ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వెండి ధ‌ర‌లూ..

-

శుక్రువారం స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు నేడు(శ‌నివారం) భారీగా త‌గ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,650 రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 230 రూపాయలు తగ్గి 36,350 రూపాయలకు చేరింది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 150 రూపాయలు తగ్గి 48,600 రూపాయలకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 180 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం 38,370 రూపాయల వద్ద చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 250 రూపాయలు తగ్గి 37,100 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 150 రూపాయలు తగ్గింది. దీంతో 48,600 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news