బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌.. ఇక‌పై వాట్సాప్‌లో సేవ‌లు..

-

ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా త‌న ఖాతాదారుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై ఆ బ్యాంక్‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు బ్యాంక్ సేవ‌ల‌ను వాట్సాప్‌లోనూ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇప్ప‌టికే బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం వాట్సాప్ ద్వారా ఆ సేవ‌ల‌ను ఉప‌యోగించుకునేందుకు వీలు ఏర్ప‌డింది. ఈ మేర‌కు ఆ బ్యాంక్ తాజాగా ఈ సేవ‌ల‌ను ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించింది.

bank of baroda starts whatsapp services to its customers

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 24 గంట‌ల పాటూ ల‌భిస్తాయి. ఇందుకు గాను వారు అద‌నంగా ఎలాంటి రుసుం చెల్లించాల్సిన ప‌నిలేదు. అలాగే ఎలాంటి యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన ప‌ని కూడా లేదు. ఇక కస్ట‌మ‌ర్లు 8433888777 అనే నంబ‌ర్‌ను త‌మ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవాలి. అనంత‌రం ఆ నంబ‌ర్‌కు Hi అనే మెసేజ్‌ను పంపిస్తే చాలు, వెంట‌నే ఆ బ్యాంకు సేవ‌ల‌ను వాట్సాప్‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క‌స్ట‌మ‌ర్లు వాట్సాప్ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వ‌యిరీ, మినీ స్టేట్‌మెంట్‌, చెక్ స్టేట‌స్‌, చెక్ బుక్ రిక్వెస్ట్‌, డెబిట్ కార్డు బ్లాకింగ్ వంటి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే బ్యాంకు అందించే ప్రొడ‌క్ట్స్‌, సేవ‌లు, ఇత‌ర స‌మాచారాన్ని కూడా వాట్సాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇక బ్యాంక్ బ‌రోడా కాకుండా ఇత‌ర బ్యాంకుల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు కూడా ఈ బ్యాంక్ సేవ‌ల‌ను వాట్సాప్‌లో పొంద‌వ‌చ్చు. బ్యాంక్‌కు చెందిన ప్రొడ‌క్ట్స్‌, సేవ‌లు, ఆఫ‌ర్లు, ఏటీఎంల వివ‌రాల‌ను ఇత‌ర క‌స్ట‌మ‌ర్లు తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news