భోజన ప్రియులకు బంఫర్ ఆఫర్.. ఫుల్లుగా కుమ్మండి..లక్ష పట్టండి..

-

ఈ భూమ్మీద ఉన్న అన్నీ దేశాలతో పోలిస్తే మన భారతీయులు భోజన ప్రియులు.. మనసారా నవ్వడం, కడుపు నిండా తినడం మన వాళ్ళకు పుట్టుక తో వచ్చిన అలవాటు. మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫుడ్ ఫెమస్..ప్రజల రుచిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకుని వివిధ రెస్టారెంట్లు విభిన్నమైన ఆహారాలను, ఆఫర్స్ ను అందిస్తూనే ఉంది. తన కస్టమర్స్ ను ఆకర్షిస్తుంది. మీరు కనుక భోజన ప్రియులు అయితే.. విభిన్న రుచులను ఇష్టపడేవారు అయితే.. అలాంటివారి కోసం ఒక శుభవార్తను వినిపించనున్నాం. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే కడుపునిండుగా పుష్టిగా తినవచ్చు.. అంతేకాదు అలా మీరు తినే ప్లేస్ లో ఉన్న ఆహారపదార్ధాలను పూర్తిగా తింటే ఏకంగా లక్ష రూపాయలను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.

- Advertisement -

ఈ బాహుబలి థాలీని హైదరాబాద్‌ లోని ఓ రెస్టారెంట్‌ ఆఫర్ చేస్తోంది. ఈ థాలీలో మొత్తం 30 శాకాహార, మాంసాహార పదార్ధాలు ఉంటాయి. చికెన్ బిర్యానీ, రొయ్యల కూర, షెజ్వాన్ నూడుల్స్ , రైతా , సలాడ్‌ సహా పానీయాలను అందిస్తారు. ఇలా ఈ ప్లేట్‌లో 30 రకాల ఆహారపదార్ధాలు అందిస్తారు. అందుకనే దీనిని బాహుబలి థాలీ గా పిలుస్తున్నారు. ఈ ప్లేట్ ను రూ. 1800లకు అందిస్తున్నారు..కేవలం ఈ ప్లేట్ తింటే బహుమతిని గెలుచుకోచ్చు అని అనుకుంటుంటే.. తప్పుగా ఆలోచిస్తున్నట్లే.. ఈ ప్లేట్ తిని బహుమతి గెలుచుకోవడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. మీరు ఈ బాహుబలి ప్లేట్ ను కేవలం అరగంటలో పూర్తి చేయాలి.

ఈ ఆహారాన్ని 30 నిమిషాల సమయంలో పూర్తి చేస్తే.. బహుమతిని గెలుచుకుని లక్షాధికారి కావచ్చు..ఈ కాంపిటీషన్ కోసం సూదుర ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తున్నారు.బాహుబలి థాలీ ని ఒక్కరును పూర్తిగా అర్ధగంటలో తినలేకపోయారు. అయితే మీరు కనుక నగర వాసులు అయితే.. ఈ ప్లేట్‌ను పూర్తి చేసి.. బహుమతిని సొంతం చేసుకోవానే కోరిక ఉంటే.. మీరు సోమవారం నుండి గురువారం వరకు ఈ రెస్టారెంట్‌కి వెళ్ళవచ్చు. ఒకసారి ప్రయత్నించవచ్చు. ఈ ఛాలెంజ్ కు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఆతర్వాత ఈ ఛాలెంజ్ క్లోజ్ అవుతుంది..ఈ ఆఫర్ ను పెట్టడం వల్ల జనాలు చూడటానికి అక్కడికి వస్తున్నారు..మరి ఆ ఛాలెంజ్ లో ఎవరూ విన్నర్ అవుతారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...