిరీష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. వసూ ఇంకారాలేదు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మహేంద్ర వస్తాడు. వసుధార ఇంకారాలేదా అంటాడు. శిరీష్ జరిగింది చెప్తాడు. ఎందుకుసార్ రిషీ సార్ అంటే అంతభయం అంటాడు..భయంకాదు భక్తి, గౌరవం అభిమానం అన్నీ ఉన్నాయి అంటాడు మహేంద్ర. వీళ్లు ఇలా మాట్లాడుకుండగానే రిషీ, వసుధారలు రెస్టారెంట్ లోకి వస్తారు. వసూ కారు ఆగిన వెంటనే దిగబోతే రిషీ ఏంటి నువ్వు అలా వెళ్లిపోతున్నావ్ అంటాడు. మొత్తానికి ఇద్దరు రెస్టారెంట్ లోకి వెళ్తారు. వసూ మనసులో రిషీ సార్ లోపలికి రాకపోతే బాగుండు అనుకుంటుంది. కానీ రిషీ కాఫీ తాగుదాం అని వసూతో కలిసి లోపలికి వస్తాడు. శిరీష్ చూసి ఇప్పుడు రిషీ సార్ అవసరమా అని మెసేజ్ చేస్తాడు. ఆయనే వచ్చేశారు శిరీష్ అని వసూ అంటుంది. రిషీని చూసి మహేంద్ర వెళ్లిపోబోతాడు. రిషీ డాడ్ మీరేంటి ఇక్కడ అంటే..మహేంద్ర శిరీష్ ఏదో మ్యాటర్ మాట్లాడాలి అన్నాడు అందుకే వచ్చాను అంటాడు. వసూ కాఫీ తీసుకొస్తాఅని చెప్పి వెళ్లిపోతుంది.

రిషీ ఏమైంది శిరీష్ గారు అంటాడు. శిరీష్ ఏవిషయం సార్ అంటాడు. మీ ఇద్దరు ఏదో మాట్లాడాలనుకోవాలనుకున్నారుగా సైలెంట్ గా ఉన్నారు అంటాడు. ఇంతలో వసూ కాఫీ తెస్తుంది. రిషీ నాకు ఫుల్ వద్దు, ఆఫ్ చాలు అంటాడు. వసూ ఫుల్ గా తాగినా ఆఫ్ తాగినా బిల్ మాత్రం ఫుల్ గానే వేస్తాం సార్ అంటుంది. నేనెప్పుడైనా బిల్ కోసం కకృత్తిపడ్డానా..ఇంకో కప్ తెచ్చుకో సగం సగం తాగుదాం అంటాడు. పక్కనే ఉన్న మహేంద్ర ఓ 50 50హా అంటాడా.. వసూ వెళ్లి కప్ తెస్తుంది. రిషీ కాఫీ షేర్ చేస్తాడు. మహేంద్ర వండ్రఫుల్ అంటాడు. శిరీష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. రిషీ మీరేంటి ఏంమాట్లాడటంలేదు, సైలెంట్ గా ఉన్నారు, ఏదో మాట్లాడాలి అన్నారుగా మాట్లాడండి అంటాడు. మహేంద్ర వాళ్లిద్దరు ఏదో మాట్లాడుకోవాలనుకున్నారు అంటాడు. రిషీ కోపంతో లేచి చెప్పరేంటి మరి. వసుధార ఈ మాట చెప్తే రెస్టారెంట్ కి వచ్చేవాడ్నికాదుకదా, పదండి డాడ్ వెళ్దాం అంటాడు. మహేంద్ర రాడు. ఏం డాడ్ రారు అంటాడు రిషీ. మహేంద్ర వాళ్లు పర్సనల్ మాట్లాడుకుంటున్నారు నన్ను అని చెప్పబోతాడు..శిరీష్ ఇది మా ఇద్దరి పర్సనల్ సార్..మహేంద్ర సార్ ని అంటాడు. రిషీ ఇంతలోనే ఓహో మధ్యవర్తిత్వం వహిస్తున్నారా..సరే నేను వెళ్తున్నాను, ఒకరి పర్సనల్స్ మాట్లాడుకుంటే అక్కడే ఉండే అంత అది నాకు లేదు అని వెళ్లిపోతాడు.

శిరీష్ మహేంద్రతో మీరే మా ప్రాబ్లమ్ కి సింపుల్ సొల్యూషన్ చెప్పాలి సార్ అంటాడు. ఏంటి వసూ ఏం మాట్లాడవ్ ప్రాబ్లమ్ నా ఒక్కడిదే అయినట్లు చూస్తావ్, నీకు బాధ్యత ఉంది కదా అంటాడు. అసలు ఈ శిరీష్ ఏంటి ప్రాబ్లమ్ అనేది ఇంతవరకూ బయటకు చెప్పలేదు. మూడురోజులనుంచి సాగిదీస్తున్నారు. వసూ కోపంగా వెళ్లిపోయిన రిషీ గురించే ఆలోచిస్తుంది. రిషీ కారులో కుర్చుని రెస్టారెంట్ లో జరిగిన సీన్ గురించి ఆలోచిస్తాడు. అసలేమైంది, నాకేం అర్థంకావటంలేదు, అంతగా పర్సనల్స్ ఏం ఉంటాయ్ అనుకుంటాడు.

ఇంకోసీన్ లో దేవయాని, ఫణీంద్ర కుర్చుంటే..ధరణి వచ్చి అత్తయ్యగారు వంటేంచెయ్యమంటారు అంటుంది. ప్రతిరోజు నన్ను అడిగే చేస్తున్నావా, మీ మావయ్యముందు మార్కులు కొట్టేయటం కాకపోతే..అయినా ఈ ఇంట్లో నాకంత గౌరవం ఉందనుకుంటున్నావా అంటాడు. పక్కనే ఉన్న ఫణీంద్ర ఏమైంది దేవయాని ఎందుకు ఇంత చిరాకు, ఏదైనా ఉంటే అడిగేయొచ్చుకదా, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడతావ్ అంటాడు. దేవయాని నేను చెప్తూనే ఉంటాను, మీరు చేసేవి చేస్తూనే ఉంటారు అంటుంది. రిషీ గురించి మాట్లాడుతుంది. కాలేజ్ లో రిషీకి జగతి, వసుధారలు అడ్డంపడుతున్నారు. అసలు వాళ్లని ఎందుకు అంత నెత్తిన పెట్టుకుంటున్నారు అంటుంది. ఫణీంద్ర ప్రతిసారి నువ్వు ఇదే ప్రశ్న అడుగుతావ్, జగతి ఈ ఇంటి మనిషి కాదు అని ఆలోచించు , జగతి ఫ్యాకల్టీ హెడ్ తనవల్లే కాలేజ్ కి పేరువచ్చింది అంటాడు. ఇంతలో రిషీ వచ్చి పైకి వెళ్తుంటాడు..అది చూసిన దేవయాని కావాలని అవునండి ఆ జగతి ఫ్యాకల్టీ హెడ్ హే..అంతకంటే ముందు మహేంద్రను పెళ్లిచేసుకుంది. రిషీకి తల్లైంది..ఇవన్నీ మర్చిపోయి కేవలం ఫ్యాకల్టీహెడ్ గా ఎలా చూస్తారు అంటుంది. ఈ మాటలు విన్న రిషీ కిందకు వస్తాడు. దేవయాని వీరలెవల్ లో యాక్ట్ చేస్తుంది. రిషీ పెద్దనాన్న పెద్దమమ్మని బాధపెట్టకండి అంటాడు. ఫణీంద్ర మీ పెద్దమమ్మను నేనేం అనటం లేదు, అన్నీ తనే అంటుంది అంటాడు. రిషీ మీరేం బాధపడకండి ఫ్రష్ అప్ అయి వస్తాను అంటాడు.

ఇంతలో రెస్టారెంట్ లో శిరీష్ మహేంద్రకు మ్యాటర్ చెప్తాస్తాడు. మహేంద్ర ఇది ఆలోచించి తీసుకోవాల్సిన విషయమే. నువ్వు తీసుకున్న నిర్ణయంపై కట్టుబడి ఉన్నావా అంటాడు. అవును సార్ అంటాడు శిరీష్. వసుధార నువ్వేమంటావ్ నీకు ఓకేనా అంటాడు మహేంద్ర. ఇలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో రిషీ వసూకి వీడియోకాల్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్, తిన్నావా అంటాడు. కొత్తగా అడుగుతున్నారేంటి సార్ అంటుంది. ఇంకోసీన్ లో రిషీ మహేంద్రతో ఇంతకి వసుధారతో శిరీష్ ఏం మాట్లాడాడు అంటాడు. శిరీష్ తన పెళ్లిగురించి వసుధారతో మాట్లాడాడు అంటాడు మహేంద్ర. అంతే రిషీకి పిచ్చేలేస్తుంది. వసుధార ఒప్పుకుందా, అంతా తన ఇష్టమైనా అని కోపంగా వెళ్లిపోతాడు. మహేంద్ర ఓహో నీకు ఇలా అర్థమయ్యిందా అనుకుంటాడు. చూడాలి సోమవారం రిషీ ఏం చేస్తాడో.