రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. ఇకపై వాటి ధరలు రెట్టింపు..

-

రైల్వేలో ప్రయాణం సేఫ్..అంతేకాదు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ముందుగానే డబ్బులు పే చేస్తే మన సీటు దగ్గరికే ఫుడ్ సర్వీస్ను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ధరలు పెరిగాయి.. ఇక మీదట బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లు ట్రైన్లలో ఉండి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇకపై కొత్త ఛార్జీలు తప్పవు. ట్రైన్ బుకింగ్ సమయంలో కాకుండా రైలులో ఉండి ఆర్డర్ ఇస్తే రూ.50 చెల్లించాల్సిందేనట..

ప్రీమియం ట్రైన్లు అయిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజాస్ ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ లలో కూడా న్యూ క్యాటరింగ్ ఛార్జెస్ మాత్రమే అమలవుతాయి.ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రీసెంట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి.. అదనపు ఛార్జీ అయిన రూ.50కలుపుతున్నట్లు పేర్కొంది. మరోవైపు ట్రైన్ టికెట్ బుకింగ్ సమయంలో కాఫీ, టీ లాంటివి బుక్ చేసుకోకపోయినా అదనపు ఛార్జీలు ఉండవని చెప్పింది.

ప్రీమియం రైళ్లలో టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఛార్జీలను రైల్వే బోర్డు నిర్దేశించింది. ప్రయాణీకులు తప్పనిసరిగా ధరలలో జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఇక అదనపు ఛార్జీలు ఏమీ ఉండవు.

రాజధాని, దురంతో & శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో ధరలను చూస్తే..బ్రేక్‌ఫాస్ట్ కోసం రూ.105కి బదులుగా రూ. 155 చెల్లించాలి.సాయంత్రం స్నాక్స్ కోసం రూ. 90కి బదులుగా రూ. 140,లంచ్ లేదా డిన్నర్ కోసం రూ. 185కి బదులుగా రూ. 235 చెల్లించాలి..వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారు అల్పాహారం కోసం రూ. 155కి బదులుగా రూ. 205 చెల్లించాలి.సాయంత్రం అల్పాహారం కోసం, రూ. 105కి బదులుగా రూ. 155, అదే విధంగా లంచ్ లేదా డిన్నర్ కోసం రూ. 244కి బదులుగా రూ. 294 గా చెల్లించాలి..ఇవి తాజాగా అమలవుతున్న ధరలు..

Read more RELATED
Recommended to you

Latest news