బ్రేకింగ్‌: భారీగా షాక్ ఇచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి ధ‌రలూ..

బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,940రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 280 రూపాయలు పెరిగి 36,620 రూపాయలకు చేరింది. వెండి ధరలు కూడా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 70 రూపాయలు పెరిగి 48,840 రూపాయలకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగి 38,600 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయలు పైకెగసి 37,400 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 70 రూపాయలు పెరిగింది. దీంతో 48,840రూపాయలకు చేరింది.