వామ్మో.. బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ చార్జిలు అంత‌నా.. ఏకంగా రూ.4150 వ‌సూలు చేసిన ఎస్‌బీఐ..!

-

సాధార‌ణంగా బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు అందించే వివిధ ర‌కాల సేవ‌ల‌కు గాను భిన్న ర‌కాల చార్జిల‌ను వ‌సూలు చేస్తుంటాయి. అయితే అవి చాలా వ‌ర‌కు త‌క్కువ‌గానే ఉంటాయి. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఆ చార్జిలు త‌క్కువ‌గా, ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువ‌గా ఉంటాయి. కానీ ఓ ఖాతాదారులు ఫిజిక‌ల్ స్టేట్‌మెంట్ అడిగాడ‌ని చెప్పి ఎస్‌బీఐ ఏకంగా రూ.4150 చార్జిల కింద వ‌సూలు చేసింది. ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

sbi charged whooping amount of rs 4150 for physical bank statement

దేవేంద్ర సింగ్ అనే వ్య‌క్తి ఎస్‌బీఐ బ్యాంకులో 4 నెల‌ల ఫిజిక‌ల్ స్టేట్‌మెంట్ కోసం రిక్వెస్ట్ పెట్టాడు. మొత్తం 80 పేజీల స్టేట్‌మెంట్‌ను ఎస్‌బీఐ పంపించింది. కానీ అందుకు గాను రూ.4150 వ‌సూలు చేసింది. దీంతో ఆ విష‌యాన్ని అత‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అయితే అందుకు ఎస్‌బీఐ రిప్లై ఇచ్చింది.

ఖాతాదారులు త‌మ నుంచి చార్జిల‌ను త‌ప్పుగా వ‌సూలు చేశామ‌ని భావిస్తే వారు https://crcf.sbi.co.in/ccf/ అనే సైట్‌ను సంద‌ర్శించి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చని లేదా ఉద‌యం 8 నుంచి రాత్రి 8 గంట‌ల మ‌ధ్య 1800 11 2211, 1800 425 3800 అనే టోల్ ఫ్రీ నంబ‌ర్ల‌తోపాటు 080-26599990 అనే నంబ‌ర్‌కు కాల్ చేసి ఫిర్యాదును తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని చెప్పింది.

అయితే ఈ-మెయిల్ ద్వారా స్టేట్‌మెంట్ కోరితే ఉచితంగానే బ్యాంకులు అందిస్తాయి. కానీ అత‌ను ఫిజిక‌ల్ స్టేట్‌మెంట్ అడిగాడు. అందుక‌నే ఎస్‌బీఐ చార్జిల‌ను వ‌సూలు చేసింది. ఒక్కో పేజీకి రూ.44 చార్జి + జీఎస్‌టీ క‌లిపి రూ.52 వ‌సూలు చేసింది. అందుక‌నే 80 పేజీల‌కు అంత మొత్తం అయింది. అయితే ఇందుకు గ‌రిష్ట ప‌రిమితి లేదు. ఆ విష‌యాన్ని ఎస్‌బీఐ త‌న సైట్ లో తెలియ‌జేసింది. వాస్త‌వానికి ఈ-మెయిల్ ద్వారా స్టేట్‌మెంట్ అడిగి దాన్ని బ‌య‌ట ప్రింట్ తీసుకుంటే కాపీ రూ.2 వేసుకున్నా 80 పేజీల‌కు రూ.160 మాత్ర‌మే అయ్యేది. అన‌వ‌స‌రంగా అంత మొత్తం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఇక‌పై ఎవ‌రైనా ఈ విష‌యాన్ని గుర్తుంచుకుంటే మంచిది. లేదంటే ఆ వ్య‌క్తి లాగే డ‌బ్బు న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news