చేతికి రూ.లక్షల్లో రాబడి పొందే సూపర్ స్కీమ్… వివరాలు ఇవే…!

Join Our Community
follow manalokam on social media

ఇప్పుడు ఒక సూపర్ స్కీమ్ ని కేంద్రం తీసుకు వచ్చింది. దీనితో మీ చేతికి అదిరిపోయే రాబడి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్‌పీఎస్ స్కీమ్‌ లో పీఎన్‌బీ ద్వారా కూడా చేరొచ్చు. అయితే మీరు కనుక ఇందులో చేరితే ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… దేశీ రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB తన కస్టమర్ల కోసం చాల స్కీమ్స్ అందిస్తోంది. అయితే వీటిల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS కూడా ఒకటి.

ఈ స్కీమ్‌ లో చేరడం వల్ల పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి భారీ మొత్తాన్ని అందుకోవచ్చు. ఇందులో చేరితే ఎన్నో లాభాలు పొందవచ్చు. మరి దాని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. వివరాల లోకి వెళితే… పీఎన్‌బీ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఎన్‌పీఎస్ అకౌంట్ లో చేరడం వల్ల రూ.50 వేల అదనపు పన్ను తగ్గింపు కూడా లభిస్తుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంది. ఈ స్కీమ్‌ లో ఎవరు చేరచ్చు అనే విషయానికి వస్తే..18 నుంచి 60 ఏళ్ల మధ్య లో వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌ లో చేరొచ్చు.

ఇక్కడే కాదు ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వెళ్లి ఎన్‌పీఎస్ ఖాతాని మీరు ఓపెన్ చేసికోవచ్చు. ఎన్‌పీఎస్‌లో డబ్బులు పెట్టడం వల్ల రిటైర్మెంట్ తర్వాత టెన్షన్ లేని జీవితాన్ని గడపొచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉండగా స్కీమ్‌లో చేరిన తర్వాత అవసరం అనుకుంటే డబ్బులు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. 2004 లో వచ్చిన ఈ స్కీమ్‌ లో చేరడం వల్ల ఏకంగా దాదాపు రూ.68 లక్షలు పొందొచ్చు. ప్రతీ నెల రూ.5 వేలు ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 30 ఏళ్లు డబ్బులు డిపాజిట్ చేస్తూనే ఉండాలి. అయితే 10 శాతం రాబడి అని అనుకుంటే మెచ్యూరిటీ సమయంలో రూ.1.11 కోట్లు లభిస్తాయి. అయితే 60 శాతం డబ్బులు అంటే దాదాపు రూ.68 లక్షలు చేతికి తీసుకోవచ్చు. మిగిలినవి పెన్షన్ రూపం లో మీ చేతికి ప్రతీ నెల వస్తాయి.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...