కార్తీకదీపం 1178 ఎపిసోడ్: శౌర్య మనసు మార్చాలని చూస్తున్న ప్రియమణి…ఇచ్చిపడేసిన రౌడీ..!

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమకు జ్వరం వస్తుంది. కార్తీక్, దీపవాళ్లు వచ్చి ఏమైందమ్మా అంటారు. ఎందుకుకిలా బాధపడుతూ జ్వరం తెచ్చుకుంటావ్ అని సౌందర్య అంటుంది. ఒళ్లు కాలిపోతుంది చూడు అని దీప కార్తీక్ కు చెప్తుంది. కార్తీక్ చేయ్ పట్టుకోబోతో హిమ నువ్వేం నన్ను చూడొద్దు వెళ్లిపో అంటుంది. హిమా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్ అని ఆదిత్య అంటాడు. నిజంగా అసలు ఈ పిల్లలకు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేయిస్తున్నారో..ప్రేక్షకులకు కూడా ఇదే అనిపిస్తుంది. కార్తీక్ వాళ్లనేం అనొద్దు అని డాక్టర్ ని పిలిపించమని చెప్పి వెళ్లిపోతాడు. సౌందర్య కూడా ఛీ ఛీ ఏంటీ పిల్లలు ఎందుకింత మొండితనం అని ఆదిత్యకు డాక్టర్ ని పిలిపించమని చెప్తుంది.

జైల్లో సుకన్య మోనితకు ఫోన్ ఇస్తుంది. ప్రియమణి సమాచారం అంతా చేరేస్తుంది. హిమకు జ్వరం వస్తే..హిమకోసమైనా కార్తీక్ అమెరికా వెళ్లిపోవాలి అనుకుంటాడు. అబ్బా ఈమె వేసే డైలాగ్స్ వింటుంటే మనకు బీపీ పెరిగిపోతుంది కూడా..ఏంటీ కార్తీక్ ఇది హిమ-శౌర్యలమీదేనా నీ ప్రేమ..ఈ బిడ్డమీద లేదా, నిన్ను అమెరికా వెళ్లనివ్వనుగా, ఏదోఒకటి చేసి ఆపిస్తా, మన ప్రేమకోసం యుద్ధం చేయక తప్పుదు అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది.

ఇటువైపు డాక్టర్ వచ్చి కంగారుపడాల్సిన అవసరం లేదు మేడమ్ అంటుంది. జ్వరం వస్తే మరి కంగారుపడాల్సింది ఏముంటుంది అసలు..డాక్టర్ కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది. సౌందర్య హిమ ఏంటమ్మా ఇది, మనసులోంచి ఆ మోనిత ఆన్టీని తీశేయ్, మీ డాడీ మంచోడే, నా కొడుకు గురించి నాకు తెలియదా చెప్పు..నీకు తెలియకుండా కొన్ని జరిగాయ్, ఇప్పుడు అవన్నీ సమిశిపోయాయ్ అని చెప్తుంది.

కింద కార్తీక్, ఆదిత్య, దీప వాళ్లు మాట్లాడుకుంటారు.నా కూతురికి జ్వరం వచ్చినా చూసుకోలేని పరిస్థితి నాది అని కార్తీక్ అంటాడు. ఆదిత్య దానికి జ్వరం మనంఅందరం కలిసే తెప్పించాం అంటాడు. దీప మీరు నా చేత తప్పు చేయించారు అంటుంది. నిజం చెప్తే బాగుండేది అని దీప, ఆదిత్య అంటారు. కార్తీక్ వినడు. ఇప్పుడేంటి హిమకు వచ్చిన జ్వరానికి నేనే కారణమంటావా అంటాడు కార్తీక్. అవును మీరే అని మోనిత వచ్చింది మీరు చెప్పాల్సింది అంటూ చెప్తంది. ప్రియమణి వచ్చి వింటుంది. కార్తీక్ చూసి ఏంటి నువ్వేంటి ఇక్కడ అంటే..కాఫీ తెమ్మాంటారా అయ్యా అంటే అక్కడ హిమకు జ్వరం వస్తే మేమం ఇక్కడ కాఫీ తాగాలా..వెళ్లఅవతలకి అని కసురుకుంటాడు.

ఇంకోపక్క శౌర్య ఇంటి బయట కుర్చుని నాన్న మంచోడే.. ఆ మోనిత ఆన్టీయే బ్యాడ్ గాల్ అయివుంటుంది..పాపం నేను కూడా నాన్నని తప్పుగా అర్థంచేసుకున్నా ఏమో అనుకుంటుంది. ఇంతలో ప్రియమణి వస్తుంది. ఏంటి శౌర్యమ్మ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. శౌర్య నీకెందుకు అంటుంది. కానీ ఈ ప్రియమణి వదలదు. ఏదోఒకటి చెప్పి బిస్కెట్స్ తింటావా అంటే శౌర్య కోపంగా బిస్కెట్లు కావాలంటే నిన్ను అడగాలా అంటుంది. కార్తీక్ సార్ మోనిత ఇంటికి వచ్చినప్పుడల్లా బిస్కెట్స్ తినేవాళ్లు తెలుసా అంటుంది. వచ్చినప్పుడల్లా అంటే ఎప్పుడు అని శౌర్య అడుగుతుంది. ప్రియమణి రోజు వచ్చేవాళ్లు అంటుంది. అసలు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్..నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని సీరయస్ గా అడుగుతుంది. దీప పేరు చెప్తుంది ప్రియమణి. ప్రియమణి నువ్వు చాలా కష్టాల్లో ఉన్నట్లు ఉన్నావ్, వచ్చి పనిచేసుకో అన్నారు వచ్చాను అని చెప్తుంది ప్రియమణి..శౌర్యకు చిర్రెత్తిపోతుంది. కుర్చుని తన్ని లోపలికి సీరియస్ గా పోతుంది.

కార్తీక్ హిమను చూడ్డానికి వెళ్తాడు. డోర్ దగ్గరే నిలబడి చూసి వెళ్లిపోతాడు. వెనక నుంచి దీప పాలు తీసుకుని వస్తుంది. ఏంటి డాక్టర్ బాబు..లోపలికి రండి అంటుంది. రాలేను దీప అంటాడు కార్తీక్. నన్ను చూసి టాబ్ లెట్ విసిరిగొడుతుందేమో అంటూ దిగాలుగా మాట్లాడుతుంది. వెళ్లు తనని చూసుకో అని పంపిస్తాడు. దీప వెళ్లి తగగిపోయిందమ్మా, టాబ్ లెట్ వేసుకుని , ఈ పాలు తాగితే తగ్గిపోతుంది లే అని లేపుతుంది. కుర్చుంటాను కానీ, పాలు తాగను అమ్మా అంటుంది హిమ. పాలు తాగితే జ్వరం తగ్గిపోతుంది. శౌర్యతో కలిసి ఆడుకోవచ్చు అంటుంది దీప. నాకు ఆడుకోవాలని లేదు అంటుంది హిమ. డాడీ మీద నీకు కోపం లేదా అని అడుగుతుంది. డోర్ దగ్గర ఉన్న కార్తీక్ అంతా వింటాడు. డాడీ నిన్ను కూడా మోసం చేశాడు, అయినా నువ్వేంమనవ్ అంటుంది. ఈ హిమ మెంటల్ గా మాట్లాడుతుంది. నాకు బయటకి వెళ్లాలని ఉంది కానీ డాడీ కనిపిస్తారనే వెళ్లటం లేదు అంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ ఘోరంగా బాధపడతాడు. దీప డాడీ మంచోడమ్మా అంటుంది. హిమ గట్టిగా మండోడు కాదు మోసగాడు అని అరుస్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

– Triveni Buskarowthu