ఫ్యాక్ట్ చెక్: కొత్త ప్రభుత్వ రూల్స్ ప్రకారం అన్ని సిమ్స్ ని ఒకరోజు బ్లాక్ చేస్తారా..?

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.

వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. అందరి సిమ్ కార్డ్స్ ని ఒక రోజు పాటు నిలిపి వేస్తారని ఓ వార్త నెట్టింట షికార్లు కొడుతోంది. నిజంగా అందరి సిమ్ కార్డ్స్ ని ఒక రోజు పాటు నిలిపి వేస్తారా..? ఇది నిజమేనా అనేది చూస్తే.. ‘DLS న్యూస్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ యొక్క థంబ్‌నెయిల్ లో వున్నది నిజం కాదు అని క్లియర్ గా తెలుస్తోంది.

DLS న్యూస్ ఏం అంటోందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కొత్త నిబంధన ప్రకారం అన్ని సిమ్ కార్డ్‌లు 24 గంటల పాటు బ్లాక్ చేస్తారని అంటోంది. కానీ ఇది నిజం కాదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే.
అయితే సిమ్ స్వాప్/రీప్లేస్‌మెంట్ కోసం మాత్రమే జారీ చేయబడిన కొత్త సిమ్ కార్డ్స్ కి ఎసెమ్మెస్ సర్వీస్ ని ప్రారంభించిన తర్వాత 24 గంటల పాటు నిలిపివేయబడుతుంది. అంతే కానీ అందరి సిమ్ కార్డ్స్ సేవలని నిలిపివేయరు.