మ‌రింత క్షీణించిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు ఈ రోజు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,600 రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గి 36,300 రూపాయలకు చేరింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 48,650 రూపాయలకు చేరింది.

అలాగే ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం 38,320 రూపాయల వద్ద చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు తగ్గి 37,050 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో 48,650 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news