కార్తీకదీపం ఎపిసోడ్ 1163: హాస్పటల్ లో హిమను చూసి రెచ్చిపోయిన మోనిత..మళ్లీ సందిగ్ధంలో పడ్డ హిమ

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. సమస్య నీ సంసారంలోకి ప్రవేశించింది, కన్నీళ్లు పెట్టుకుంటావో, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటావో నీ ఇష్టం, నేను ఏం చేయలేను దీప..నీ మనసు ఏం చెప్తే అది చెయ్ అని సౌందర్య చెప్తుంది. ఇంకోసీన్ లో హిమ హాస్పటల్ లో కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ ఆపరేషన్ చేసి బయటకు వస్తాడు. తన క్యాబిన్ లోకి వెళ్లి వాటర్ తాగబోతాడు..ఇంతలో మోనిత టిప్ టాప్ గా రెడీ ఐ కార్తీక్ ఛైర్ లో కుర్చుని ఉంటుంది. కార్తీక్ నువ్వా అంటాడు. మోనిత నేనే కార్తీక్, నీ మోనితను, ఏంటి కార్తీక్ అలా చిక్కిపోయావ్, నన్ను ఖైదీ చీరలో చూడలేవని, కలర్ శారీలో వచ్చాను బాగున్నాను కదా అంటూ నవ్వుతుంది. కార్తీక్ షాక్ అవుతాడు..నువ్వేంటి ఇక్కడ ఎలా వచ్చావ్ అంటాడు. ప్రేమ నీ ప్రేమ కోసం అంటుంది. కార్తీక్ కోపంతో ఎందుకు వచ్చావ్ అంటాడు. నేను రాలేదు, నీ మీద ఉన్న ప్రేమ నన్ను ఇలా రప్పించింది అంటుంది మోనిత.

కార్తీక్..షట్ అప్ మోనిత జస్ట్ షటప్ అంటాడు. ఇంతలో హిమ వస్తుంది. హిమను మోనిత చూస్తుంది. మోనిత లక్క్ అంటే ఇలా ఉండాలి అనుకుని వెదవ నాటకాలంతా ఆడుతుంది. హిమకు మళ్లీ డౌట్స్..మోనిత ఆన్టీ డాడీ దగ్గర ఉందేంటి, జైల్లో కదా ఉండాల్సింది అనుకుంటుంది. మోనిత కావాలనే..మాట్లాడుతుంది. ఆరోజు విజయనగరంలో ఉన్న హిమ ఆచూకి తెలిస్తే నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా కార్తీక్, ఇచ్చిన మాట తప్పావ్ కదా కార్తీక్ అంటూ కార్తీక్ గతాన్ని హిమ ముందు గుర్తుచేస్తుంది. (హిమ తల్లి ఎవరంటే ఎ‌వరో ఫుటో చూపించటం) కార్తీక్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటాడు. మోనిత నిజం మాట్లాడుుతన్నాను కార్తీక్, నువ్వంటే హిమకు అబద్ధం చెప్పావ్, నేను అలా చెప్పలేను కార్తీక్, రేపు నాకు పాపోబాబో పుడితే మమ్మీ డాడీ ఎ‌వరు అంటే ఆయన పేరు కార్తీక్ అని చెప్తాను, నీలా పిల్లలకు అబద్ధం చెప్పలేను కార్తీక్, నా కడుపులోని బిడ్డకు తండ్రివి నువ్వే కదా అంటుంది.

పాపం ఆ మాటకు హిమ ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. ఈ తిక్కలోడు హిమ వెళ్లాక అరుస్తాడు.. కాదు, కాదు నువ్వు ఆర్టిఫీషియల్ ఎన్సెమ్యూనేషన్ చేస్తే ఇక్కడ ఎ‌వరు భయపడరు. అసలు ఈ సీన్ చూస్తే ప్రేక్షకులకు బీపీ పెరగటం కాయం. అంత లాగ్ ఉంటుంది. ఇంతలో బయటున్న కానిస్టేబుల్ వచ్చి రండి మేడమ్ ఏంటీ గొడవ అంటుంది. గొడవ కాదు ప్రేమ అంటుంది. నువ్వు ఇలా చట్టాన్ని తప్పుదోవ పట్టించి వచ్చావ్ అని తెలిస్తే నీకు ఇంకా శిక్ష పెరుగుతుంది అంటుంది. నువ్వు ఛాలెంజ్ చేస్తే నాకు హాయిగా ఉంటుంది. సరదాగా నేను ఒక ఛాలెంజ్ చేయనా అని నా కడుపులో బిడ్డకు తండ్రివి నువ్వే అని నీ నోటితోనే అనిపిస్తాను అంటుంది. కార్తీక్ ఇంపాజిబుల్ అంటాడు. ఈ మోనిత పాజిబుల్ చేస్తుంది కార్తీక్ అంటూ కార్తీక్ కి ఈవిడ జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది.

ఇంట్లో శౌర్య ఆ పేపర్ ని తీసి చూస్తూ ఉంటుంది. నాన్న ఇలా చేశాడా అనుకుని బాధపడుతుంది. ఇంతలో దీప వచ్చి ఆ పేపర్ లాక్కోబోతుంది. శౌర్య అమ్మా నేనెప్పుడో చదివేశాను అమ్మా, నేనే కాదు..హిమ కూడా చూసేసింది అంటుంది. అందులో ఉన్నవన్నీ అబద్ధాలు నమ్మొద్దు అత్త్మమ్మా అంటుంది దీప. ఇందులో అబద్ధాలు ఉండే ఈ పేపర్ టీపాయ్ మీద ఉండాలి, బెడ్ కింద ఎందుకు పెట్టావ్..మాట్లాడవేం, ఇంకొక అబద్ధం ఏం చెప్తావ్ చెప్పు అంటుంది. శౌర్య.. మోనిత ఆన్టీని నాన్న మోసం చేశాడో లేదో అది తర్వాత, అసలు నాన్నకు నువ్వంటే ఇష్టమేనా, నాన్న నిన్ను మోసం చేశాడు కదా అంటుంది. దీప ఏడుస్తూ ఏంటమ్మా ఈ మాటలు అంటుంది. మోత్తం మాకు తెలియకపోవచ్చు, మొత్తం అర్థంకాకపోవచ్చు..కొన్నైనా తెలుస్తాయ్ కదా అంటుంది. శౌర్య అలా అందరూ అబద్ధాలు చెప్తారు అని ఏడుస్తుంది. దీపకు ఏం చెప్పాలో అర్థంకాదు. నా సంగతి వదిలేయ్ అమ్మా ఈ పేపర్ చూసి హిమ ఎంత బాధపడిందో తెలుసా పాపం, నాకు అబద్ధాలు చెప్పినా పర్వాలేదు, కనీసం హిమకు అయినా నిజం చెప్పండమ్మా అంటుంది. దీప ఏం చెయలేక వెళ్లిపోతుంది.

హిమ డాక్టర్ భారతి కారులో ఏదో చోటికి వెళ్తుంది. డ్రైవర్ ఇక్కడ దిగావేంటమ్మా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఎక్కమ్మా అంటే పర్లేదు అంకుల్ అని చెప్పి కారు పంపిస్తుంది. ఒక్కతే అక్కడ ఒక బెంచ్ ఉంటే కుర్చుంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో హిమను ఆదిత్యా- శ్రావ్యలు ఇంటికి తీసుకొస్తారు. హిమ కోపంగా లోపలికి వెళ్తుంది. ఆదిత్య పిల్లలు నిజం చెప్తేనే మంచిది, లేకుంటే పదిమంది పదిరకాలుగా చెప్పినవన్నీ నమ్ముతారు అంటాడు. హిమ శౌర్యతో నాన్న మోనిత ఆన్టీన పెళ్లి చేసుకుంటా అన్నాడని చెప్పాడంట అని చెప్తుంది. అదేంటి అలా ఎలా అన్నాడని శౌర్య అంటుంది. నాన్న మంచోడేం కాదని హిమ చెప్తుంది. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.