నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఈ రోజు స్థిరంగా నిలిచింది. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,700 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 36,390 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధరలు కూడా నిలకడగా ఉండడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,700 రూపాయలుగా ఉంది.
ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,350 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,150 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర కూడా మార్పులు లేకుండా 46,700 రూపాయల వద్ద నిలిచింది.