గుప్పెడంత మనసు సెప్టెంబర్ 8 ఎపిసోడ్ : రిషీ-వసూల డ్యాన్స్ గురించి జగతి, మహేంద్రల ఆలోచన..అనుమానం నిజమవుతుందా..!

-

గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర ఇద్దరు రెస్టారెంట్ లో రిషి, వసుధార వేసిన డ్యాన్స్ గురించి మనసులో అనుకుంటారు. రిషి మనసు మారుతుందా, లేక వసూ ఏ మారుతుందా ? ఇద్దరు డ్యాన్స్ వేశారంటే..రిషి మనుసులో వసూ ఉందా అని మహేంద్ర అనుకుంటాడు. రిషీ వచ్చి డ్యాన్స్ చేస్తుంటే వసూ వద్దనొచ్చుకదా అని జగతి అనుకుంటుంది. ఆపేలేదంటే..వసూ మనసులో ఏం ఉండొచ్చు. తను ఇష్టంగానే డ్యాన్స్ చేసిందా అని ఆలోచిస్తుంది. వసుధారను ప్రేమిస్తున్నావ్ అని రిషితో అన్న మాటలను తలుచుకుంటుంది. ఇలా ఒకరికొకరు ఆలోచిస్తారు. మహేంద్ర పిలిచి జగతి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో..నేను అదే ఆలోచిస్తున్నా అంటుంది. అంటే నువ్వు రిషి గురించి ఆలోచిస్తున్నావా..అంటే నువ్వు వసూ గురించా అని అడుగుతుంది. నవ్వుకుంటారు. ఇంతలో కాఫీ వస్తుంది. తాగుతూ ఈ మధ్య మన మధ్య సైలెన్స్ ఎక్కువవుతుంది నువ్వు గమనించావా అని మహేంద్ర అంటాడు. మౌనం దూరానికి సంకేతం మహేంద్ర అని జగతి అంటుంది. అంటే మనం మళ్లీ దూరమవబోతున్నామా అని మహేంద్ర అడుగుతాడు. అసలు మనం ఎప్పుడు దగ్గరగా ఉన్నామని అని జగతి అంటుంది.

మన మధ్య దూరం ఎప్పుడూ తగ్గలేదు, అయినా నేనెప్పుడూ మన మధ్య దూరం గురించి ఆలోచించలేదు. రిషికి నాకు మధ్య ఉన్న దూరం గురించే ఆలోచిస్తాను అని జగతి అంటుంది. అక్కడితో ఆ సీన్ ఐపోతుంది. ఇంకోవైపు రిషి ఏమైంది నాకు..నేనెందుకు డిస్టబ్ అయ్యాను అని తనలో తానే అనుకుంటాడు. వసుధార శిరీష్ తో డ్యాన్స్ చేస్తే నాకెంటి, వాళ్లిద్దరిది ఒకే ఊరు. సరే నేను డ్యాన్స్ చేసాను కదా..వసుధార ఏమనుకుంటుంది, ఇప్పుడు డ్యాన్స్ చేసినదానికి కూడా కొత్త అర్థాలు తీస్తుందేమో ఆ మేడమ్ అనుకుంటాడు..ఇలా అన్నీ ఆలోచిస్తూ… ఫైనల్ గా వసూకి కాల్ చేస్తాడు. ఫోన్ స్విచ్చ్ ఆఫ్ వస్తుంది. అనవసరంగా డ్యాన్స్ చేశానా..రేపటినుంచి ఈ పొగరు నన్ను చులకనా చూస్తుందా అనుకుంటాడు. అలా ఆ సీన్ ఐపోతుంది.

 

ఇంకోపక్క వసుధార..జగతిమేడం బర్డే ఫుటోస్ చూస్తూ రిషీ గురించి ఆలోచిస్తుంది. పదేపదే నాకు రిషీ సర్ ఎందుకు గుర్తుస్తున్నారు. అనుకుంటూ ఉంటుంది. నేనొక్కదాన్నే ఇలా ఆలోచిస్తానా సర్ కూడా ఇలానే ఆలోచిస్తారా..అనుకుంటూ ఉంటుంది. రిషీ ఫోటూ చూస్తూ ఏమండీ ఎండీగారూ ఇంత చక్కగా ఉన్నారుకదా..కూసింత నవ్వితే మీ సొమ్మేంపోతుంది అనుకుంటుంది. ఇంకోవైపు రిషీ బోకే ఫ్లవర్స్ ఆల్బమ్ చూస్తుంది. ప్రతీసారి మోడమ్ గురించి బాధపడుతున్నాను కానీ ఆవిడ బాధను తగ్గించటానికి నేనేం చేయలేదు.. మహేంద్ర సర్ చెప్పిన గురదక్షిణను చెల్లించాలి ఏదో ఒకటి చేయాలనినుకుంటూ ఉంటుంది. పేపర్ మీద గురుదక్షిణ అని రాస్తుంది. ఫోన్ తీసుకుని అయ్యే ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసి చాలాసేపయిందే అనుకుని ఫోన్ ఆన్ చేస్తుంది. వెంటనే రిషీకి ఫోన్ చేస్తుంది. లిఫ్ చేసిన రిషీ ఫోన్ స్విఛ్ ఆఫ్ చేశావేంటి, ఏమైంది నీకు రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ లేవు అని అంటాడు. తలనొప్పిగా ఉంటే ఇంటికొచ్చాను సర్ అంటుంది వసూ. ఓహో..తగ్గిందా టాబ్ లెట్ వేసుకున్నావా అని అడుగుతాడు రిషీ. ఇంతలో జగతివాళ్లు ఇంటికొస్తారు. కాలింగ్ బెల్ మోగుతుంది..మళ్లీ చేస్తాను సర్ అని కాల్ కట్ చేసి డోర్ తీస్తుంది. ఏమైంది వసూ అంతా ఓకేనా అంటుంది. కొంచెం నీరసంగా ఉంది అని వసూ అంటుంది. సరే నువ్వెళ్లి రెస్ట్ తీసుకో అని జగతి వసూని పంపిస్తుంది. ఇంతలో మహీ వసూ డ్యాన్స్ సూపర్ అంటాడు నవ్వుకుంటూ..

జగతి వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వసూ చేతిలోంచి ఆల్బమ్ కిందపడుతుంది. వెంటనే జగతి వచ్చి ఇప్పుడు ఇదెందుకు తీశావ్ వసూ అని అడుగుతుంది. ఊరికే చూడలనిపించి తీశా అంటుంది. జగతిమనసులో ఇప్పుడెందుకు చూడాలనిపించింది అనుకుంటుంది. ఊరికే అంటుంది కదా.. ఎందుకు అని అడగాలా జగతి అని మహేంద్ర అంటాడు. నాకున్న జ్ఞాపకాలు ఇవే అని జగతి అంటుంది. సరే నువ్వెళ్లి రెస్ట్ తీసుకో అని జగతి అంటుంది. ఆల్భమ్స్ మహేంద్ర తీసుకుంటాడు. ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు. అది మహేంద్ర చూస్తాడు కానీ తెలియనట్లే ఉంటాడు. నేను మీ ఇంటి బయటే ఉన్నా బయటకురావ అంటాడు రిషి. వసూ టెన్షన్ తో ఎలావెళ్లాల అనుకుని బయటకువస్తుంది. అది మహేంద్ర చూస్తాడు. కిటీకీలోంచి వీళ్లను చూసి అమ్మో పుత్రరత్నం చూస్తాడు అని వెళ్లిపోతాడు.

ఇటుపక్క రిషీ ఎందుకు రెస్టారెంట్ కి వెళ్లలేదు అంటాడు. తలనొప్పి అని వసూ చెప్తుంది. నిజమేనా నమ్మమంటావా అని రిషి అడుగుతాడు. అబద్దం ఏందుకు చెప్తాను సర్ అని వసూ అంటుంది. నీ టార్గెట్ యూనివర్శిటీ టాపర్ అవ్వటం, తలనొప్పి తెచ్చుకోవటం కాదు. అనవసరమైన పనులన్నీ నెత్తిన వేసుకుంటే ఇలానే వస్తుంది అని రీషి అంటాడు. సరే రేపు కాలేజ్ కి హాలిడే కానీ నువ్వు రావాలి అంటాడు. వసూ మనసలో ఎందుకు అని అడిగితే అనుకుంటుంది. రిషీ ఎందుకు, ఎక్కడ వరకూ, ఏం పని, ఎన్ని కిలోమీట్లర్లు అని ఇప్పుడెం అడక్కూ. రేపు మనకి పని ఉంది ఈ విషయం చెప్పటానికే వచ్చా అని రిషీ అంటాడు. ఈ విషయం ఫోన్ లో చెప్పొచ్చు కదా అని వసూ మనసులో అనుకుంటుంది. దానికి కూడా రిషీ విన్నట్లే ఫోన్లో కూడా చెప్పొచ్చు కానీ సెల్ స్విచ్ఛ్ ఆఫ్ పెట్టావు కదా ఏమైందో ఏంటో అని వచ్చా అంటాడు. ఏమైనా అడగాలనుకుంటున్నావా, డౌట్స్ ఉన్నయా అని అడుగుతాడు. వసూ ఏం లెవ్వనట్లు తలఊపుతుంది. జాగ్రత్త చెప్పి రిషీ వెళ్లిపోతాడు.

వసూ కూడా ఇంట్లోకి వెళ్దామని వెనక్కు తిరుగుతుంది. వెనకే మహేంద్ర ఉంటాడు. వసూ టెన్షన్ పడుతుంది. కానీ మహేంద్ర.. వసుధార నాకోసం వచ్చాడా అని అడుగుతాడు. లేదు సర్ రేపేదో వర్క్ ఉందని చెప్పటానికి వచ్చాడు అంటుంది. మహేంద్ర నాకార్ చూసే ఉంటాడు, నా గురించి అడిగే ఉంటాడు, ఇంటికెళ్లాకా…. ఏమి అనడు కానీ వాడు చూసే ఒక చూపు చాలు అనుకుంటాడు. సరే నేను వెళ్తున్నా జగతికి చెప్పు వసుధార అంటాడు. సర్ మోడమ్ కి చెప్పి వెళ్లండి అని వసూ అంటుంది. పర్లేదు జగతి ఏం అనుకోదు. అర్థం చేసుకునే మనసుంటే అపర్థాలకు తావే ఉండదు అని కారెక్కి వెళ్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news