తెలంగాణ ఎమ్మెల్సీ ఎంపికలో బిగ్ ట్విస్ట్… బండ ప్రకాష్ కు కేబినెట్ బెర్త్‌?

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు ఆయన పేరు ప్రస్తావనే లేకున్నా.. ఒక్కసారిగా తెరపైకి వచ్చారు బండ ప్రకాష్.

బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా తెలంగాణ మంత్రిత్వ శాఖలో బెర్త్ ఖరారు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను… ఎమ్మెల్సీగా చేసేందుకు సన్నద్ధమయ్యారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్… స్థానాన్ని భర్తీ చేసేందుకే ముదిరాజు సామాజికవర్గం నుంచి.. బండ ప్రకాష్ ను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. బండ ప్రకాష్ తో పాటు త‌క్కెళ్ల‌ ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు ఖరారు చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు నాయకులు ప్రగతి భావన్  చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news