గుప్పెడంతమనసు 307: జగతి ముందు వసూని బుక్ చేసిన రిషీ..అడగకనే అన్నీ ప్రశ్నలు అడిగేసిన జగతి..!

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో కాలేజ్ లో రిషీ ఒక్కడే బాస్కెట్ బాల్ ఆడుతూ..వసూగురించి ఆలోచిస్తాడు. గతంలో మహేంద్ర నువ్వేంటో నీ మనసేంటో క్లారిటీ ఉండాలి రిషీ అన్న మాటలు గుర్తుకువస్తాయి. ఏం సమాధానం చెప్పుకోవాలి, వసుధారే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది అనుకుంటాడు. ఇంకోవైపు ఆటోలో వస్తున్న వసూ..రిషీ గురించి ఆలోచిస్తుంది. రెస్టారెంట్ కు ఎందుకు వచ్చారు అసలు, శిరీష్ కి నాకు పెళ్లి అని ఎందుకు అనుకున్నారు, ఎవరు చెప్పారో కూడా ఇంతవరకూ చెప్పలేదు అనుకుంటుంది. ఇంతలో ఆటో డ్రైవర్ కాలేజ్ దగ్గరకు తీసుకువచ్చి..మేడమ్ అడ్రస్ వచ్చింది అంటాడు. అదేంటి కాలేజ్ దగ్గరకు తీసుకువచ్చావ్ అంటే..మీరు ఇదే చెప్పారు అంటాడు డ్రైవర్..పరధ్యానంలో చెప్పి ఉంటాను..సర్లే ఎలాగో వచ్చాను కదా..కాసేపు కుర్చోని వెళ్తాను అనుకుంటుంది. ఆటో దిగేసరికి సెక్యురిటీ చూసి ఏంటీ మేడమ్ ఈ టైంలో వచ్చారు, రిషీసార్ రమ్మన్నారా అంటాడు. ఏంటీ రిషీ సార్ ఇక్కడే ఉన్నారా అంటే..అవును మేడమ్ అంటాడు. సరే నేను కలుస్తాను అని వసూ రిషీ దగ్గరకు వెళ్తుంది. రిషీ చూసి వసుధార ఈ టైంలో నువ్వేంటి కాలేజ్ లో అంటే..సార్ అది అనుకోకుండా వచ్చాను సార్ అంటుంది వసూ. ఆహా..అలా కూడా వస్తారా అని రిషీ అంటే..మీరేంటి సార్ ఈ టైంలో అని వసూ అంటే..రావాలనిపించింది వచ్చాను అంటాడు రిషీ. నాకు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో అని వసూ చెప్పబోతే.. ప్రమోషన్ ఇచ్చాను కదా అని రిషీ అంటే..అదే ఎందుకు సార్ అన వసూ అడుగుతుంది. తీసేస్తే ఎందుకు అని అడగొచ్చు, ప్రమోషన్ ఇస్తే ఎందుకు అంటావేంటి అని..మా డాడ్ కి ఫోను ఎందుకు చేశావో తెలుసుకోవచ్చా అంటాడు. సార్ అదీ అని వసూ నసుగుతుంది. అంత ఇబ్బంది అయితే చెప్పొద్దులే అని..మీ మేడమ్ ఏమైనా చెప్పమన్నారా అని..మళ్లీ పర్సనల్ అయితే వద్దులే అంటాడు. బాస్కెట్ బాల్ ఆడటం వచ్చా అని అంటాడు. వసూ పెద్దగా అని చెప్పబోతుంది..సరే నేర్పిస్తాను అంటాడు.
ఇద్దరు కలిసి ఆడతారు.వసూ గోల్ వేయలేకపోతుంది. నేర్సిస్తాను లే అంటాడు రిషీ. ఇలా ఇద్దరూ ఆడుతుండగా..ఒకరికొకరు టచ్ అవుతూ ఉంటారు. రిషీ గోల్ వేస్తాడు. ఇంతలో ఫోన్ రావడంతో రిషీ వెళ్తాడు. వసూ గోల్స్ మీద గోల్స్ వేస్తుంది వసూ. రిషీ వచ్చి నీ బాస్కెట్ బాల్ బాగానే వచ్చా అంటే..కొంచెం కొంచెం వచ్చు అంటుంది. అంటే ఇందాక కావాలనే ఓడిపోయావా అంటే..అలా ఏం లేదు సార్ అంటుంది. నేను వెళ్తాను అంటుంది వసూ..ఎలా వెళ్తావ్ అని రిషీ అంటే..వసూ ఆటోలో వెళ్తా అంటుంది. రిషీ డ్రాప్ చేద్దాం అనుకుంటాడు.మళ్లీ జగతి మేడమ్ చూస్తేందేమో అని డ్రైవర్ కు కాల్ చేస్తాను, కారులో వెళ్లు అంటాడు రిషీ. వసూ మొదట ఒప్పుకోదు..రిషీ బలవంతం చేస్తాడు. ఆటోలు ఉండవు కారులో వెళ్లు అని. వసూ వెళ్తుండగా కాలి పట్టి ఊడిపోతుంది. అది రిషీ చూసి తీసుకుంటాడు.
తెల్లారుతుంది. వసూ సోఫాలో పడుకుంటుంది. జగతి చూసి వసూ ఏంటి ఇక్కడ పడుకుంది..రాత్రి లేటుగా వచ్చిందనమాటా..ఈ మధ్య వసూ పద్దతి ఏం బాలేదు అనుకుని..వసూని లేపుతుంది. మేడమ్ ప్లీజ్ మేడమ్ 5మినిట్స్ మేడమ్ అని పడుకుంటుంది వసూ. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. రిషీ వస్తాడు. వసుధార అంటే..జగతి సోఫావైపు చూస్తుంది. నిద్రలేపమంటారా సార్ అని జగతి అంటే..వద్దొద్దు అంటాడు రిషీ. ఏమైనా చెప్పమంటారా అంటే..ఏం లేదు మేడమ్ అని ఆ పట్టీ చూపిస్తాడు. తనదే, రాత్రి పారేసుకుంది తీసుకోండి అని జగతికి ఇస్తాడు. రాత్రుళ్లు తను ఒంటరిగా తిరగొద్దని మీరు చెప్పరా మేడమ్ అనేసి రిషీ వెళ్లిపోతాడు.
జగతికి కోపం వస్తుంది. వచ్చి వసూని లేపుతుంది. వసూ లేస్తుంది. ఆ పట్టీ చూపిస్తే..మేడమ్ ఇది నాదే..ఏంటి ఇక్కడ, కిందపడిందా అని వసూ అంటే..ఎక్కడ పడిందో, ఎక్కడ దొరికిందో అని అడిగే అవకాశం నాకు ఇవ్వలేదు రిషీ సార్ అంటుంది జగతి. రిషీ సార్ వచ్చారా అని వసూ అడిగితే..వచ్చి వెళ్లిపోయారు, నిద్రలేపమంటారా అంటే వద్దన్నాను అంటుంది జగతి. రాత్రి పడిపోయినట్లు ఉంది, రిషీ సార్ గ్రేట్ కదా మేడమ్ అని వసూ అంటుంది. అవునవును మామూలు గ్రేట్ కాదు..మహా గ్రేట్, పోగొట్టుకున్న నువ్వు గ్రేట్, తెచ్చిచ్చిన రిషీ సార్ గ్రేట్..మధ్యలో నాదేందంట అంటుంది జగతి.వసూ మనసులో మేడమ్ కి కోపం వచ్చినట్లు ఉంది అనుకుని మేడమ్ రాత్రి అని చెప్పబోతుంది. జగతి నువ్వేం చెప్పొద్దు వసూ..నేను అడిగినా ఏంటి, రెస్టారెంట్ డ్యూటీ అయ్యాక చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి వసూ అని నేను అడిగానా లేదు కదా, కాలేజ్ కి సెలవులున్నా రాత్రి వేళల ఏటు వెళ్తున్నావ్ వసూ అని నేను అడిగానే లేదు కదా అని..ఆ పట్టి చేతిలో పెట్టి, వసూ నీకు అన్నీ తెలుసు, చిన్నపిల్లవుకాదు, నువ్వేళ్లే దారేంటో నీకు తెలిస్తే చాలు అని చెప్పేసి వెళ్లిపోతుంది అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయిభాగంలో రిషీ వసూ కారులో వెళ్తుండగా..కారు టైర్ పంచర్ అయ్యి రిషి కారు ఆగిపోవడంతో వసుని వెనక్కి వెళ్లి రిషీ తొయ్యమంటాడు. పాపం రిషీ తోస్తుంది. రిషి ముందు సీట్‌లో కుర్చుని ఉంటాడు..ఈ సీన్ భలే ఆసక్తిగా ఉంది. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.