రూ.55 పొదుపుతో రూ.36 వేలు ఇలా పొందండి..!

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. వీటి వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా అందరికీ ఈ స్కీమ్స్ బాగా బెనిఫిట్ అవుతాయి. అయితే ఈ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటి.

డబ్బులు
డబ్బులు

ఈ స్కీమ్ వలన అసంఘటిత రంగంలోని కార్మికులుకి ప్రయోజనకరంగా ఉంటుంది అని కేంద్రం తీసుకొచ్చింది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే..

ఈ పధకం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీధి వ్యాపారులు, రిక్షా తొక్కే వాళ్లు, నిర్మాణ కార్మికులు వంటి వారందరూ ఈ స్కీమ్ లో చేరచ్చు. దీనితో ప్రతీ నెలా రూ.3000 పొందొచ్చు. అంటే ఏడాదికి రూ.36 వేలు వస్తాయి.

అయితే ఇలా ప్రతీ నెలా డబ్బులు పొందాలంటే.. ఖచ్చితంగా ఈ స్కీమ్‌లో చేరిన వారు కూడా ప్రతి నెలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వరకు డబ్బులు చెల్లిస్తూ వెళ్లాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు.

ఇక ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే.. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.55 చెల్లిస్తే రూ.3 వేలు పొందొచ్చు. అదే 40 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.200 కట్టాలి. దీనిలో కనుక చేరాలంటే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకంలో చేరొచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉంటే చాలు.