పెను తుపాన్‌గా మారుతున్న `బుల్‌బుల్‌`.. తెలుగు రాష్ట్రాల్లో..

-

బుల్ బుల్ తుపాను తూర్పు మధ్య, దాన్ని ఆనుకున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింత బలపడుతోంది. ఇది ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరాన, బెంగాల్లోని సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా 860 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది రేపటికి మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారునుంది. ఆ తర్వాత 36 గంటల్లో పెను తుపాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు.

ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుతుంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఉత్తర ఒడిశా, 10, 11 తేదీల్లో బెంగాల్‌లో మీదా దీని ప్రభావం మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం పెద్దగా ఉండదని అంచనా. చెదురు మదురు వర్షాలు మాత్రం పడవచ్చు. చలి పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news