గుప్పెడంతమనసు 326 : గౌతమ్ ని వసూకి దగ్గరకానివ్వకుండా కాపాడుకుంటున్న రిషీ..అయినా తగ్గని గౌతమ్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ ఫ్లోలో అంత అహంకారం ఏంటి ఆ పొగరుకు అంటాడు. మహేంద్ర పొగరేంటి..నీ ఫోన్లో అంటూ సాగదీస్తాడు. రిషీ టాపిక్ డైవర్ట్ చేయకండి..పెద్దమ్మకు సారీ చెప్పిస్తారా లేదా అంటాడు. ఇంతలో గౌతమ్ వస్తాడు. నాకోక చిన్న హెల్ప్ కావాలిరా అంటాడు..ఏంట్రా కార్ కావాలా అని కీస్ ఇస్తాడు రిషీ. నీ కంపెనీ కూడా కావాలి రా అంటాడు గౌతమ్. ఎక్కడికి అంటే..స్పెషల్ కాఫీ పార్టీ ఉందన్నాకదరా అని గౌతమ్ అంటే..నేను రాను అంటాడు రిషీ. సరే అని గౌతమ్ మహేంద్రకు అంకుల్ మీరు పదండి మనం వెళ్దాం..వసుధారతో కాఫీ పార్టీ అంటాడు గౌతమ్. అంతే..రిషీ మొఖం మాడిపోతుంది. రిషీ పొరపాటున..వెయిట్ బాల్ ను కిందపడేయబోతాడు..మహేంద్ర పట్టుకుని..జాగ్రత్త రిషీ..ఒక్కసారి పడితే మళ్లీ దక్కవు..వస్తువులు అయినా బంధువులు అయినా అంటాడు. గౌతమ్ రండి అంకుల్ అంటే..రిషీ పదరా వెళ్దాం అంటాడు. అదేంట్రా ఇప్పుడేగా రాను అన్నావు అని గౌతమ్ అంటే..ఇప్పుడు వస్తాను అన్నానుగా అంటాడు.

ఇద్దరూ రెస్టారెంట్ కి వస్తారు. రెస్టారెంట్ లో వసూని చూసి గౌతమ్ యాంక్సైటీ అవుతాడు. గౌతమ్ వేరే టేబుల్ లో కుర్చోబోతే..రిషీ ఇది వసుధార టేబుల్ కాదు అని..వీళ్లు రెగ్యులర్ గా కుర్చునే టేబుల్ దగ్గరకి తీసుకెళ్తాడు. గౌతమ్ ఏంట్రా నువ్వు రోజు ఇక్కడికి వస్తావా అంటే..నేను చెప్పానా అంటాడు రిషీ. మీ ఇద్దరూ బాగా క్లోసా అంటే..నేను అన్నానా అంటాడు. కాసేపటికి వసూ వస్తుంది. ఆర్డర్ ప్లీజ్ అంటే..మీ రెస్టారెంట్ లో ఏది టేస్టీగా ఉంటుంది అంటాడు గౌతమ్. వసూ అన్నీ బాగుంటాయ్ అంటుంది. మెనూ పట్టుకురా అని గౌతమ్ అంటే..ఏం వద్దూ కాఫీ చాలు అంటాడు రిషీ. విన్నారుగా కాఫీ కావాలి..దాంతోపాటు మీ కంపెనీ కూడా కావాలి..అంటే మీతోకలిసి కాఫీ తాగాలనే కదా వచ్చింది అంటాడు గౌతమ్. మనోడికి కాల్తుంది. మరి నేనెందుకు వెళ్తానురా అని లేవబోతాడు. గౌతమ్ రేయ్ ఏంట్రా నువ్వు..ముగ్గురం కలిసి సరదాగా కాఫీ తాగుదాం..కాసేపు మనతో జాయిన్ అవ్వు అంటాడు గౌతమ్. అంటే మీతో జాయిన్ అవ్వాలంటే..నాకు కాస్త టైం పడుతుందని వసూ అంటే..మీకోసం ఎంత సేపు అయినా..వెయిట్ చేస్తాను అని గౌతమ్ అంటాడు. మీరు వెయిట్ చేస్తారు సర్..కానీ సార్ ఉండాలికదా అని వసూ అంటే..ఉంటాడులే..ఏరా నువ్వు కాళీయేగా అని గౌతమ్ అంటాడు. రిషీకి అప్పటికే కోపంతో రగిలిపోతుంటాడు..లేచి వెళ్లిపోబోతాడు. గౌతమ్ ఆపి ఇది కరెక్టు కాదురా, కలిసివచ్చాం కలిసి వెళ్లాలి అంటాడు…మళ్లీ గౌతమ్ నీకు అర్జెంట్ వర్క్ అయితే వెళ్లరా వెళ్లు వెళ్లు అంటాడు. వెళ్లిపోతాడు రిషీ.

వసూ సార్ వెళ్తున్నారు కదా మీరు ఆపొచ్చుకదా అంటే..వెళ్లనీ వసుధార ..ఎవరి అభిప్రాయాలు వాళ్లవి..మనం రుద్దకూడదు అంటాడు. ఇక్కడ రిషీ కారు దగ్గరకు వచ్చి..అసలు ఏంటి వసుధార వెళ్తున్నా అంటే..ఆపాలికదా..తనకు ఆమాత్రం తెలియదా..అసలే వాడికి దూకుడు ఎక్కువ, వసుధారకు పొగరు ఎక్కువ..ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటారో, తిట్టుకుంటారో..అయినా నాకేంటి అంట..నేను వెళ్తాను అని రిషీ వెళ్లిపోతాడు.

లోపల గౌతమ్..వసూకి పులిహోర కలుపుతాడు. మీరు ఈ డ్రస్ లో కూడా అందంగా ఉన్నారు అంటే..వసూ ఆర్డర్ ప్లీజ్ అంటుంది. పొగిడినా కూడా ఎలాంటి చలనం లేదేంటి అనుకుంటాడు గౌతమ్. కాఫీ టీ ఈ రెండింటిలో ఏది బాగుంటుంది అని గౌతమ్ అంటే..రెండూ బాగుంటాయ్ అని వసూ అంటే..మళ్లీ రిషీ వచ్చి మూడు కాఫీ అంటాడు. గౌతమ్ నాకు తెలుసురా..నువ్వు నన్ను వదిలేసి వెళ్లవని అంటాడు. మీ ఇద్దరిని వదిలేసి వెళ్తే..మళ్లీ ఏం కొత్తగొడవ అని వచ్చానురా ఈడియట్ అనుకుంటాడు రిషీ. గౌతమ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ విరా..అంటూ వసూకి రిషీ గురించి చెప్తాడు. నీ డ్యూటీ ఎప్పుడు అయిపోతుందని అని గౌతమ్ అడిగితే..కొంచెం టైం పడుతుంది సార్ అంటుంది వసూ.

ఇక్కడ మహేంద్ర జగతి ఇంట్లో ఉంటాడు. రిషీ చెప్పిన మాటలు చెప్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని మహేంద్ర..వసుధారతో దేవయాని అక్కయ్యతో సారీ చెప్పిస్తావా అంటుంది జగతి. నేను వాడు అన్నమాటలను చెప్పాను అంతే అంటాడు మహేంద్ర. జగతి మా తప్పేం లేదని నువ్వే రిషీకి చెప్పాలి అంటుంది. ఇలా జగతి చెప్పమని..మహేంద్ర రిషీతో డీల్ చేయటం అంత ఈజీ కాదు అని మాట్లాడుకుంటారు. దేవయాని అక్కయ్య రిషీని తనకు నచ్చిన శిల్పంలా మార్చేసింది..ప్రతివిషయాన్ని తనలో తనే దాచుకుంటాడు. బయటకు చెప్పడు..ఈ గొడవ కారణంగా..వసూ రిషీల మధ్య దూరం పెరుగుతుంది..పెరిగిన దూరాన్నిర రిషీ ఎలా తీసుకుంటాడో ఒకసారి ఆలోచించూ..తిడితే రెండు మాటలు పడు పర్వాలేదు..వాడిమనసులోని భారాన్ని, అపార్ధాన్ని నువ్వేం తీసేయగలవు..తొందరపడు మహేంద్ర అని జగతి చెప్పి వెళ్లిపోతుంది. మహేంద్ర ఏదో ఒకటి చేయాలి, రిషీ వసూకి ఎంత దూరం అయితే..జగతీకి కూడా దూరం అయినట్లే ఏదో ఒకటి చేయాలి అనకుంటాడు.

రిషీ వాళ్లు వసుధారను ఇంట్లో డ్రాప్ చేస్తారు. వసూతో పాటు గౌతమ్ కూడా దిగుతాడు. నువ్వు ఏందుకు దిగావురా అని రిషీ అంటే..ఇలాంటప్పుడు కేవలం డ్రాప్ చేస్తే ఏం బాగుంటుంది రా..తలుపుతట్టి వాళ్ల అమ్మానాన్న తలుపుతీయగానే..వాళ్లకి నమస్కారం పెట్టి..ఇదిగోండి అంకుల్ మీ అమ్మాయి అని చెప్పాలి అంటాడు గౌతమ్. లోపలికి పిలిస్తే కాఫీయో టీయో తాగటం..వీలును బట్టి వాళ్ల ఫ్యామిలీతో గ్రూప్ ఫొటో తీయటం అంటాడు. గొప్పగొప్ప ఆలోచనలు చాలా ఉన్నాయిరా..ఇంట్లో వాళ్ల అమ్మానాన్నలు ఉండరు అంటాడు. ఎవరో ఒకరు ఉంటారుకదా..వాళ్లేవరో తెలుసుకోవాలి కదా..అయినా కరెక్టుగా వాళ్ల ఇంటిముందు ఆపావ్..వాళ్ల ఇంటికి రెగ్యులర్ గా వస్తావా అని గౌతమ్ అడిగితే..వసూ బాయ్ గౌతమ్ సార్ అని చెప్పేసి వెళ్తుంది. గౌతమ్ చుశావా..నాకు బాయ్ చెప్పిందికానీ..నీకు చెప్పలేదు చూశావా అంటాడు. వసుధార ఆగు వస్తున్నా అని వసూ పిలవకపోయినా గౌతమ్ వెళ్తాడు. ఇంతలో మహేంద్ర, జగతీలు బయటకు వస్తారు. వాళ్లను చూసి గౌతమ్ చూస్తాడు. ఎపిసోడ్ అయిపోతుంది.