కార్తీకదీపం ఎపిసోడ్ 1209: డాక్టర్ల అందరి ముందు..మోనిత పరువు తీసిపడేసిన దీప..డాక్టర్ వృత్తికే కళంకం అంటూ స్పీచ్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో బస్తీలో మెడికల్ క్యాంపు జరుగుతుండగా..మోనిత వచ్చి కార్తీక్ ను తిడుతూ ఉంటుంది. కార్తీక్ మోనితా ఇది మెడికల్ క్యాంప్, ఇక్కడ న్యూసెన్స్ చేయటానికి నీకు కామన్సెన్స్ ఉందా అంటే..పది తప్పులు చేసి ఒక ఒప్పు చేస్తే సరిపోతుందా అంటూ డైలాగ్స్ వేస్తుంది. దీప ఎందుకు వచ్చావ్ అంటే.. న్యాయం కోసం వచ్చాను అంటుంది మోనిత. ఆహా..ఆ మాట నీ నోటి నుంచి వింటుంటే ఇంకోలా ఉంది అంటుంది దీప. మనం ఇద్దరం ఇప్పుడు బస్తీలో ఉన్నాము, ఇక్కడ వాళ్ల గురించి నీకు తెలియదు అంటుంది దీప. బస్తీ అయినా,బంజారాహిల్స్ అయినా సరే కార్తీక్ ఎక్కడకు వెళ్తే అక్కడకు వస్తాను, ఏదో వీడియో చూపిస్తే..మోనిత ఊరుకుంటుందనుకుంటున్నారా..ఏం చేయాలో చేస్తాను అంటుంది మోనిత. ఇంతలో ఆనంద్ రావు వచ్చి ఏంటమ్మా నువ్వు చేసేది, చేసిందే నీచమైన పని..మళ్లీ అందరికి చెప్పుకుంటున్నావా అంటే..మావయ్యగారు మీరు కూడా అలా మాట్లాడతారేంటి అంటే..ఆనంద్ రావు పాపం మోనితతో వాదించటం కొత్తగా..సెంటీ డైలాగ్స్ వేస్తాడు..నా బిడ్డకు తండ్రి కార్తీక్ అని ఒప్పుకోవాలి అని మోనిత అంటుంది….దీప కలగచేసుకుని..మోనిత గురించి నాలుగుముక్కల్లో బస్తీవాళ్లకు చెప్తుంది. ఆ బిడ్డకు డాక్టర్ బాబుకు ఎలాంటి సంబంధం లేదు..ఈ మోనితే మోసం చేసింది బిడ్డను కనింది అంటుంది. ప్రియమణికి మ్యాటర్ అర్థమవుతుంది..దీపమ్మా వాళ్లను మన మీదకు ఉసిగొల్పుతుంది..పోదాం అంటుంది. బస్తీవాళ్లు వెళ్లి చీపురుకట్టలు తీసుకుని వచ్చి ఏంటమ్మా తెగ పేలిపోతున్నావు అంటూ రెచ్చిపోతారు..అంతే ఇక ప్రియమణి పోదాం అమ్మా అంటూ..మోనితను కారు దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లి కార్తీక్ కు వార్నింగ్ ఇస్తుంది. మీ వంటలక్కే నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేలా చేస్తా అంటుంది మోనిత.

ఇంట్లో పిల్లలు ఇద్దరు ఏంటి ఇంట్లో ఎవ్వరూ కనిపించటంలేదు అనుకుంటూ మాట్లాడుకుంటారు..ఇంతలో ఆదిత్య వస్తాడు. బాబ్భై ఇల్లు ఇంత సైలెంట్ గా ఉందేంటి అంటే..ఇంత సేపు మీరు ఇంట్లో లేరుగా అందుకే ఇలా ఉంది అంటాడు. అమ్మానాన్నలు ఎక్కడకు వెళ్లారంటే..బస్తీకు వెళ్లారంటే..శౌర్య మనం కూడా వెళ్లాల్సింది..బస్తీలోనే ఉంటే బాగుండేది కదా అంటే..ఆదిత్య కోపపడతాడు. ఇంకోసారి బస్తీ అనే మాట మీ నోటివెంట రాకుడదు అని చెప్పి వెళ్లిపోతాడు.

ఇంకోపక్క మోనిత ఇంట్లో భోజనం చేస్తూ ఉంటుంది. ఏంతో సంతోషంగా..తృప్తిగా లొట్టలేసుకుంటూ తింటుంది. ప్రియమణికి ఆగదుగా..ఏంటమ్మా ఇంత ఉత్సాహంగా ఉన్నారు..బస్తీలో గొడవ జరిగాక..ఫుల్ కోపంగా ఉంటారునుకుంటే..ఇలా ఉన్నారు అంటుంది. మోనిత బిల్డప్ ఇస్తుంది..నేను అందరిలా ఆలోచించను, అందరికంటే మించి ఆలోచిస్తాను…కోతలు కోయటం కాదు ప్రియమణి..కూతలు కూపిస్తా..రేపు ఉదయం చూడు ప్రియమణి..మోనిత సినిమా రేపే ప్రారంభం అవుతుంది అంటుంది. మొత్తానికి ఈ మోనిత ఏదో చెత్తప్లాన్ వేసినట్లు ఉంది.

తెల్లారి కార్తీక్ ఇంట్లో వంటగదిలో డాక్టర్ బాబు, దీప కలిసి వంట చేస్తారు. కార్తీక్ పచ్చిమిర్చి కట్ చేస్తాడు. సరదాగా మాట్లాడుకుంటూ..బస్తీక్యాంపు గురించి టాపిక్ తీస్తూ..దీప బస్తీవాళ్లతో ఇక్కడే ఇల్లుకొనుక్కోని చెప్పినట్లు చెప్పబోతుంది..కార్తీక్..బస్తీలో స్థలం కొనుక్కోని..ఇల్లు, హాస్పటల్ కడదాం అంటాడు. వారం రోజుల్లో స్థలం కొనుక్కోని శంకుస్థాపన చేద్దాం అంటే.. ఇంతలో సౌందర్య వస్తుంది..ఏంట్రా అంటే..విషయం చెప్తాడు కార్తీక్. అంటే మీరు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారా అంటే మోము ఎక్కడికి పోతాం అని కార్తీక్ సౌందర్య బుగ్గలు పట్టుకుంటాడు. పచ్చిమిర్చి కట్ చేసిన చేతులు కదా..ఏంట్రా మంటగా ఉంది, పచ్చిమిర్చి కట్ చేశావా అంటే..అవును అత్తయ్య మీ అబ్బాయిగారికి పచ్చిమిర్చి కట్ చేయటం కూడా రాదు అంటుంది. ఇలా వీళ్ల ముగ్గురు నువ్వుకోవటం చూసిని ఆనంద్ రావు మీ ఆనందంలో ఈ ఆనంద్ రావును కూడా పాలుపంచుకోనివ్వండి అంటే..అయితే మీరు కూడా పచ్చిమిర్చి కట్ చేయండి అంటుంది సౌందర్య. ఈ సీన్ కాస్త కామెడీగా ఉంటుందిలే.

ఇంకోవైపు హిమ దగ్గరకు శౌర్య వచ్చి మనం బస్తీలో ఇల్లు కట్టుకోబోతున్నాం అని చెప్తుంది. దాంతో ఇద్దరూ సంతోషిస్తారు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో డాక్టర్స్ అసోసియోషన్ ప్రసిడెంట్ గా డాక్టర్లు అందరూ కార్తీక్ ను ఎన్నుకుంటారు. ఆ కార్యక్రమానికి మోనిత వచ్చి నాకు అన్యాయం చేశాడు కార్తీక్, న్యాయం చేస్తేనే ప్రసిడెంట్ గా ఎన్నుకుంటాను అంటుంది. ఇంతలో దీప పోడియం దగ్గరకు వచ్చి..మోనిత డాక్టర్ బాబుని ప్రిసిడెంట్ గా పనికారు అనింది..కాని మోనిత డాక్టర్ వృత్తికే కళంకం చేసింది అంటూ స్సాట్ చేస్తుంది. అంటే..బస్తీలో అయినట్లు ఇక్కడ కూడా మోనిత పరువు పోతుందో..లేక ఇంకమైనా ఉంటుందో చూడాలి.