కార్తీకదీపం 1229 ఎపిసోడ్: ఊర్లో మంచి డాక్టర్ లేడని తెలుసుకున్న కార్తీక్.. మళ్లీ డాక్టర్ బాబుగా మారతాడా.?

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ మొనిత కొడుకుని గుర్తుచేసుకోని బాధపడుతుంది. అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయారు ఆనందరావుగారు, మనిద్దర్నీ విడదీసిన వారు నాశనమైపోతారు, మీరెక్కడున్నా మీ అమ్మ కనిపెడుతుందని అంటుంది అనుకుంటూ మనోధైర్యం తెచ్చుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ఆదిత్య, శ్రావ్యను చూసి కాఫీ మోనిత కావాలా అని అడుగుతుంది. ఆదిత్య నువ్వు అనవసరమైన వరసలు కూడా బానే కలుపుతావు.. ఇంట్లోంచి వెళ్లిపోతే మేం సంతోషంగా ఉంటాం అంటాడు ఆదిత్య. మోనిత అనుకుంటున్నాను ఆదిత్య నువ్వు ఇంకా నాకు క్లాస్ తీసుకోవటం లేదా ఏంటా అని అంటుంది. ఆదిత్య.. నువ్వు సొసైటీలో డాక్టర్ వి అంటూ మనోడు చెప్పబోతాడు.. మోనిత ఆపి ఇవన్నీ నాకు చెప్పకు..మీరు ఏమన్నా నేను మారను అంటుంది. నా ఆనందరావుని ఎక్కడ దాచారో చెప్పండి నేను వెళ్లిపోతాను అంటే..నీ బాబును నేనెందుకు దాస్తాను నాకేం పని ఆదిత్య కోపంగా అంటాడు..కదా నా కొడుకు దొరికే వరకూ ఇక్కడే ఉంటా అంటుంది మోనిత..వాళ్లేకే విసుగువచ్చి అక్కడినుంచి వెళ్లిపోతారు.

karthika-deepam

దీప ఇంట్లో..

బాబు గుక్కపట్టి ఏడుస్తుంటే శౌర్య, హిమ ఆడిస్తారు. శ్రీవల్లి పిల్లలు ఎంత బుజ్జగింజినా వాడు ఏడుపుమానడు.. కార్తీక్ శౌర్యను పిలిచి బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతాడు.ఏంటో నాన్న అస్సలు ఏడుపు ఆపటం లేదని శౌర్య అనటంతో..కార్తీక్ లోపలికి వస్తాడు..కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. వాళ్లంతా షాక్ అవుతారు. తండ్రిప్రేమ కదా..ఆ స్పర్శ తెలిసి ఆపిఉంటాడేమో..కార్తీక్ పిల్లలు ఏడ్చేదాన్ని బట్టి ఎందుకు ఏడుస్తున్నాడో అంటూ..వివరాలు చెప్తాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే..శౌర్య మా నాన్న డా అనబోతుంది..కార్తీక్ ఆపి..శౌర్య, హిమలు ఉ్న్నారు కదా వాళ్ల చిన్నప్పుడే చూశాను అని బాబుని ఇస్తాడు. బాబు మళ్లీ ఏడుస్తాడు. డాక్టర్ బాబు తప్ప ఎవ్వరు ఎత్తుకున్నా ఏడుస్తుంటాడు. డాడీ నువ్వెత్తుకోగానే తమ్ముడు ఏడుపు ఆపేశాడు భలే విచిత్రంగా ఉందంటారు పిల్లలు. ఇంతలో కోటేష్ వచ్చి బాబుకి చుక్కలు మందు వేయించాలని బాబుని తీసుకుంటాడు..వాడు మళ్లీ ఏడుస్తాడు.

మరోవైపు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న దీప రుద్రాణి అన్నమాటలు గుర్తుచేసుకుంటుంది. బంగారం తాకట్టు పెట్టి ఇది కొనుక్కున్నానని కార్తీక్ బాబుకి తెలియకుండా జాగ్రత్త పడాలి. నాకు నా భర్త, పిల్లలే నిలువెత్తు బంగారం అనుకుంటూ.. ఇంటికి వస్తుంది.

శ్రీవల్లి, కోటేష్… బాబుని తీసుకుని చుక్కల మందు వేయించడానికి వెళ్తుంటారు. అప్పుడే అటుగా కారులో వెళుతున్న రుద్రాణి కోటేషుని చూసి కారు ఆపమంటుంది. శ్రీవల్లి వాళ్లు రుద్రాణిని చూసి..అటు చూడకుండా నడువు శ్రీవల్లి అంటారు. రుద్రాణి..ఏందిరా ఏం తెలియనట్లు తలవంచుకోని వెళ్తున్నావేంటి…ఏంట్రా సామెత అది అని… కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడటగా..కొడుకుని దత్తత తీసుకున్నావంటగా..ఇటు తీసుకురా..బిడ్డను నాకు చూపించవా అంటుంది. కోటేష్ బాబుని చూపిస్తాడు. డబ్బుతో దిష్టి తీసి అటుగా పోయేవాడికి ఆ డబ్బు ఇస్తుంది. ఏదో ఒక సోది డైలాగ్స్ చెప్పి.. నీ ఇంట్లో దిక్కూదివానం లేని ఇద్దరు వచ్చి ఉండే సరికి నేనంటే భయం పోయిందా… వాళ్లని ఏం చెయ్యాలో ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. గడువు కూడా ఇచ్చాను. అది ముగిస్తే మీ పరిస్థితి ఏంటో తలుచుకుంటే నాకే భయమేస్తోంది కోటేషూ… ఏయ్ శ్రీవల్లీ నీ మొగుడికి చెప్పు అని వెళ్తుంది.

ఇంకోసీన్ లో… కార్తీక్.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ .. ఈ ఇంట్లో మనం ఉండాలా అన్న పిల్లల మాటల, రుద్రాణికి రాసి ఇచ్చిన అగ్రిమెంట్ గుర్తుచేసుకుంటాడు కార్తీక్. ఇంతలో ఓ వ్యక్తి.. డాక్టర్ బాబు అంటూ పరుగున రావడం చూసి తననే అనుకుంటాడు. ఆ వ్యక్తి వచ్చి డాక్టర్ బాబు మా ఆవిడకు మందులు మార్చి ఇవ్వండి జ్వరం తగ్గలేదు అనడంతో.. కార్తీక్ షాక్ అవుతుంటాడు. కార్తీక్ వెనక్కి తిరిగే సరికి నిజంగా ఓ ఆర్.ఎం.పి డాక్టర్ మందులు ఇస్తుంటాడు. మీరిచ్చే పది ఇరవై రూపాయలకి.. మందులు కూడా మార్చాలా’ అంటూ తిడుతూ టాబ్లెట్స్ ఇస్తాడు. అదంతా కార్తీక్ చూస్తాడు.. ఈ ఊర్లో మంచి డాక్టరే లేడా అనుకుంటాడు.

సౌందర్య ఇంట్లో:

అక్కా అక్కా అని తిరుగుతావు కదరా వారణాసి..దీప గురించి ఏదైనా సమాచారం తెలిస్తే చెప్పరా అని సౌందర్య దీనంగా వారణాసిని అడుగుతుంది. నీకు ఫోన్ చేస్తే చెప్పరా వారణాసి..దీపక్క ఫోన్ చేసింది.. వాళ్లు ఎక్కడున్నారని అడగను..వాళ్లు బావున్నారనే మాట చెప్పరా చాలు అంటుంది సౌందర్య. బస్తీ వాసులంతా దీప గురించి వెతుకుతున్నాం అంటాడు వారణాసి. ఇంతలో అక్కడకు మోనిత వచ్చి.కోడలి గురించి కన్నీళ్లు పెట్టుకుంటున్నారా ఆన్టీ..బాగుంది, చాలా బాగుంది..ఆదర్శ అత్త అవార్డు ఇవ్వొచ్చంటూ సౌందర్యకి కౌంటర్లు వేస్తుంది. సౌందర్య ఏ మోనిత ఆపుతావా అంటుంది. మీ కొడుకు, కోడలు, పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు..నా కొడుకుని ఎవ్వరో ఎత్తుకెళ్లారు, నా బాబు గురించి ఆలోచించరా అంటుంది. మీకు దీప పిల్లలే కాదు నా కొడుకు కూడా మీ మనవడే అంటుంది. సౌందర్య అర్థంలేకుండా వాదించకు అని.. నువ్వు తల్లివేనా, కొడుకు కనిపించకపోతే వెళ్లి వెతకాలి.. నువ్వు నిజంగా తల్లివే అయితే పిల్లడి కోసం తల్లడిల్లిపోవాలి, ఇంట్లో కూర్చుని మమ్మల్ని సాధిస్తున్నావ్ కానీ కొడుకుని వెతుకుతున్నావని సౌందర్య నిలదీస్తుంది. ఆరోజు.. దీప-కార్తీక్ ను కలపడానికి హిమని ఎత్తుకెళితే… ఈరోజు నన్ను-కార్తీక్ ను విడదీయడానికి నా బిడ్డను ఎత్తుకెళ్లారేమో అంటుంది మోనిత. నోర్ముయ్ మోనిత అని సౌందర్య గట్టిగా అరవడంతో ఎపిసోడ్ ముగిసింది.

తరువాయిభాగంలో

మొక్కలు నాటుతున్నారా మంచి పని చేస్తున్నారు కార్తీక్ బాబు, నేను కూడా వచ్చి నాటుతా అంటుంది. దీపను గమనించిన శ్రీవల్లి అక్కా నీ మెడలో బంగారు తాడు ఏది అని అడుగుతుంది. బంగారం అమ్మేశావా అని కార్తీక్ అడుగుతాడు .

Read more RELATED
Recommended to you

Latest news