బీజేపీ,జనసేన ప్రగల్భాలు ఇమేజ్ డ్యామేజ్ చేశాయా ?

-

ఏపీలో పురపాలక పోరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నికల సందడి గ్రామాల్లో నుండి పట్టణాలలోకి మారుతోంది. అయితే ఎన్నికల కమీషన్ గతంలో ఎక్కడైతే ప్రక్రియ నిలుపుదల చేశారో అక్కడ నుంచి ప్రారంభించాలని చెప్పడంపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. గతంలో నామినేషన్‌ వేయలేని బీజేపీ,జనసేనలు ఇప్పుడు మళ్లీ తమకు చాన్స్ ఇవ్వాలని చేస్తున్న హడావిడి పై ఇతర రాజకీయపక్షాలు సెటైరికల్ కామెంట్స్ తో ఈ రెండు పార్టీలను కార్నర్ చేస్తున్నాయట..

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. 2007లో చివరసారిగా పురపోరు నగరంలో జరిగింది. అప్పటి నుండి వివిధ కారణాలతో అధికారుల పాలనలోనేకొనసాగుతోంది.
అయితే సమయం వచ్చినపుడు సత్తా చూపాలి. చేయిదాటాక ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. తిరుపతి కార్పొరేషన్‌ లో ఇప్పుడవే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.గతంలో నామినేషన్‌ వేయలేని పార్టీలు, ఇప్పుడు తమకు అవకాశం వస్తే అని ప్రల్భాలు పలకడం నలుగురిలో చులకన చేస్తుందట.

గత ఏడాది వాయిదా పడిన ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ సై అనటంతో అన్ని పార్టీల్లో జోష్ వచ్చింది. కానీ, బిజెపి, జనసేన మాత్రం నిరాశలో పడ్డాయట. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని లేఖల మీదా లేఖలు రాస్తున్నాయట. ఇప్పుడు అవకాశం ఇస్తే, ఎన్నికలలో సత్తా చూపుతామని రెండు పార్టీల నేతలు స్థానికంగా చెప్పకుంటున్నారట.
గత ఏడాది నగరంలోని యాభై వార్డులకు అభ్యర్థులను నిలపటంలో విఫలమైన బిజెపి, జనసేన ఇప్పుడు అవకాశం ఇస్తే అనటంపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారట.

ఆడలేక మద్దెల ఓడన్నట్టు,బిజెపి జనసేన పార్టీల తీరు ఉందని స్థానికంగా చర్చ జరుగుతోందట. గతంలో రెండు, మూడు చోట్ల కూడా నామినేషన్లు వేయలేని పార్టీలు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నాయంటున్నారట.
ఇటు టీడీపీ నేతలు కూడా కొత్త నోటిఫికేషన్ కావాలి అనే ముందు గతంలో ఎందుకు నామినేషన్లు వేయలేదో సమాధానం చెప్పాలని బీజేపీ,జనసేనని కార్నర్ చేస్తున్నాయట..దీంతో కొత్త నోటిఫికేషన్ పై బీజేపీ,జనసేన చేసిన హడావిడి బూంరంగ్ అయిందా అన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news