కార్తీకదీపం ఎపిసోడ్ 1197 : అసలు నిజం బయటపెట్టిన భారతి..ఒక్క అబద్ధంతో కథమొత్తం మార్చేశారు..!

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప ఏంటి ఇలా మాట్లాడుతుంది, గుళ్లోకి వచ్చి చూశాక తనకుఏం అర్థమైంది, కన్ఫూజన్ లో ఉందా, క్లారిటీలో ఉందా, దీప చూసిందానికన్నా, తన మౌనమే నన్ను ఇంకా బాదపెడుతుంది అనుకుంటాడు కార్తీక్. ఇక్కడ మోనిత ప్రియమణిని డబ్బులు ఇచ్చి బాబుకు కావాల్సినవన్నీ కొనుక్కోనిరా అంటుంది. ప్రియమణి ఇంకా అలానే ఉంటుంది..ఏంటి ఇంకా ఇలానే నుల్చున్నావ్, నీకు ఇచ్చే జీతం పెంచమంటావ్ అంతేనా అంటుంది..మీరు సూపర్ అమ్మా నా మనసులోని మాట బాగా అర్థం చేసుకున్నారు అంటుంది. ఇంటికి సంబంధించిన లెక్కలను మోనిత ఓ పేపర్ మీద రాసుకుంటుంది. ఇంటి లెక్కలు అయిపోయాయి, నా జీవితానికి సంబంధించిన లెక్కలు మిగిలి ఉన్నాయి అని అలా బెడ్ మీద తలవాలుస్తుంది. ఆ పేపర్ కాస్త కిందపడుతుంది. అది తీసుకోవటానికి వంగుతుంది. అప్పుడే భారతి వస్తుంది. మెడలో మంగళసూత్రం చూసి భారతి షాక్ అవుతుంది. మోనిత నీ మెడలో ఏంటది అంటుంది. మంగళసూత్రం అంటుంది మోనిత. కార్తీక్ కట్టాడా ఏంటి అంటే..అంతదాక ఇంకా కార్తీక్ రాలేదు, నేనే కట్టుకున్నాను అంటుంది. మోనిత.. భారతీ ఏదేదో వాగి..నీకు నువ్వే కట్టుకోవటం నాకు నచ్చలేదు అంటుంది భారతి. పొద్దున లేచినప్పుటి నుంచి మనకు నచ్చిన పనులే చేస్తున్నామా ఏంటి అని..భారతి క్లాస్ పీకుతుంది. నాతో కూడా అబద్ధం చెప్పించావ్ కదా మోనిత అంటే..పేగు మెడకు వేసుకుని పుట్టాడన్న ఒక్క అబద్ధంతోనే ఆటను ఎంతదాక తీసుకెళ్లానో తెలుసా అని దోషనివారణ పూజ ఫోటోలు చూపిస్తుంది. ఓర్ని పేగు మెడకు వేసుకున్నది అబద్ధమా..ఇంతవరకూ ప్రేక్షకులకు కూడా తెలియదే..

karthika-deepamనీ జీవితం ఏంటో..ఎన్ని మలుపులు తీరుగుతుందో అని భారతీ అంటే..నాకు ఎన్ని కష్టాలో..కార్తీక్ ను మేనేజ్ చేయాలా, దీపను డామేజ్ చేయాలా అని దీప ఇంటికి వచ్చిన విషయం చెప్తుంది. నాకే ఛాలెంజ్ విసిరింది, దాని ధైర్యం ఏంటో నాకే అర్థంకావటం లేదు అని మోనిత అంటుంది. భారతి బాబు ఎలా ఉన్నాడు అని బాబు దగ్గరకు వెళ్తుంది.

ఇక్కడ కార్తీక్ అండ్ ఫ్యామిలి దీపకు ఏమైంది అని చర్చించుకుంటారు. సౌందర్య దీపకావాలని నటిస్తుందేమో అని భయమేస్తుందిరా అంటుంది. అన్నీ తెలుసుకుని ఏమీ తెలియనట్లు మనసు చంపుకుని మసులుకుంటుందేమే అని ఆనంద్ రావు అంటాడు. దీపను చూస్తుంటేనే భయమేస్తుందిరా, మనసులో ఏదో ఒక మూల తప్పుచేసిన భావం కలుగుతుంది అని సౌందర్య అంటుంది. ఇలా ముగ్గురూ తలాఓ మాట అనుకుంటారు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే..దీప పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మెట్లు దిగుతుంది. వీళ్లకు ఏం అర్థంకాదు. బిత్తిరిమొఖాలు ఏసుకుని చూస్తారు. శౌర్య కథభలే జోక్ గా ఉంది అంటే..నా జీవితంలో పెద్దపెద్ద జోకులు జరిగాయ్, వాటిముందు ఈ జోకు ఎంత అంటుంది దీప. అందరూ అలా చూస్తున్నారు, భోజనానికి లేవండి ఈరోజు వంటలు మామూలుగా ఉండవు అంటుంది. ఏం చేశావ్ అని శౌర్య అడిగితే..కార్తీక్, సౌందర్య, ఆనంద్ రావుకు ఇష్టమైన వంటలు చేసాఅని చెప్తే..మరి మా ఇష్టం ఏం లేదా అంటే..ఇక్కడ అంతా వాళ్ల ఇష్టమే నడుస్తుందికదా అని అంటుంది దీప.

అందరూ భోజనం చేస్తుంటారు..దీప వడ్డీస్తూ..అందరికి ఒక చిన్నమాట ఈరోజు వంటలన్నీ ప్రత్యేకంగా ఈ వంటలక్క చేసింది. మీరు తింటే నాకు ఆనందం అంటుంది దీప. నువ్వు కూడా కూర్చో దీప అని సౌందర్య అంటే..నేను మీతో సమానంగా కుర్చుంటే ఎలా, మీరు తింటే నేను తిన్నట్లే అంటుంది దీప. దీప విచిత్రమైన ప్రవర్తన చూసి కార్తీక్ దీపకు ఏమైంది, మళ్లీ వంటలక్కలా మారుతుందా అనుకుంటాడు. ఇంతలో ఆదిత్య వదినా నువ్వురాలేదని పిల్లలు ఇందాక టెన్షన్ పడుతున్నారు తెలుసా అంటాడు.. దీప ఎందుకురా టెన్షన్, ఒకవేళ నాకు ఏమైనా జరిగితే వీళ్లు అందరూ ఉన్నారుగా అని అంటుంది.. అదేంటే అలా అంటున్నావ్ అని సౌందర్య అంటే..దీప ఏదోఒకటి చెప్పి కవర్ చేస్తుంది..డాక్టర్ బాబు గుత్తివంకాయకూర, దోసకాయపచ్చడి మీకోసమే చేశాను..మళ్లీ ఎప్పుడు తింటారో ఏమో అంటుంది. అంటే..ఈ దోసకాయలు, వంకాయలు వచ్చేసీజన్ వరకూ దొరకవు కదా అంటుంది. ఆదిత్య వదినా ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావ్ అంటే..అడిగావా ఇంకా ఎవరూ అడగలేదా అనుకుంటున్నాను..నేను మీకు లాగా పెద్దగా చదువుకోలేదు కదా ఆదిత్య, ఇక నుంచి నన్ను నేను సంతోషంగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను, ఎప్పుడూ ఏడుపు మొఖం పెట్టుకుంటే అందరూ ఇంకా ఏడిపిస్తున్నారు అంటుంది.ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.
-triveni

Read more RELATED
Recommended to you

Latest news