కార్తీకదీపం 1224: దీప పనిమీద దెబ్బకొట్టిన రుద్రాణి..ఆనంద్ రావును బుట్టలో వేయాలని ప్లాన్ చేస్తున్న మోనిత

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత సౌందర్య వాళ్లకు హారతి ఇస్తుంది. వాళ్లు అసలు తీసుకోరు. మావయ్యగారు మీరు కుర్చోండి కాఫీ తెస్తాను అంటుంది. ఆదిత్యకు మోనిత మాటలకు కోపం వస్తుంది. శ్రావ్య ఆపుతుంది. ప్రియమణితో నాలుగు కాఫీ అంటుంది. తీసుకొస్తుంది. అసలు వాళ్ల ఇంటికి వచ్చి వీళ్లు ఇద్దరు ఇలా చేయటం ఏంటో, వీళ్లు చూస్తూ ఉండటం ఏంటో. చెండాలం మనం చూడటం ఏంటో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రియమణి తెచ్చిన కాఫీని మావయ్యగారు మీరు తీసుకోండి అంటుంది మోనిత. ఆదిత్య మమ్మీ ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని అరుస్తాడు. సౌందర్య కాఫీ ట్రే ఇసిరేసి..ఏం అనుకుంటున్నావే..మా ఇంటికి వచ్చి ఈ పూజలేంటి కాఫీ ఏంటి అంటుంది. ఆదిత్య కూడా మెడపట్టి బయటకు గెంటక ఇంకా ఏంటి మమ్మీ మాటలు..అన్నయ్య అంటే మెతక మనిషి.. మనం అలా ఉంటే నెత్తికెక్కి కుర్చుంటుంది నడువు బయటకు అంటాడు. సౌందర్య ఆపుతుంది. శ్రావ్య ఉండు ఆదిత్య, ఎందుకు ఆవేశపడతావ్..అత్తయ్యగారు మాట్లాడుతున్నారు కదా అంటుంది. ఆనంద్ రావు ఏంటమ్మా.. కార్తీక్ కార్తీక్ అన్నావు, కార్తీక్ లేకుండా వెళ్లిపోయాడు..ఇదేం మర్యాదగా ఉందా నీకు అంటే..సౌందర్య నన్ను ఇరిటేట్ చేయకు మోనిత మర్యాదగా వెళ్లు అంటుంది. మీరు తిట్టే హక్కు ఉంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా..నేను మీ కోడల్నే..వాడు మీ మనవడే..తాతగారు ఆస్తి,వారసత్వం వాడికి దక్కుతాయి అని ఏంటి ప్రియమణి అలా చూస్తున్నావు..అత్తగారికి కోపం వచ్చి కిందపడేశారు..క్లీన్ చేయ్ ప్రియమణి అని చెప్పి వెళ్తుంది. సౌందర్య అక్కడే కుప్పకూలుతుంది.

karthika-deepamఇక్కడ కార్తీక్ రాత్రి జరిగింది ఆలోచిస్తూ..దీనంగా కుర్చుంటాడు. దీప సంతోషంగా వచ్చి కాఫీ ఇస్తుంది. దీప ముఖాన్ని కార్తీక్ అలానే చూస్తాడు. దీప రాత్రి జరిగిన విషయం మర్చిపోండి, ఆ రుద్రాణి గురించి ఆలోచిస్తూ..మనసు పాడు చేసుకోకండి..మీకు నేను ఉన్నాను, మిమ్మల్ని పిల్లల్ని కంటికిరెప్పలా చూసుకుంటాను, కార్లలో తిప్పలేనేమో, కడుపునిండా భోజనం పెడతా..గుట్టుగా సంసారాన్ని నడుపుతాను..కార్తీక్ బాబు మీరు ఎక్కువ ఆలోచించకండి..మన జీవితంలో కష్టాలొచ్చాయని అనుకోకండి అంటుంది. అనుకోకుండా ఎలా ఉంటాను దీప అంటాడు కార్తీక్. దీప ఏం మారలేదు..అక్కడ కప్పు, ఇక్కడ గ్లాస్, అక్కడ సోఫా ఇక్కడ పక్కపక్కనే కుర్చుంటున్నాం అంటుంది. ఇన్ని జరిగినా ఇంత పాజిటివ్ గా ఎలా ఆలోచిస్తున్నావ్ దీప..ఏంటి నీ ధైర్యం అంటే..మీరే నా ధైర్యం.. నాకు మీరు ఉన్నారు అది చాలు అని నేను స్కూల్ దగ్గరకు వెళ్తున్నాను, పిల్లల్ని మీరు స్కూల్ దగ్గరకు తీసుకురండి అంటుంది. కార్తీక్ వంటలక్క కాఫీ బాగుంది అంటాడు.

మరోసీన్ లో రుద్రాణి తాపీగా పళ్లు తోముకుంటూ..ఊర్లో సంగతలేంటి అంటుంది. ఆ మనుషులు ఏం మాట్లాడరు..ఏంట్రా ఏం మాట్లాడరేంట్రా అంటే..ఆ ఇంట్లో సామాన్లు పెడితే మేం అడ్డుకున్నందుకు వాడు కొట్టాడు..వాడు కొట్టి, వాడి పెళ్లాం కొడితే ఊర్లో మన పరువు ఏం కావాలి అంటే..రుద్రాణి ఏదో పెద్ద డైలాగ్స్ చెప్పి..రుద్రాణిని పులిగా పోల్చుకుని..వాళ్లను మేకలుగా చెప్పుకుంటుంది.

ఇంకోపక్క ఆనంద్ రావు మెట్లు దిగుతుంటే..మోనిత వెళ్లి కాళ్లు మొక్కుతుంది. ఏంటమ్మా ఇది లేలే అంటే..మోనిత మళ్లీ సోది మొదలేస్తుంది. ఏంటమ్మా నీ గోల..ఏంటీ నీ న్యూసెన్స్ అంటాడు. మోనిత అయినా ఆగదు. వాగుతూనే ఉంటుంది. కార్తీక్ ఎటువెళ్లాడో తెలియాదు..నా కొడుకును ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు..మీరే నాకు న్యాయం చేయాలి అంటే..నేనేం చేయగలనమ్మా అంటే..ఆ మాట అన్నారు చాలు అంటుంది. మీరు నన్ను కోడలిగా అంగీకరించండి అంటుంది మోనిత. అదేలా సాధ్యం అంటుంది. మోనిత ఈ ఇంట్లో నాకు చీపురు పుల్ల స్థానం కల్పించినా చాలు, మూలన పడి ఉంటాను అంటూ ఏడుస్తుంది. ఇదంతా దొంగచాటుగా ప్రియమణి విని వామ్మో మోనితమ్మ మామూలు నటికాదు అనుకుంటుంది. ఆనంద్ రావు నన్ను వెళ్లనీయమ్మా అని వెళ్తాడు. మోనిత మిమ్మల్నే నా వైపు తిప్పుకుంటే..ఈ ఇంట్లో కోడలిగా నాకు ఒక ఓటు దక్కుతుంది. నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో అనుకుంటుంది. అసలు కొడుకు మిస్స్ అయినా..కోడిలిగా స్థానం కోసం వెంపర్లాడటం ఏంటి ఈ మోనిత. పోయి ఆ కొడుకును ఎ‌వరు ఎత్తుకెళ్లారు అని వెతకకుండా ఇక్కడ న్యూసెన్స్ చేస్తుంది.

దీప స్కూల్ కు వస్తూ ఉంటుంది. నిన్న పని ఇస్తా అన్న ఆవిడ..ఈ పని వేరే వాళ్లకు ఇవ్వమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి అంటుంది. నేను చేస్తాను అంటుంది దీప. ఆవిడ రుద్రాణి మీకు ఈ పని వద్దని చెప్పారు అంటుంది. దీపకు మ్యాటర్ అర్థమవుతుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news