బ్రేకింగ్ : ఏపీలో ఓటీఎస్ ప‌థ‌కం ప్రారంభం.. 46 లక్షల మందికి ల‌బ్ది

ఏపీలో వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ప్రారంభం అయింది. కాసేప‌టి క్రిత‌మే… ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి… పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాజమాన్యపు హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న వర్గాలను ఆదుకోవటానికి ముందుకొచ్చింది. ప్రభుత్వం కొంత నిర్దిష్ట మొత్తం ఆధారంగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

jagan
jagan

ఇవాళ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పథకం ప్రారంభించింది ఏపీ స‌ర్కార్‌. ఇక ఈ ఓటీఎస్ ప‌థ‌కం ద్వారా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్‌ ద్వారా 46 లక్షల 61 వేల 737 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఈ ప‌థ‌కం పై ఆది నుంచి వ్యతిరేకత వ‌స్తూనే ఉంది. ప్రభుత్వం పేదల రక్తం తాగుతోందని చంద్రబాబు నిన్న విమ‌ర్శలు చేశారు. ఇక ఆయ‌న‌ చేసిన ఆరోపణలను మంత్రి కొడాలి నాని ఖండించారు. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని అనుకుంటే చంద్రబాబు అడ్డుకోరని ఎద్దేవా చేశారు కొడాలి నాని.