గుప్పెడంతమనసు ఎపిసోడ్ 290: వసుధారమీద పుల్ ఫైర్ అయిన రిషీ..చిన్న విషయానికి ఇలా అరవటం కరెక్టు కాదంటూ మహేంద్ర సపోర్ట్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ రిషీతో ఫోన్ మాట్లాడుకుంటూ మీరు ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది అనుకుని ముందుకు వస్తుంది. నీకు అనిపిస్త అయిపోతుందా అని రిషీ అంటాడు. సార్ నిజం చెప్పండి ఎక్కడ ఉన్నారు అని నడుస్తూనే ఉంది. ఈ మద్య మీలో ఏదో మార్పు కనిపిస్తుంది సార్ అంటుంది. రిషీ మనసులో నువ్వు మారిపోయి నన్ను అంటున్నావా అనుకుని, విశ్లేషనలా అంటాడు. మీరు అంతకుముందులా లేరు సార్ అంటుంది. అంతకుముందులా ఎవరు ఉన్నారు అని నువ్వు మారిపోయావ్ కదా అంటాడు. వసూ అలానే నడుచుకుంటూ వచ్చి వీలుంటే రెస్టారెంట్ కి రండిసార్ అంటుంది. వీలులేదు అంటాడు రిషీ. వీలు చేసుకుని రండి అంటుంది. వీలుకాదురాను అంటాడు. వసూ అప్పుడే కారులో ఉన్న రిషీని చూస్తుంది. రిషీ కూడా చూస్తాడు. ఇదేంటి ఇలా దొరికిపోయాను అనుకుని కారు దిగుతాడు. వసూ ఏంటి సార్ ఇక్కడే ఉన్నారా, లేక ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చారా..చెప్పానా సార్..మీరు ఇక్కడే ఉన్నట్లు నా మనసుకు అనిపిస్తుంది అని..నేను అనుకున్నాను అయింది అంటుంది. రిషీ మనుసులో నువ్వు అనుకున్నవన్నీ అవుతాయ్ లే వసుధార అనుకుంటాడు. లోపలికి రండిసార్ అంటుంది వసూ. రాను అంటాడు రిషీ. అదేంటి సార్ ఇక్కడివరకూ వచ్చీ లోపలికి రారా అని వసూ అడిగితే..ఒక్కోసారి ఎంతదాక వచ్చినా వెనక్కి వెళ్లక తప్పదు, నాకు పనుంది అంటాడు. వసూ రండీసార్ ప్లీజ్..నేను డ్యూటీలో జాయిన్ అవ్వాలి, ఎక్కవ సేపు మాట్లాడలేను అంటుంది. అవును లే నాకు ఎక్కువ టైం ఇవ్వవని నాకు తెలుసు బాయ్ అని కారులో కుర్చుంటాడు. వసూ కాఫీ సర్ అంటే.. నో థ్యాంక్స్ అని, ఊరెళ్తున్నా అన్నావుగా, మిషన్ ఎడ్యుకేషన్ ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్లు అని చెప్పేసి వెళ్తాడు.

వసూ ఇంటికి వచ్చేస్తుంది. జగతి ఏంటి వసూ తొందరంగా వచ్చేశావ్, రెస్టారెంట్ కి వెళ్లలేదా. ఏంటి అలా ఉన్నావ్, రిషీ ఏమైనా అన్నాడా అంటుంది. రిషీ సార్ అనడానకి ఏముంది, అయినా ప్రతిదానికి నేను రిషీ సార్ వల్ల డిస్టబ్ అవ్వాలని లేదు కదా అంటుంది వసూ. జగతి నీ మనసులో ఏముందో తెలియదు కానీ, ఏవేవో దాచి ఇబ్బందిపడుతున్నావ్ అనుకుంటున్నాను అని మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం ముఖ్యం వసూ అని జగతి వసుధారకు ఇలా జీవితం గురించి మంచిమాటలు చెప్తుంది. వసుధార కూడా మాట్లాడి..ఫైనల్ గా నా ప్రమేయం లేకుండా జరిగేవాటికి బాదపడటం తగ్గిస్తాను మేడమ్ అని వెళ్లిపోతుంది.

ఇంకోవైపు రిషీ తప్ప అందరూ ఆరోజు రాత్రి భోజనం చేస్తుంటారు. ఫణీంద్ర ధరణీతో రిషీ భోజనం చేశాడా అంటే.. లేదు అని చెబుతుంది. మహేంద్రతో ఎందుకు తినలేదో కనుక్కో నా భోజనం అయిపోయింది అని వెళ్లిపోతాడు. దేవయాని రిషీ తిన్నాడో లేదో కూడా కనుక్కోవా మహేంద్ర అంటుంది. వాడు నా కొడుకు వదినా అంటాడు మహేంద్ర. అయినా ఈ మధ్య నీ శ్రద్ధ వేరేవాళ్లమీద ఉంటుందిలే అంటుంది. ఇంతలో జగతి మహేంద్రకు ఫోన్ చేస్తుంది. దేవయాని కావాలని అన్నంతినేప్పుడే ఆత్మీయులు పలకరిస్తారట అంటుంది. మహేంద్ర థ్యాంక్స్ వదినా జగతి నాకు ఆత్మీయురాలని గుర్తుచేసినందుకు అంటాడు. కాల్ చేసి మాట్లాడు మహేంద్ర అంటుంది దేవయాని. సెల్ ఫోన్ లో ఏంటి వదినా..మేము మనసులలతోనే మాట్లాడుకుంటాం, భోజనాలు చేస్తూ ఫోన్ మాట్లాడుకోవటం ఎందుకు అని ఆగాను..అంతే కానీ మీకు అని ఆపేస్తాడు..భయపడి కాదంటాం అంతేకదా అని దేవయాని అంటుంది. జగతి చాలా దగ్గరకు వచ్చినట్లు ఉంది కదా, ధైర్యం కూడా వచ్చినట్లు ఉంది అంటుంది. మహేంద్ర పక్క ఛైర్ చూపిస్తూ..ఇక్కడికి రావటమే మిగిలిపోయింది వదినా అంటాడు మహేంద్ర. రానిస్తాననే అనుకుంటున్నావా మహేంద్ర..అసంభవం అంటుంది దేవయాని. అందులోంచి ఒక అక్షరమే తీసేయండి వదినా.. సంభవం అవుతుంది దర్జాగా మాట్లాడుతాడు మహేంద్ర. ఇలా ఒకళ్లనొకళ్లు గట్టిగా వాదించుకుంటారు. ఫైనల్ గా మహేంద్ర..కురిసే వర్షాన్ని ఎవరూ ఆపలేనట్లుగా..కలిసే బంధాన్ని ఎవరూ ఆపలేరు..వెన్నెల వస్తుంది దానికోసమే వెయిట్ చేస్తున్నాము..అని చెప్పేసి వెళ్తాడు. దేవయానికి బాగా కాల్తుంది. మీ జీవితాలకు వెన్నెల రాదు..ఈ ఇంటికి జగతి రాదు అనుకుని వెళ్లిపోతుంది.

మరోపక్క వసూ రూంలో రిషీ అన్న మాటలను తలుచుకుని..రిషీ సార్ కి ఏమైంది ఈ మధ్య, నాతో సరిగా మాట్లాడటం లేదు, నేనేమైనా తప్పుచేశానా, ఏం చేయాలి, సార్ తిట్టినా పర్లేదు ఫోన్ చేస్తాను అని కాల్ చేస్తుది. మనోడు అప్పటికే నిద్రపోతుంటాడు. ఈ మాత్రం ప్రశాంతంగా కూడా నన్ను ఉండనివ్వవా అనుకుని కాల్ కట్ చేసి నన్ను డిస్టబ్ చేయకు అని మెసేజ్ చేస్తాడు. వసూ ఏమైంది సార్ కి..సార్ మీకు కోపం ఎందుకు వచ్చిందో చెప్పండి లేకుంటే నాకు నిద్రపట్టదు అని మెసేజ్ చేస్తుంది వసూ. రిషీ ఏం చెప్పాలి నీకు, ఎవరూ మాటు వినవుగా, పెళ్లి చేసుకుంటున్నావ్ గా పెళ్లి అనుకుని ఫోన్ ఆఫ్ చేసి పక్కనేస్తాడు.

వసూ కాల్ చేస్తే ఫోన్ స్విఛ్చ్ ఆఫ్ వస్తుంది. రిషీ సార్ సెల్ స్విచ్ఛ్ ఆఫ్ చేయటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది.అలా చేయరే..నేను సార్ ని అర్థం చేసుకున్నాను అనుకున్నాను..కానీ పూర్తిగా అర్థంచేసుకోలేదేమో అనుకుంటుంది. తెల్లారుతుంది. రిషీ కాలేజ్ వస్తాడు. కారుదిగగానే వసుధార స్వీట్స్ తో రెడీగా ఉంటుంది. పెళ్లికి తప్పుకుండా రండీసార్ అంటుంది. మనోడుకి కాలిపోతుంి. వసూ మీరే మా చీఫ్ గెస్ట్ అంటుంది. వద్దు నాకు స్వీట్స్ వద్దు ఏం వద్దూ అంటాడు. కట్ చేస్తే అక్కడ ఉంది వసూ కాదు వేరే స్టూడెంట్. నాకు పెళ్లి ఫిక్స్ అయిందని ఆ స్టూడెంట్ స్వీట్ ఇస్తుంది. రిషీ వద్దని పంపిస్తాడు. రిషీ ఏమైంది నాకు ఎందుకు నేను వసూ ఆలోచనలోంచి బయటకురాలేకపోతున్నాను, ఏంటీ తలనొప్పినాకు, వసుధార నా నుంచి దూరంగా వెళ్లిపో..నాకు కనిపించకు అని ఇటుచూసే సరికి వసూ పేపర్స్ ఏవే తీసుకుని నడుస్తూ ఉంటుంది. ఇదేంటి వెళ్లిపోమంటే వస్తుంది..స్వీట్స్ తెస్తుందేమో నేను అస్సలు తీసుకోను అనుకుంటాడు. వసూ ఆ పేపర్స్ చూసుకుంటూ కాల్ స్లిప్ పేపర్స్ అన్ని కిందపడేస్తుంది. మళ్లీ వాటిని తీసుకుంటూ ఉండగా గాలికి అవి రిషీ దగ్గరకు వస్తాయి. రిషీ తీసి ఇస్తాడు. వసూ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంకూ సార్ అంటుంది. వెళ్తా అన్నావు కదా అంటాడు రిషీ. మీరు మెసేజ్ కి ఆన్సర్ ఇవ్వలేదు అంటుంది. ముందు నేనొక ప్రశ్న అడిగాను కదా అంటాడు రిషీ.. నేనెక్కడి వెళ్తాను సార్ అని వసూ అంటే..పెళ్లికి పర్మిషన్ అడిగారు కదా అంటాడు రిషీ. దానికి ఇంకా టైం ఉంది సార్, ఎగ్జామ్ టెన్షన్ నుండి స్టూడెంట్ని రిఫ్రెష్ చేయటానికి జగతి మేడమ్ కొన్ని పాయింట్స్ రాశారు అని వసూ చెప్పబోతుంది. రిషీ నేను అడిగానా అంటాడు..అంటే ఈ పేపర్స్ ఏంటో చెప్పటం నా ధర్మం కదా సార్ అంటుంది. అడిగినప్పుడు చెప్దుకానిలే, ఏదో అడిగినవి అన్నీ చెప్పినట్లు..పుష్పని నా క్యాబిన్ కు రమ్మను అని చెప్పేసి వెళ్లిపోతాడు.

రిషీ క్యాబిన్ లో ఉండగా పుష్పా వస్తుంది. మనోడు పుష్పా నువ్వు అమేజింగ్, సూపర్, పేపర్ లో ఆర్టికల్ చదివాను, ఏమన్నా రాశావా అంటూ పొగిడేస్తుంటాడు. కంగ్రాస్ట్ చెప్తాడు. పుష్పా సైలెంట్ గా ఉంటుంది. నువ్వు ఇంతబాగా రాస్తావని నేను ఊహించలేదు అంటాడు. పుష్పా సార్ ఆ ఆర్టికల్ నేను రాయలేదు అంటుంది. మరి ఎవరు రాశారు అంటాడు. వసుధార రాసింది అని చెప్తుంది. అంతే ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో వసుధారను క్యాబిన్ కు పిలిపించి అరుస్తాడు. నిన్ను ఎవరు రాయమన్నారు అని. వెంటనే మహేంద్ర, జగతి కూడా వస్తారు. మహేంద్ర ఇంత చిన్నవిషయానికి నువ్వు ఇలా అరవటం కరెక్టుకాదు అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తే నేనెందుకు నాకు ఈ సీట్ ఎందుకు, వసుధార కాలేజ్ సిస్టమ్ ని ధిక్కరించింది అంటాడు. చూడాలి రిషీ వసుధారకు ఏం పనిష్మెంట్ ఇస్తాడో.

Read more RELATED
Recommended to you

Latest news