కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప అందరికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఆదిత్యతో దీపును త్వరగా తెచ్చుకోండి, చిన్నపిల్లలను దూరం పెట్టడం అలవాటైతే..అందరిని దూరం పెట్టాలనిపిస్తుంది అంటుంది దీప. శౌర్య.. అమ్మా నువ్వు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండొచ్చుకదా అంటే..ఉంటానమ్మా ఉండనిస్తే అని తన వంటకు మార్కులు ఇవ్వమని అడుగుతుంది. ఆనంద్ రావును అడుగుతుంది. చెప్తాడు. సౌందర్యను అడిగితే..తొమ్మిది మార్కులు అని చెబుతుంది. డాక్టర్ బాబును అడిగితే..కాసేపు ఏం మాట్లాడడు..కాసేపటికి పదికి పది అంటాడు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీప మాత్రం అబద్ధాలు చెబుతున్నారు డాక్టర్ బాబు మీరు, అన్ని అబద్దాలే చెబుతున్నారు అని కవర్ చేస్తుంది. దీప బిహేవియర్ ఈ ముగ్గురికి ఏం అర్థంకాదు..పాయిసం తెస్తాను ఉండండి అని..వంటల్లో పాస్ చేశారని జీవితంలో ఫెయిల్ చేయకండి అంటుంది. దీప మాటలకు, ప్రవర్తనకు కార్తీక్ అండ్ ఫ్యామిలికి మాటలుండవు.
ఇంకోసీన్ లో మోనిత హాల్లో చెల్లచెదురుగా ఉన్న క్లాత్స్ చూసి ప్రియమణిని పిలిచి క్లాస్ పీకుతుంది. ఇంటిని చూసి ఇల్లాను చూడమని ఊరికే అనురుకదా..ఎవరైనా వస్తే ఏం అనుకుంటారు అంటుంది. ప్రియమణి మనుసులో ఇల్లు, ఇల్లాలు బాగుందమ్మా, మీరు చెప్పటం నేను వినటం బాగుంది. ఇంత హడావిడి చేస్తుంది, ఎవరు వస్తున్నారో అనుకుని అడుగుతుంది. మోనిత వస్తున్నారు ప్రియమణి, ఎవరు ఏంటి అని అడగకు, వచ్చేది ఎవరో తెలిస్తే షాక్ అవుతావ్, కల్తు తిరిగి కిందపడతావ్ కూడా అంటుంది. ఇంతలోనే ఎవరో బైక్ పైన వస్తారు. ఎవరో కాదు ఆదిత్య వస్తాడు.
ఆదిత్య వచ్చి అన్నయ్య ఎక్కడ అన్నయ్య వస్తాడని చెప్పావ్ అంటాడు. అలా చెప్పకపోతే నువ్వురావని అలా చెప్పా అంటుంది మోనిత. నీతో కొన్ని విషయాలు చెప్పాలి అని అంటుంది. ఆదిత్య మొదట వినడు. మోనిత వదలదు కదా, నేను చెప్పబోయే విషయం మీ ఇంటి పరువుకి సంబంధించిన విషయం అని బాబుని తీసుకురా అని పంపిస్తుంది. నాకు బాబు పుట్టాడు అని మోనిత అంటే..ఏంటీ ఈ నాటకాలు అని ఆదిత్య అంటాడు.. .నాకు బాబు పుట్టింది కూడా మీ వాళ్లు నీకు చెప్పలేదా, ఇంకా చాలా చాలా జరిగాయ్, అవన్నీ చెప్పటానికే నిన్ను పిలిచాను అంటుంది. ప్రియమణి బాబును తెస్తుంది. ఏంటి ప్రియమణి అక్కడే ఆగావ్, ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు అంటే..అవసరం లేదు అంటాడు ఆదిత్య.
కథ మొత్తం చెప్పాక తనే అర్థం చేసుకుంటాడు అని ప్రియమణిని లోపలికి పంపిస్తుంది. ఆదిత్య వెళ్లబోతే మోనిత తన డెలివరీ టైంలో కార్తీక్ స్వయంగా వచ్చి భర్తహోదాలో సంతకం చేశాడు తెలుసా అని జరిగింది మొత్తం చెబుతుంది. ఆదిత్య నేను నమ్మను అంటే..దోషనివారణ పూజలో తీసిన ఫోటోలను చూపిస్తుంది. ఆదిత్య షాక్ అవుతాడు. మోనిత బాబు పేగు మెడలో వేసుకుని పుట్టినందుకు దోషనివారణ పూజ చేయించారు. మీ అమ్మే స్వయంగా ఈ పూజచేయించింది. నీకు చెప్పలేదా ఆదిత్య, నిజానికి అందరికి చెప్పినట్లు ఆర్టిఫీషియల్ ఇన్సెమ్యూనేషన్ కాదు ఆదిత్య, మీ అన్నయ్యే బాగా తాగి వచ్చి..అందిరి పరువు పోతుందని నేనే అలా చెప్పాను అని ఎక్కేస్తుంది.
ఆదిత్యకు కోపం కట్టలుతెచ్చుకుంటుంది. ఇందులో నా తప్పు ఏముంది చెప్పు, కార్తీక్ ని నాతో మాట్లాడమని చెప్పు ఆదిత్య అంటుంది మోనిత. నన్ను కోడలిగా ఇంటికి తీసుకెళ్లమను, కావాలంటే ఆ ఇంట్లో దీపక్కను కూడా ఉండమను నాకేం ప్రాబ్లమ్ లేదు అంటుంది. ఆదిత్యకు సౌండ్ ఉండదు. దిగాలుగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. మోనిత వెకిలి నవ్వు నవ్వుతుంది. అగ్గిపుల్ల ఆదిత్య చేతికి ఇచ్చాను తనే ఇంటికి వెళ్లి అంటిస్తాడు అనుకుంటుంది మోనిత. ఆదిత్య దీప గురించి తలుచుకుంటూ బైక్ తీస్తాడు.
కార్తీక్ ఎక్కడినుంచో వస్తూ కారు స్టాట్ చేస్తుంటే కారు స్టాట్ అవ్వదు. ఆదిత్య వస్తూ..అన్నయ్య ఏంటి ఇలా తయారయ్యాడు, ఈరోజు తనను కడిగేస్తాను, నాకంటే పెద్దోడు అయి ఉండొచ్చు, కాలర్ పట్టుకుని అడిగేస్తాను అనుకుంటూ వస్తాడు. కార్తీక్ కారు ట్రబుల్ ఇవ్వటంతో చూసుకుంటూ ఉంటాడు. అదే రూట్ లో వస్తున్న ఆదిత్య చూసి కార్తీక్ ని చూడగానే..రెచ్చిపోతాడు. మోనిత ఇంటికి వెళ్లాను, తను నాకంతా చెప్పేసింది, నా కంటే పెద్దోడివైపోయావ్, లేకపోతే కాలర్ పట్టుకోని అడగాలనుంది అంటాడు. కార్తీక్ నువ్వు ఏందుకు వెళ్లావ్ రా అక్కడికి అంటాడు. ఆదిత్య ఫుల్ ఫైర్ లో ఉంటాడు..ఇంటి పురువు నడిరోడ్డుమీద పడేశావ్ , దీప వదినను ఏం చేస్తావ్ మళ్లీ వదిలేస్తావా అంటాడు. కార్తీక్ కొట్టబోతే..కొట్టు అన్నయ్య కొట్టు, నువ్వు చేసిన ఎదవ పనులును ప్రశ్నిస్తే నడిరోడ్డుమీద కొట్టుబోతున్నావా కొట్టు అంటాడు. అసలు సంతంకం ఎందుకు పెట్టావ్, పూజలు ఎందుకు చేశావ్ అని ఆదిత్య అంటే..మోనిత చావుబతుకుల్లో ఉంది అంటే మానవత్వంతో మమ్మీ తీసుకెళ్లింది అంటాడు కార్తీక్. నిజంగా నీ తప్పు లేకపోతే వదినకు చెప్పేయొచ్చుగా, తన దగ్గర దాచటం తనను మోసం చేయటమే కదా అంటాడు ఆదిత్య. దాచే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది, ఆ పూజ జరుగుతుంటే దీప వచ్చి చూసి వెళ్లింది అంటాడు కార్తీక్. ఆదిత్య వదిన చూసిందా అని షాక్ అవుతాడు. అవునురా చూసింది. తనకు ఏం అర్థమైందో, తనేం చూసిందో, ఏం మాట్లడదు, నరకయాతన అనుభవిస్తున్నానురా అని కార్తీక్ బాదపడతాడు. ఎపిసోడ్ అయిపోతుంది.