నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

-

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు ఏళ్ల తరబడి భూమిలో కలిసిపోకుండా జీవం మనుగడకే హాని కలిగిస్తాయి. అందుకే వీటిని బ్యాన్‌ చేస్తున్నారు. కానీ నిత్యజీవితంలో ఏదో విధంగా దీన్ని మనం వాడక తప్పడం లేదు. అందుకే ఒక వినూత్న ప్రయత్నం చే సింది టీటీడీ. కళియుగ వైకుంఠం తిరుపతికి ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే. ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఈ నయా ఆలోచన చేశారు. స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఇక్కడి లడ్డూ ప్రసాదాలకు కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉంది.

సాధారణంగా ప్రసాదాలను ప్లాస్టిక్‌ కవర్లలో భక్తులకు అందిస్తూ వచ్చింది. అయితే తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు 2018 లో ప్లాస్టిక్‌ కవర్లను నిషేధించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ అందలో భాగంగానే ఏడు కొండలపైన ప్లాస్టిక్‌ వాడకాన్ని క్రమంగా తగ్గించారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్, కూల్‌డ్రింక్స్‌ నిషేధిస్తూ నిర్ణయం తసుకున్న తర్వాత 2010 లో ప్లాస్టిక్‌ రహిత తిరుమలగా ప్రకటించింది టీటీడీ.

అయితే లడ్డు ప్రసాదాలు తీసుకెళ్లడానికి కవర్లు చాలా అవసరం. ఎందుకంటే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. అందుకే ఈ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి జ్యూట్‌ బ్యాగులను అలవాటు చేయడం మొదలు పెట్టింది. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంలో గుడ్డ బ్యాగులను భర్తి చేసింది. దీనికి రూ.11, రూ.9 ఉండటంతో భక్తులకు కాస్త భారంగా ఉండేది. భక్తుల బాధలను గ్రహించిన టీటీడీ వాటి స్థానంలో పర్యావరణానికి హాని కలిగించని వాటి దృష్టి పెట్టింది. విత్తనాల తయారు చేసిన కవర్లను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా బయో డిగ్రేడబుల్‌ కవర్లను అందుబాటులో తెచ్చింది. గో గ్రీన్‌ దిశగా ఈ కవర్లను భూమిలో పాతిపెడితే మొక్క మొలకెత్తే విధంగా కవర్లను తయారుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news