ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఇంకో పదిరోజులు మాత్రమే గడువు ఉంది. వీలైనంతగా ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే రిటర్న్ ఫైల్ చేసిన వారిలో కొందరు రీఫండ్స్ కూడా అందుకున్నారు. అయితే మీరు రిటర్న్‌ను ఫైల్ చేసిన తర్వాత అందులో ఏవైనా తప్పులు ఉన్నాయని గుర్తించారా? అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటిని సులువుగా పరిష్కరించుకోవచ్చు. రీఫండ్ ఆలస్యానికి అడ్రస్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వాటిల్లో తప్పులు కారణమైతే ఏం చేయాలో చూద్దాం..
పన్ను చెల్లింపుదారులు రిక్వెస్ట్‌లు ఎలా సబ్మిట్ చేయాలి?
ముందు ‘ఇ-ఫైలింగ్’ అధికారిక పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ లో లాగిన్ అవ్వండి.
తర్వాత పేజ్ టాప్ లెఫ్ట్ సైడ్‌లో కనిపించే ‘మై అకౌంట్’ ట్యాబ్ ఓపెన్ చేయండి. దీంట్లో ‘సర్వీస్ రిక్వెస్ట్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.
‘సర్వీస్ రిక్వెస్ట్’ సెక్షన్‌లో రిక్వెస్ట్ టైప్‌ని ‘న్యూ రిక్వెస్ట్’గా ఎంచుకోండి.
తర్వాత ‘రిక్వెస్ట్ కేటగిరీ’లో ‘ఛేంజ్ ఐటీఆర్ ఫారం పర్టికులర్స్’ అనే ఆప్షన్ సెలక్ట్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
వెంటనే కొత్త స్క్రీన్‌లో ‘ఛేంజ్ ఐటీఆర్ ఫారం పర్టికులర్స్’ అని డిస్‌ప్లే అవుతుంది.
పన్ను చెల్లింపుదారుల PAN నంబర్ కూడా కనిపిస్తుంది.
ఇప్పుడు మీ ఐటీఆర్ ‘అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్’ని ఎంటర్ చేయండి.
నెక్స్ట్ స్క్రీన్‌లో ఛేంజింగ్ బ్యాంక్ అకౌంట్ డీటేల్స్’, ‘ఛేంజ్ అడ్రస్ డీటేల్స్’, ‘ఛేంజ్ ఇమెయిల్ ఐడీ/మొబైల్ నంబర్’ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
ఇక్కడ పన్ను చెల్లింపుదారు అవసరమైన ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.
అవసరమైన ఇన్‌ఫర్మేషన్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
‘ఛేంజ్ ఇన్ ఐటీఆర్ ఫారం పర్టికులర్స్’ రిక్వెస్ట్ సబ్మిట్ అయితే, సక్సెస్‌ఫుల్ అయినట్లు స్క్రీన్‌పై ట్రాన్సాక్షన్ ఐడీ డిస్‌ప్లే అవుతుంది.
బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసిన తర్వాత, ITRని మళ్లీ రీ-వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. అదెలాగో చూడండి.
ముందుగా ‘ఇ-ఫైలింగ్’ అధికారిక పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ లో లాగిన్ అవ్వండి. తర్వాత పేజ్ టాప్ లెఫ్ట్ సైడ్‌లో కనిపించే ‘మై అకౌంట్’ ట్యాబ్‌కు వెళ్లండి.
ఇక్కడ బ్యాంక్ డీటేల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అప్‌డేట్ చేసిన బ్యాంక్ అకౌంట్ పక్కన రీ-వ్యాలిడేట్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటించండి. బ్యాంక్ డీటేల్స్ రీవ్యాలిడేట్ అయిన తర్వాత, ITR ప్రాసెస్ అవుతుంది, రీఫండ్ ఇష్యూ అవుతుంది.
ఇప్పటికే కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన వారికి రిఫండ్ ఇష్యూ కూడా అయింది. మీకు అర్హత ఉండి ఇంకా రాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి.