బీజేపీ నేతలకు సిగ్గు శరం ఉందా ? గుండాల్లా తిరుగుతున్నారు : నిరంజన్ రెడ్డి

-

బీజేపీ పార్టీపై వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. బీజేపీ పార్టీ నేతలకు అసలు సిగ్గు శరం ఉందా ? యాసంగి లో వడ్ల కొనుగోలు గురించి మాట్లాడమంటే బీజేపీ నేతలు మాట్లాడరని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు.. తెలంగాణ రైతులకు సమస్యగా మారారని.. రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ కి సమస్యగా మారిందని మండిపడ్డారు.

ఆ పార్టీ నేతలకు పనీ పాట లేదని… కొనుగోలు కేంద్రాల దగ్గరికి బీజేపీ నేతలు వెళ్లాల్సిన అవసరం ఏమిటి.. ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా ? అని నిప్పులు చెరిగారు. రైతుల ధాన్యం పై గుండాల్లా దాడులకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు కాక మరేమీ ఉంటుందని… బీజేపీ డొల్ల తనం బయట పడిందన్నారు.

గతం లో కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. యూపీ, పంజాబ్ లో రైతులు ఆందోళన చేస్తున్నా మోడీ స్పందించరు కానీ ఇక్కడ రైతుల పేరిట బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణ రైతులకు మేము చేస్తున్న మెళ్లలో బీజేపీ పాత్ర శూన్యమన్నారు. ఏకాణా సాయం కూడా కేంద్రం నుంచి రావడం లేదని… ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news