గుప్పెడంతమనసు 296: వర్షంలోనూ పట్టుదల విడువని వసుధార..నువ్వు మారావ్ అంటే నువ్వు మారావ్ అని రిషీ వసూల గొడవ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ కారుకు అడ్డంగా నిలబడిని వసూని చూసి రిషీ కారు ఆపుతాడు. రోడ్డుగా ఏంటిది అని రిషీ అంటే..అడ్డదిడ్డంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే అడ్డగించే హక్కు, అడిగే హక్కు నాకు ఉన్నాయి, మీతో మాట్లాడాలి కారు దిగండి సార్ అంటుంది వసూ. నాకు నీతు మాట్లాడటానికి ఏం లేదు అని రిషీ అంటాడు. నేను మాట్లాడాలి, నాకు సమాధానం కావాలి, నన్ను మీ అసిస్టెంట్ బాధ్యత నుంచి ఎందుకు తప్పించారు అంటుంది వసూ. నీకు ఇంతకు ముందే చెప్పాను, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను తీసేసినట్లు లెటర్ ఇస్తాను, అందులో వివరాలు చదువుకో అని రిషీ అంటాడు. వసూ ఫుల్ ఫైర్ లో ఉంటుంది. నాకు ఇప్పుడే సమాధానం కావాలి సర్ అంటుంది, నేను చేసిన తప్పేంటి, ఏ కారణం చూపించి నన్ను తొలగిస్తున్నారు, మీరే నాకు పిలిచి ఆ గౌరవం ఇచ్చారు, నేను నా పోస్టుకి తగిన న్యాయం చేశాను అని వసూ అంటుంది. నువ్వు అనుకుంటే సరిపోదు వసుధార నేను అనుకోవాలి అని రిషీ అంటాడు. అదే సార్ ఏంటి కారణం, నా గౌరవాన్ని ఎందుకు తుడిచేస్తున్నారు, సర్ మీరు ఎందుకో ఏదో మనసులో పెట్టుకుని నన్ను సాధిస్తున్నారు, మీ మనసులో ఏం ఉంది, నా మీద మీకు ఎందుకు అంత కోపం అంటుంది. రిషీ ఆ ఎంగేజ్ మెంట్ విషయమే గుర్తుచేసుకుంటాడు. నిన్ను ఎందుకు తీశారు అని ఎవరైనా అడిగితే నేను ఏమని చెప్పాలి, ఇది నాకు ఎంత అవమానం సార్, మీ మనసులో ఏముందో నాకు తెలియాలి సార్ అంటుంది వసూ. ఎవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు పట్టలేదు, అలాంటి స్థితిలో నేను లేను అని రిషీ అంటాడు. నా తప్పేంటో చెప్పి వెళ్లండి అంటుంది వసూ. నీకు ఎవరూ భయపడురు అని రిషీ కారు వెనక్కు తీస్తాడు. వసూ మీరు సమాధానం చెప్పేదాక ఇక్కడ నుంచి కదలను అని వసూ అంటుంది. అయినా రిషీ ‌వెళ్లిపోతాడు.

ఆరోజు రాత్రి ఇంట్లో జగతి, మహేంద్ర వసూ రాలేదని కంగారు పడతారు. రిషీ నీకు ఏమైనా ఫోన్ చేశాడా అని జగతి అంటే..నేను ఫోన్ చేస్తే తీయలేదు అని మహేంద్ర అంటాడు. జగతి ఇలా వసూ గురించి టెన్షన్ పడుతుంది. రిషీని అంత గొప్పగా అర్థంచేసుకున్న వసుధార రాజీనామా చేసేవరకూ వెళ్లిందంటే..ఎంత బాధపడిందో అర్థంచేసుకోవాలి మహేంద్ర అంటుంది జగతి. మహేంద్ర నేను రిషీకి చెప్పేదంతా చెప్పాను..కానీ వాడు చేసేది చేస్తాడు అంటాడు. రిషీకి ఫోన్ చేసి వసూ ఎక్కడుందో కనుక్కోవా అని జగతి చెప్తుంది. మహేంద్ర కాల్ చేస్తాడు. కానీ ఈ రిషీ కట్ చేస్తాడు. వర్షం వచ్చేలా ఉంది, వసూ తొందరగా వస్తే బాగుండూ అనుకుంటుంది.

వసూ పాపం అలానే అదే ప్లేస్ లో నుల్చుని ఉంటుంది. రిషీ మాటలను తలుచుకుని బాధ ఓ పక్క కోపం ఓ పక్కతో రగిలిపోతూ ఉంటుంది. ఉరుములు రావటంతో జగతి మహేంద్రలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. బయటవాతావరణం బాలేదు, ఏదోఒకటి చేయి మహేంద్ర అంటే..రిషీ తో మాట్లాడతాను అంటాడు మహేంద్ర. రిషీ రూంలో వసూ రోడ్డుపైన అన్న మాటలనే తలుచుకుంటూ ఉంటాడు. మహేంద్ర కాల్ చేస్తే..నేనున్న మూడ్ లో డాడ్ తో మాట్లాడలేను, కట్ చేసి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ లో పెడతాను అనుకుని అలానే చేస్తాడు. మహేంద్రకు కోపం వస్తుంది. నేను ఫోన్ చేస్తుంటే ఆన్స్రర్ చేయడు అంటాడు. ధరణీకి కాల్ చేస్తాడు. మహేంద్ర కోపంగా రిషీ ఇంట్లో ఉన్నాడా అంటే.. ఉన్నాడు అంటుంది. ఫోన్ తీసుకెళ్లి ఇవ్వు అంటాడు. ధరణీ విషయం చెప్తుంది. ఫోన్ చేస్తే నేను కట్ చేసాను, మీకు ఫోన్ చేస్తే ఏం అనుకోవాలి అని ఫోన్ తీసుకుంటాడు, నేను మాట్లాడే మూడ్ లో లేను అని ఫోన్ కట్ చేయబోతాడు రిషీ..మహేంద్ర కోపంగా బుద్ది ఉందా నీకు ఫోన్ చేస్తే కట్ చేస్తావ్ అని వసుధార ఇంకా ఇంటికి రాలేదు, మీ ఇద్దరూ ఎక్కడైనా కలిశారా, అసలే బయట వాతావరణం బాలేదు, నీకు తెలుసా అంటే..రిషీకి అర్థమవుతుంది..ఉన్నపలంగా బయటకు వెళ్తాడు.

అప్పటికే వర్షం వస్తుంది. వసూ ఆ వర్షంలోనే అలా నిలబడి ఉంటుంది. రిషీ వస్తాడు. వెళ్లి వసుధార నీకు ఏమైంది, మతిపోయిందా, ఏంటి వర్షంలో నుల్చున్నావ్, రా వెళ్దాం అంటాడు. వసూ ఏం మాట్లాడదు, నీకు ఏమైంది, ఏంటీ మొండితనం, వర్షంలో తడుస్తూ ఇలానే ఉంటావా అంటే నాకు సమాధానం కావాలి సార్, మీకు వెళ్లేప్పుడే చెప్పాను, నాకు సమాధానం చెప్పేవరకూ ఇక్కడే ఉంటాను అని అంటుంది. రిషీ వర్షంలో తడుస్తూ ఇలానే ఉంటావా, రా అంటాడు రిషీ. నేను రాను అంటుంది వసూ. వెళ్దాం రా అని వసూ చేయి పట్టుకోని తీసుకెళ్తబోతాడు..వసూ చేయివిదిలించుకుని నేను రాను అని అరుస్తుంది. నాకు సమాధానం కావాలి సార్ అంటుంది.

ఏం సమాధానం కావాలి అంటే..నన్ను ఉద్యోగం లోంచి ఎందుకు తీశారో నాకు సమాధానం కావాలి అంటుంది వసూ. ఛానల్ ఇంటర్వూలోంచి నువ్వు వెళ్లిపోయావ్ అందుకు అంటాడు. వెళ్లిపోతే అదే రోజు తీసేయాలి కదా ఇప్పటిదాక ఎందుకు ఆగారు అని వసూ అంటే..నేను ఏం చేయాలో కూడా నువ్వే చెప్తావా అంటాడు రిషీ. హ్యాండ్ రెజిలింగ్ అప్పుడు కూడా పోటీలో అందరి ముందు నన్ను అవమానించారు, ఒక్క జగతి మేడమ్ దగ్గర అందరితో మీరు బాగుంటారు సార్, మీరు జెంటిల్ మెన్, నా దగ్గర ఎందుకో మీరు మారిపోయారు సార్ అంటుంది. నేను మారిపోలేదు వసుధార అంటాడు రిషీ. మీరు మారిపోయారు సార్, నా మీద ఎంత కోపం వచ్చినా కాసేపటికే మర్చిపోయేవారు, ఆ రిషీ సార్ కాదు మీరు అంటుంది. ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో రిషీ కూడా ఎమోషనల్ అవుతాడు.. నువ్వు మారలేదా , మనసులో ఉన్నవన్నీ చెప్పే వసుధారవి కాదు నువ్వు, మారింది నువ్వు వసుధార అంటే.. నేను మారలేదు సార్ అంటుంది వసూ. మారావ్,..మారకపోతే శిరీష్ తో నీ పెళ్లి అని నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు రిషీ. సార్ నేను శిరీష్ పెళ్లి చేసుకుంటున్నామని మీతో ఎవరు చెప్పారు సార్ అంటుంది వసూ..అంతలోనే కళ్లుతిరిగి పడిపోతుంది. రిషీ వసూని ఎత్తుకుని తీసుకెళ్తాడు. చూడాలి రేపటి ఎపిసోడ్ ఎంత రసవత్తరంగా మారబోతుందో.

Read more RELATED
Recommended to you

Latest news