స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి అలర్ట్..!

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ వుందా…? అయితే మీకు అలెర్ట్. స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కి పలు జాగ్రత్తలు చెప్పింది. కస్టమర్స్ ని ఈ తప్పులు అస్సలు చెయ్యద్దని హెచ్చరించింది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… ఎస్‌బీఐ బ్యాంక్ తాజాగా ట్వీట్ ద్వారా తమ బ్యాంకు సంబంధించి 44 కోట్ల మంది కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది.

SBI
SBI

మొబైల్‌ ఫోన్‌కు కొన్ని ఎస్ఎంఎస్‌లు వస్తూ ఉంటాయి అందులో ఉచిత బహుమతులు అని కొన్ని యాడ్స్ వస్తాయి. అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవద్దు అని అంది. అలానే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ ద్వారా సూచించింది. అయితే కొన్ని లింక్స్ క్లిక్ చేస్తే మన సమాచారం ప్రైవేటు వ్యక్తులు లేదా హ్యాకర్ల చేతికి చేరుతుంది అని తెలిపింది. కాబట్టి వీటిని క్లిక్ చేసే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది.

అదే విధంగా పుట్టిన రోజు తేదీ, డెబిట్ కార్డ్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకర్ యూజర్ ఐడీ, డెబిట్ కార్డు పిన్ నంబర్, సీవీవీ, ఓటీవీ వంటి వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఎస్‌బీఐ, ఆర్బీఐ, ప్రభుత్వ ఆఫీసులు పోలీసులు, కేవైసీ ఆఫీసుల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ వచ్చే కాల్స్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని అంది. అలానే తెలియని యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా మంచిది కాదు అని చెప్పడం జరిగింది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లను క్లిక్ చేయవద్దని ఎస్‌బీఐ చెప్పింది.