కార్తీకదీపం ఎపిసోడ్ 1200 : వంటలక్కతో మాట్లాడటం కాదు కదా చూడటానికే భయపడుతున్న సౌందర్య, కార్తీక్ లు

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో పూజ జరిగేప్పడు దీప చూసిందని కార్తీక్ ఆదిత్యకు చెప్పి బాధపడతాడు. నువ్వు అడిగావే గట్టిగా కాలర్ పట్టుకుని అలా అడిగినా బాగుండు, కానీ తనేం మాట్లాడటంలేదు, మందుపాత్ర మీద కాలుపెట్టినట్లు ఉంది నా పరిస్థితి, మోనిత చెప్పేదంతా అబద్ధం నిరూపించుకుంటాను, కానీ దీప పరిస్థితే అర్థంకావటం లేదు, అన్నయ్యగా అడుగుతాను..నాకొక హెల్ప్ చేయరా..దీపకు ఏం అర్థం అయిందో అడగరా అంటాడు కార్తీక్. ఆదిత్య అబద్ధమో నిజమో..త్వరగా వదనతో జరిగిందో చెప్పు. ఈసారి వదిన దూరం అయితో మాత్రం ఆ దేవుడు కూడా వదినను ఒప్పించలేడు అంటాడు. నీ ఆవేశాన్ని నా కోసం అదుపులో పెట్టుకోరా అంటాడు కార్తీక్.

karthika-deepam

ఇక్కడ మోనిత ఆదిత్య ఆవేశపరుడు..కచ్చితంగా రచ్చరచ్చ అవుతుంది. కార్తీక్ ఎంత శాంతగా ఉంటాడో ఆదిత్య అంత ఆవేశంగా ఉంటాడు..కాబట్టి ఇంట్లో గోల జరగటం కాయం అనుకుని తెగ సంబరపడుతుంది. ప్రియమణిని పిలిచి కార్తీక్ ఇంట్లో ఇలా జరుగుతుంది అని మోనితే ఓ ప్రీ స్క్రిప్ట్ చెప్తుంది. ఆదిత్య ఆ‌వేశంతో..కార్తీక్ మీద అరుస్తాడు, సౌందర్యతో మమ్మీ ఇలా ఎందుకు చేశావ్ అని ఒకటికి వంద ప్రశ్నలు అడిగి ఇల్లు పీకి పందిరేస్తాడు అంటుంద. ప్రియమణి మనుషుల్ని ఇలా ఉసిగొలపడం తప్పేకద్మా అంటుంది ప్రియమణి. మోనితకు కాల్తుంది..తప్పుఒప్పులు నీతో చెప్పించుకునే స్థాయికి దిగజారలేదు అని తిట్టిపంపిస్తుంది.

ఇంకోసీన్ లో కార్తీక్ దీపకోసం చీరలు తెచ్చి సౌందర్యకు చూపిస్తాడు. చీరలు తెస్తే దీప మనసు మారుతుంది అనుకుంటున్నావా అని సౌందర్య అంటుంది. పండగకు కదా మమ్మీ అందుకే తెచ్చాను, కనీసం ఈ వంకతో అయినా దీపతో కాసేపు మాట్లాడొచ్చు అంటాడు కార్తీక్. దీపతో మాట్లాడతాను అని కార్తీక్ అంటే..సౌందర్య వద్దనే చెబుతుంది. కార్తీక్ ను సగం చెడగొట్టేది సౌందర్యే..వెళ్లి మాట్లాడతా అంటే..వద్దు, ఓపెన్ గా అడిగతే..దీప ఇంటినుంచి వెళ్లిపోతా అంటే ఏం చేస్తావ్, ఎందుకు కార్తీక్ ఇవన్నీ, అంటుంది. కొడుకుని వద్దని ఈమె తెలుసుకుంటుదట దీప మనసులో ఏముందో.

ఇంకోపక్క ఆదిత్య మోనిత అన్న మాటలను తలుచుకుంటూ ఉంటాడు. శ్రావ్య వచ్చి ఏంటి ఆదిత్య డల్ గా కనిపిస్తున్నావేంటి అంటే..ఇంట్లో పండగవాతవారణం కనిపించటంలేదు, ఎ‌వరూ ఎవరితో మాట్లాడుకోవటంలేదు, మనసేం బాలేదు అంటాడు. శ్రావ్య బయటకువెళ్దాం అంటే..వద్దు అంటాడు. మోనితదగ్గరకు వెళ్లి వచ్చిన విషయం శ్రావ్యకు చెప్దామా అనుకుని మళ్లఈ వద్దులే అనుకుని..ఈ రీజన్ తోనేనా అమ్మవాళ్లు నాదగ్గర కూడా విషయం దాచిపెట్టారు అనుకుంటాడు.

మరోవైపు..దీప పండగకు పిండివంటలూ చేస్తూ ఉంటుంది. ఓ పక్క వంటచేస్తూనే..ఆ పూజసీన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సౌందర్య, కార్తీక్ల్ లు చూసి..ఇప్పుడు వంటగదిలో ఏం చేస్తుందిరా అనుకుని వెళ్లిమాట్లాడదామా అని కార్తీక్ అంటే. నేను వెళ్తా అని సౌంద్రయ వెళ్తుంది. దీపను అడిగితే..పిల్లలకోసం చేస్తున్నాను అంటుంది. అవసరమనుకుంటే..బయటనుంచి తెప్పిందా కదా అంటుంది.అన్నింటికి బయటవే కావాలా అత్తయ్య అంటుంది. సౌందర్య కు సౌండ్ ఉండదు. దీప కవర్ డ్రైవ్ చేసి..సౌందర్య కార్తీక్ అందరికి కొత్తచీరలు తెచ్చాడు అంటే..అందిరికి తెచ్చారా, అందరితోపాటు నాకు తెచ్చారా అంటుంది దీప. సౌందర్య ఏంటే నువ్వు ఒకటి అంటే ఇంకోటి అంటావ్ అని స్ఠఫ్ ఆఫ్ చేసి పదా అంటుంది. మీరు మారిపోయారు అత్తయ్య అంటుంది దీప. నేనా నేనేం మారేనా అని సౌందర్య అడుగుతుంది. ఇంతకముందు ఉన్నంత దర్పంగాలేరు, డల్ గా కనపిస్తున్నారు అంటుంది దీప. ఇలా మాట్లాడుకుంటూనే..మరి నేను ఎలా కనిపిస్తున్నాను అత్తయ్య కోడలిగా బోర్ కొట్టేశానా అత్తయ్య అంటుంది. సౌందర్యకు దెబ్బమీద దెబ్బ బిత్తరపోతుంది. నువ్వు నాకు ఇష్టమైన కోడలివే, నువ్వంటే నాకు ఇష్టమే అంటే..మరి రెండో కోడలి మాట ఏంటి అంటుంది దీప..సౌందర్య మోనిత గురించి అనుకుంటుంది..దీప అదే అత్తయ్య శ్రావ్య్ అంటే..నువ్వు శ్రావ్య నాకు రెండు కళ్లలాంటి వారే అంటుంది. మీకు మూడో కోడలు వస్తే పోలీక కూడా కష్టమయ్యేది అంటుంది. సౌందర్య ఇక దీపతో మాట్లాడటం కష్టమనుకోని వెళ్లిపోతుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news