అదిరే స్కీమ్.. రూ.12 కడితే రూ.2 లక్షల ప్రయోజనం..!

-

కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఎన్నో ప్రయోజనాలని పొందొచ్చు. ముఖ్యంగా పెదాలకి ఈ స్కీమ్స్ వలన చాల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY అనే పథకం కూడా వుంది.

 

PMSBY | ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన
PMSBY | ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన

దీని వలన ప్రజలకి బెనిఫిట్ గా ఉంటుంది. ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY అనే పథకం కూడా ఒకటి. ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్.

ఈ స్కీమ్ ద్వారా అతి తక్కువ ప్రీమియంతో కుటుంబానికి ఆర్థిక భద్రత కలుగుతుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరచ్చు. ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు పాలసీ అందుబాటులో ఉంటుంది. తర్వాత మళ్లీ రెన్యూవల్ అవుతుంది.

ఇక డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే.. ఈ సురక్ష బీమా యోజన స్కీమ్‌లో చేరితే ఏడాదికి రూ.12 చెల్లించాలి. దీనితో రూ.2 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. మే నెల చివరిలో ఈ ప్రీమియం డబ్బులు చెల్లించాలి.

ఒకవేళ బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఈ పాలసీ తీసుకుంటే డబ్బులు కూడా ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే.. బీమా డబ్బులు కుటుంబానికి అందిస్తారు.

అలానే శాశ్వత అంగవైకల్యం వచ్చిన కూడా బీమా డబ్బులు చెల్లిస్తారు. ఇలా ఈ స్కీమ్ ద్వారా ఈ లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news