క‌ల్తీ ప‌సుపును ఈ విధంగా గుర్తించండి.. ఈ టెస్ట్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది

ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ అనేది కామన్ గా మారిపోయింది. వినియోగదారులు కూడా కల్తీకి అలవాటు పడినట్లుగా మాట్లాడుతున్నారు. ఆ.. ఇవి ఒరిజినల్ అయ్యుండదని, ఖచ్చితంగా కల్తీ చేసి ఉంటారని చెప్పుకుంటున్నారు. ఐతే కల్తీ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు.

అది ఏ వస్తువైనా సరే, వంటనూనె అయినా, పాలైనా, పప్పులైనా, ఇంకా ఏదైనా కల్తీ ఆహారం కలుషిత ఆహారం కిందే లెక్క. ఐతే మార్కెట్లో దొరికే ప్రతీదీ కల్తీ అయ్యిందన్న గ్యారంటీ లేదు. కానీ ఏది కలుషితం అయ్యిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం వంటింట్లో వాడే పసుపు కలర్ తో కలుషితం అయ్యిందో లేదో ఈ టెస్ట్ తో తెలుసుకుందాం

ఈ మేరకు ఫుడ్ స్టాండర్డ్స్ ఇండియా ఒక వీడియో రిలీజ్ చేసింది. వంటింట్లో వాడే పసుపు కలర్ తో కల్తీ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవచ్చో చూపించింది. దీనికోసం ఏం చేయాలంటే,

ముందుగా రెండు గ్లాసుల నీళ్ళు తీసుకోండి. ఆ గ్లాసుల్లో మీరు ఎంచుకున్న పసుపు శాంపిల్స్ ని వేయండి.

కల్తీలేని పసుపు ఉన్న గ్లాసులో పసుపు, లేత పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. అదే కల్తీ అయిన పసుపు మాత్రం ముదురు పసుపు పచ్చరంగులోకి మారుతుంది. ఈ విధంగా పసుపు కల్తీ అయ్యిందో లేదో సులువుగా తెలుసుకోవచ్చు.

పసుపులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది సాయపడుతుంది.

 

రోగనిరోధక శక్తిని పెంచడం నుండి సంతాన సాఫల్యత వరకు శతావరి చేసే మేలు