కార్తీకదీపం ఎపిసోడ్ 1205: అథిదులు ముందు అవమానపాలైన మోనిత..దీప నా భార్య అని బల్లగుద్ది చెప్పిన కార్తీక్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఇంటికి వచ్చిన దీప అందరిని పలకరిస్తుంది. అక్కడున్నవాళ్లకు అది కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది. అన్నీ ఏర్పాట్లు చేశావా, పంతులుగారు, వంటలుచేశావా అని దీప అంటే..పంతులుగారు ఓకే, వంటలే క్యాటరింగ్ వాళ్లు సగం ఇవ్వలేదు అంటుంది మోనిత. అదేంటి మోనిత..అసలే నీ కార్తీక్ వస్తున్నాడు., అత్తయ్యగారు వస్తున్నారు..అత్తయ్యగారేంటి..మీ అత్తయ్యాగారు వస్తున్నారు, వాళ్లకు ఇష్టమైనవి ఏమైనా చేయించావా లేదా, వాళ్లకు ఇష్టమైనవి చేయిస్తే వాళ్లమనసు దోచుకోవచ్చు, వంటలదేం ఉందిలే మొనిత ..నేను వంటలక్కనేకదా చిటికెలో చేసేస్తాను అని వంటగది ఎక్కుడుందో చూపించు అంటుంది. మోనితకు, పక్కన ఉన్న భారతీకి ఏం అర్థంకాదు. మోనిత దీపను వంటగదిలోకి తీసుకెళ్తుంది. అదంతా చూస్తున్న స్టాఫ్ ఆవిడ కార్తీక్ గారి మొదటిభార్యకదా అంటే..అవును రాజీపడినట్లు ఉన్నారు, అయినా పెద్దగా చదువుకోలేదంటగా అంటుంటారు.

ఇంతలో కార్తీక్ వాళ్లు వస్తారు. కార్తీక్ కారు దిగకుండా..మమ్మీ వెళిపోదాం అంటాడు. సౌందర్య మనం వచ్చింది మోనితకోసమో, బాబు కోసమో కాదు..దీప గురించి అంటుంది. మొత్తానికి కార్తీక్ వద్దన్నా..సౌందర్య, ఆనంద్ రావులు వెళ్లాల్సిందే అంటారు. దీప రమ్మంది మనంవచ్చాం, ఇది దీపకు నేను ఇస్తున్న గౌరవం అనుకో..నేనైతై వెళ్తున్నాను కార్తీక్, నా మీద గౌరవం ఉంటే నువ్వులోపలికి రా..లేదంటే నువ్వు వెనక్కు వెళ్లిపో అని వీళ్లు కారు దిగి వెళ్తారు. కార్తీక్ అక్కడే ఉన్న వారణాసిని చూసి పిలుస్తాడు. దీప వచ్చిందా అని కార్తీక్ అంటే.. అవును డాక్టర్ బాబు అక్క బ్యాగ్ సర్దుకుని వచ్చింది డాక్టర్ బాబు అంటాడు. అక్కను చూస్తుంటే, అక్క మాటలు వింటుంటే భయమేస్తుంది డాక్టర్ బాబు, అక్క మనల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయేలా ఉంది డాక్టర్ బాబు అని బాధపడతాడు. కార్తీక్ ఏడ్వకు,,దీప ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను అని ముగ్గురూ లోపలికి వస్తారు.

వీళ్లు దీప కనిపించటంలేదేంటండి అని చూస్తారు. అప్పుడే మెట్లపై నుంచి దిగుతున్న మోనిత దీపక్కా అని పిలుస్తుంది. దీప సరిగ్గా వంటలక్క గెటప్ లో గరెట తీసుకుని వస్తుంది. అది చూసిన కార్తీక్ వాళ్లు షాక్ అవుతుారు. కార్తీక్ దీప ఏమైంది నీకు, ఇక్కడికి రావటమేంటి అని అరుస్తాడు. దీప మాత్రం కూల్ గా రండిరండి పాపం మీరు రారేమో అని మోనిత బాగా టెన్షన్ పడింది అంటుంది దీప,అలా చూస్తావేంటి మోనిత వెళ్లు వచ్చినవాళ్లని ఆహ్వానించవా అంటుంది. మోనిత మనసులో దీపక్క డిసైడ్ అయినట్లు ఉంది వెళ్లటానికి థ్యాంక్యూ దీపక్కా అనుకుంటుంది. కార్తీక్ ఆ‌వేశంగా వచ్చి దీప నీకు ఇక్కడేం పని, నువ్వు వంటలు చేయటమేంటి అని గరెట తీసి విసిరేసి, పద వెళ్దాం అంటాడు. దీప మాత్రం వంటలక్క చేసేది వంటలే కదా డాక్టర్ బాబు, ఏంటి మోనిత అలా చూస్తున్నావు, బాబును ఉయ్యాలోవెయ్యి, బారసాల కానివ్వు అని హడావిడి చేస్తుంది. మోనిత పైకి నవ్వుతున్నా, లోపల మాత్రం దీపక్క ఈ కథకు ఈరోజు ఏదో క్లైమాక్స్ ఇవ్వబోతున్నట్లే ఉంది అనుకుంటుంది.

బాబును తీసుకొస్తారు. మోనిత సౌందర్యకు బాబుని ఇవ్వబోతే ఒక లుక్ ఇస్తుంది. మోనిత కామ్ గా బాబుని తనే తీసుకెళ్లి ఉయ్యాలో వేస్తుంది. తాళి బయటకు వస్తుంది. పంతులు బాబు తండ్రిని పిలవమంటాడు. మోనిత వచ్చి దీప పక్కన నుల్చుంటుంది. దీప ఏంటి మోనిత ఇది వచ్చినవాళ్లుకు మీ ఫ్యామిలీని పరిచయం చేయవా అంటే..మోనిత అందరిని పరిచయం చేస్తుంది..కార్తీక్ ను మావారు అని చెపుతుంది. ఏంటి మోనిత అందరిని పరిచయం చేశావు కానీ, నన్ను పరిచయం చేయలేదేంటి అని దీప అంటే..మోనిత ఈవిడ మా అక్క దీపక్క అంటుంది మోనిత. దీప ఇంత సింపుల్ గా అక్క అంటే ఎలా మోనిత..నేను నీకు అక్కను ఎలా అవుతునాను, పెద్దమ్మ కూతురినా, తోడబుట్టినదాన్నా, లేదా ఇంకేదైనా వరసా అని అంటుంది దీప. మోనిత మనసులో ఏంటిదీపక్క సడన్ గా గేర్ మార్చింది అనుకుంటుంది. దీప చెప్పు మోనిత ఎలా అవుతానో అంటుంది. పంతులు మాత్రం బారసాల తంతు పూర్తికానివ్వండి అంటే..తొందరేముందిలేండి మోనిత ఆల్రడీ పేరు పెట్టేసుకుందిలేండి అంటుంది.దీప చెప్పు చెప్పు అంటే..పంతులు మళ్లీ చెప్పమ్మా ఏమవుతుందో అసలు ఇంతకు మీరేవరు అంటే..కార్తీక్ పంతులుగారు ఈ‌విడ నా భార్య, అర్థాంగి, నా జీవితం అంటాడు. మరి ఆవిడ మీ భార్య అయితే ఈ‌విడ ఎవరూ అని పంతులు అడుగుతాడు. మంచి ప్రశ్న అడిగారు పంతులుగారు అని దీప మోనిత గర్భం దాల్చిన విధివిధానం మొత్తం అక్కడున్న అందరికి సవివరంగా చెప్తుంది.

అది జరిగింది..ఇందులో ఇంకా ఇంకా చాలా మలుపులు ఉన్నాయి, ఈ విధంగా నేను మోనితకు దేవుడిచ్చిన అక్కను అయ్యాను అనమాట, జరగిన కథ అదైతే..జరుగుతున్న కథమరోలా ఉంది, ముఫ్పై రూపాయలుపెట్టి మూరెడు పుసుపుతాడు కొనుక్కోని తనకు తానే మెడలో వేసుుకంది ఇది తాలి ఎలా అవుతుంది పంతులుగారు, దొంగమాటలు చెప్పటం, దొంగసాక్షాలు చెప్పటం, దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్ కొట్టేయటం అంటుంది. దీప మాటలకు మోనిత బిత్తరపోయి చూస్తుంది. ఈలోపు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈరోజు కాస్త ఇంట్రస్టింగ్ గానే ఉంది. రేపు ఇంకా ఉంది అసలు కథ..