ఈ తప్పు చెయ్యకుండా చూసుకోండి.. లేదంటే పీఎఫ్ అకౌంట్ క్లోజవుతుంది..!

-

ప్రావిడెంట్ ఫండ్‌ ఎంతో ముఖ్యమైంది అన్న సంగతి తెలిసిందే. జీవితకాలానికి సరిపడ ఆదాయాలను ఈ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు పెడితే మనం పొందొచ్చు. అందుకని అకౌంట్‌కు సంబంధించిన రూల్స్‌ను తప్పక తెలుసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నంత కాలం, పీఎఫ్‌ అకౌంట్లోకి డబ్బులను జమ చేస్తే రిటైర్‌మెంట్ అప్పుడు డబ్బులొస్తాయి.

చిన్న చిన్న వాటి వలన కొందరి పీఎఫ్ అకౌంట్లు క్లోజవుతున్నాయి. అయితే అకౌంట్ ఎందుకు క్లోజ్ అవుతుంది..? కారణాలు ఏమిటి అనేది చూస్తే… మీ పీఎఫ్ అకౌంట్‌ను మీ పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. లేదంటే మీ పాత కంపెనీ మూతపడినా లేదు అంటే అకౌంట్లో 36 నెలల పాటు ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరగకపోయినా అప్పుడు ఖాతా క్లోజ్ అయ్యిపోతుంది.

అలాంటి అకౌంట్లను ఈపీఎఫ్ఓ ‘ఇన్‌ఆపరేటివ్’ అకౌంట్ల కేటగిరీలో పెడతారు. కొందరు తమ అకౌంట్లను కొత్త కంపెనీకి మార్చుకోలేకపోవడంతో ఇబ్బంది పడాలి. అయితే క్లోజ్ అయినా దానిని మళ్ళీ యాక్టివేట్ ఎలా చెయ్యాలి అనేది చూస్తే.. ఒకసారి మీ పీఎఫ్ అకౌంట్ ‘ఇన్‌ఆపరేటివ్’ అయితే యాక్టివేట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓలో దరఖాస్తు చేసుకోవాలి.

ఇన్‌యాక్టివ్ అకౌంట్లకు చెందిన క్లయిమ్స్‌ను పరిష్కరించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్‌ఆపరేటివ్ పీఎఫ్ అకౌంట్లకు సంబంధించిన క్లయిమ్‌ను సెటిల్ చేసే ముందు ఉద్యోగికి చెందిన కంపెనీ ఆ క్లయిమ్‌ను సర్టిఫై చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Latest news