కార్తీకదీపం ఎపిసోడ్ 1188 : కార్తీక్ కు తృటిలో తప్పిన ప్రమాదం..దోషనివారణ పూజ చేయాల్సిందే అంటూ సౌందర్య బలవంతం

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో పూజసామాగ్రికోని సౌందర్య, కార్తీక్ నడుచుకుంటూ వస్తుంటారు. కార్తీక్ ఏంటి మమ్మీ ఇది..ఈ పూజసామాగ్రి కొనటం ఏంటి, ఈ దోషాలు ఏంటి, పూజలు ఏంటి, ఇవన్నీ చేస్తే మోనితకు ఇంపార్ట్ న్స్ ఇవ్వటమేగా అంటాడు. సౌందర్య దీపకోసమే ఇవన్నీ చేస్తున్నా అంటుంది. మోనితకోసం చేస్తూ మళ్లీ దీప అంటావేంటి అంటాడు కార్తీక్. పేగుమెడకేసుకుని పుడితే తండ్రికి దోషం అంట..నీకేమైనా జరిగితే దీపకు, మాకే కదా నష్టం అంటుంది. కానీ కార్తీక్ మాత్రం ఆ మోనిత పక్కన కుర్చుని పూజచేయటం నాకు అస్సలు ఇష్టం లేదు మమ్మీ, నువ్వు ఎన్ని చెప్పినా నేను ఆపని చేయలేను అంటాడు. కానీ సౌందర్య బలవంతంగా కార్తీక్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయినా వీళ్ల కార్లు ఏమైనాయ్..రోడ్డుపై ఇద్దరూ ఈ టాపిక్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు.

karthika-deepam

ఇప్పటికే దీప కళ్లలోకి చూడలేకపోతున్నాను..ఇప్పుడు ఈ పూజచేసి ఇంటికి వెళ్లి మాములుగా ఎలా మాట్లాడగలను అంటాడు..వీళ్లు ఇలా నుడుస్తుండగానే..వీళ్ల కారు పై కరెంటు తీగ ఉంటుంది. అక్కడ ఎలక్రీటీషియన్ కారును ముట్టుకోవద్దని దూరం నుంచి చెప్తూ పరుగెట్టుకుంటూ వస్తాడు. అయినా వీళ్లకు వినిపించదు. కార్తీక్ కారు డోర్ ఓపెన్ చేయబోతాడు..అప్పుడే ఈ ఎలక్ర్టీషియన్ వచ్చి కార్తీక్ ని పక్కకులాగి, కారుమీద కరెంట్ వైరుఉంది, మీ అదృష్టం బాగుంది, లేకపోతే ఈపాటికి ప్రాణాలే పోయేవి, మీ ఆవిడతాడు గట్టిది అంటాడు. ఇక ఈ సీన్ ఆ దోషనివారణ పూజకు బాగా సింక్ అవుతుంది. సౌందర్య చూశావ్ కదా ఇంతలోనే ఎంతపెద్ద గండం తప్పిందో, నాకోసం అయినా రారా అంటుంది. నీకోసం వస్తాను కానీ..ఆ మోనిత పక్కన కుర్చుని పూజచేయను అంటాడు. సౌందర్య కాస్త ఆలోచించరా అంటుంది.

ఆరోజు రాత్రి ఈ ప్రియమణి అద్దంలో మొఖం చూసుకుంటూ..నేను మహారాణిలా బతకాల్సిందాన్ని, అయినా పెద్దిళ్లు ఉంటే మాత్రం ఏం సుఖం, దీపమ్మను చూస్తే అర్థంకావటం లేదు.. అన్నీ ఉన్నా ఏదో ఒక సమస్య అని తనలో తానే ఏదోఒకటి మాట్లాడుకుంటుంది. ఎవరూ వచ్చేలా లేరుకానీ, ఒక జ్యూస్ తాగుదాం అనుకుని వెళ్తుంది. దీప డైనింగ్ టెబుల్ సర్ధుతుది. కార్తీక్ దీపకు నామధ్య దూరం పెరిగిపోతుంది..మనమే వెళ్లి మాట్లడదాం అనుకుని దీప దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అంటే కనిపించటం లేదా అంటుంది. దీపకు ఇంకా కోపం తగ్గనట్లు లేదు. అలా కార్తీక్ దీపతో ఏదోఒకటి మాట్లాడదాం అని ట్రై చేస్తాడు..దీప తడిపొడిగా మాట్లాడుతుంది. నీకు ఎందుకు కోపం వచ్చిందో చెప్పు అంటాడు. మాకు కోపాలు ఎందుకు వస్తాయోలే డాక్టర్ బాబు అని వెళ్తుంది.

రూంలో సౌందర్య ఎలాగోలా పొద్దున్న గండం గట్టెక్కాడు. కానీ కార్తీక్ ను పూజకు ఒప్పించటం ఎలా, అసలు ఆ మోనితను పూజకు రమ్మని ఎలా చెప్పాలి, అసలే దానికి ఒంటినిండా పొగరు..నేను వెళ్తే ఇంకా ఎక్కువ చేస్తుంది. ప్రియమణితో పిలిపిస్తే..వద్దులే భారతీతో కబురుపెట్టిస్తా అని ఫోన్ చేయబోతుంది. ఇంతలో పిల్లలు వస్తారు. ఇప్పుడు ఇంట్లో ఏం గొడవలు లేనట్లే కదా అంటారు. లేదంటే మళ్లీ పెడతారేమో.. అమ్మకు ఎందుకు అంత కోపం వచ్చింది అంటారు. సౌందర్య ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. భోజనం చేశారా అంటే లేదునానమ్మా అంటారు..వెళ్లి భోజనం చేయండి, తిన్నందుకే కదా మీ అమ్మ తిట్టింది అంటుంది.

కట్ చేస్తే సౌందర్య భారతితో మ్యాటర్ చెప్తుంది. ఇంటిబయటే సౌందర్య భారతీతో మాట్లాడటం పైనుంచి దీప చూస్తుంది. అత్తయ్య భారతీతో మాట్టాటం ఏంటి, పూజకు భారతీకి సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనుకుంటుంది. సౌందర్య భారతీతో మాట్లాడి పంపిస్తుంది. ఇంకో సీన్ మోనిత ఇంట్లో లిస్ట్ రాసుకుంటూ ఉంటుంది. ప్రియమణి వస్తుంది. మన జీవితాలు మారబోతున్నాయ్, మన చేతిలోనే రిమోట్ ఉంది, మనం ఏం చెప్తే అలా ఆడతారు చూస్తూ ఉండు ప్రియమణి అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో సౌందర్య, కార్తీక్ పూజ గురించి మాట్లాడుకుంటారు. నువ్వు పూజ చేస్తేనే నాకు మనస్సాంతిగా ఉంటుంది అంటుంది సౌందర్య. శాంతి ఏంటి అత్తయ్య అంటూ దీప వస్తుంది. వీళ్లిద్దరూ టెన్షన్ పడుతుంటారు. చూడాలి రేపైనా దీపకు నిజం చెప్తారో లేదో.