మీరు ఫోన్ పే, పేటీఎం వాడుతున్నారా? ఈ చార్జీల గురించి తెలుసుకోవాల్సిందే..!

-

కరోనా సమయంలో డబ్బు లావాదేవీలు పూర్తిగా తగ్గి పోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి..ముఖ్యంగా యూపిఐ పేమెంట్స్ ఫోన్‌ పే, పేటీఎం వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ యాప్స్ ఉండే ఉంటాయి. చాలా మంది పేటీఎం లేదా ఫోన్ పే ద్వారా మొబైల్ రీచార్జ్ చేస్తుంటారు. ఇలా మీరు కూడా రీచార్జ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటే మాత్రం ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

ఫోన్‌ పే, పేటీఎం వంటివి యూజర్ల నుంచి సర్ చార్జీ/ ప్లాట్‌ఫామ్ ఫీజు/ కన్వీనియన్స్ ఫీజు వంటి వాటిని వసూలు చేస్తున్నాయి. మొబైల్ రీచార్జ్ లేదా బిల్ పేమెంట్స్‌ వంటి వాటిపై ఈ చార్జీలు తీసుకుంటున్నాయి. అందువల్ల మీరు రీచార్జ్ చేసుకునే ముందు ఈ విషయాన్ని గమనించండి.ఈ విషయం గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.ఫోన్‌పే ద్వారా మీరు మొబైల్ రీచార్జ్ చేస్తే.. ప్లాట్‌ఫామ్ చార్జీల రూపంలో రూ.1 నుంచి రూ. 2 వరకు చెల్లించుకోవాలి. మీరు ఏ పేమెంట్ మోడ్ ద్వారా అయినా లావాదేవీ నిర్వహించినా ఈ ఫీజు పడుతుంది. అంటే యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, ఫోన్ వాలెట్ ఇలా మీరు ఎలా డబ్బులు చెల్లించినా ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు పడుతుంది. రూ. 100 మొబైల్ రీచార్జ్‌ చేసుకుంటే రూ. 101 చెల్లించాల్సి ఉంటుంది..

ఇక పేటీఎం కూడా అంతే… 1 నుంచి రూ. 6 వరకు చార్జీలు వసూలు చేస్తోంది. మొబైల్ రీచార్జ్‌పై సర్‌చార్జ్ రూపంలో పేటీఎం ఈ అదనపు చార్జీలు తీసుకుంటోంది. రూ.6 వరకు ఈ భారం పడుతుంది. పేటీఎం వాలెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ఇలా మీరు ఏ మార్గంలో రీచార్జ్ చేసుకున్నా ఈ చార్జీలు చెల్లించాల్సిందే..ప్రతి ఒక్కరికి ఈ చార్జీలు వర్తించవు..

Read more RELATED
Recommended to you

Latest news