మొదటి స్మార్ట్‌ కరెంట్‌ పోల్‌.. ఎక్కడంటే..!

-

ప్రస్తుతం అంతా స్మార్ట్‌ ప్రపంచం. అన్ని స్మార్ట్‌ టీవీలు, ఫోన్లు, ఇంకా ఎన్నో స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో మొదటి సారి కరెంట్‌ పోల్‌ను కూడా ఏర్పాటైపోయింది. దీంతో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందామా..
అది దేశంలోనే మొదటి స్మార్ట్‌ కరెంట్‌ పోల్‌ ( First Smart Current Pole ) .. ధర రూ.2 కోట్లు. అది ఎక్కడేంటి మన ప్రధానమంత్రి మోడీ సార్‌ స్వరాష్ట్రం అయిన గుజరాత్‌లో..! బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్‌ ఒకటి.

First Smart Current Pole | మొదటి స్మార్ట్‌ కరెంట్‌ పోల్‌
First Smart Current Pole | మొదటి స్మార్ట్‌ కరెంట్‌ పోల్‌

గుజరాత్‌ మరింత అభివృద్ధి పథంలో నడపాలనుకుంటున్నారేమో కానీ, ఓ వైపు స్మార్ట్‌ టెక్నాలజీని వినియోగిస్తూనే.. మరో వైపు వ్యవసాయ రంగంలో కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం మనం చెప్పుకోబోయే స్మార్ట్‌ స్తంభం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇది దేశంలోనే మొదటిసారి వినియోగించిన టెక్నాలజీతో తయారు చేశారు. దీన్ని చైనాలో తయారు చేశారు. దీనికి దాదాపు రూ.38 కోట్లు ఖర్చు చేసింది అహ్మదాబాద్‌ మున్సిపాలిటీ.

స్మార్ట్‌ స్తంభంలో ఉండే ఫీచర్లు

  • వైఫై రూటర్
  • 30 w ఎల్‌ఈడీ ఫిక్చర్స్,
  • కెమెరా, 30 w స్పీకర్‌
  • యూఎస్‌బీ చార్జింగ్‌ సాకెట్, ఎలక్ట్రిక్‌ కార్‌ ఛార్జింగ్‌
  • వాతావరణ కేంద్రం, ఎమర్జెన్సీ పుష్‌ బటన్‌.

ప్రస్తుతానికి ఈ స్తంభాలను వాడేందుకు వీలు లేదు. ఎందుకంటే… వీటిలో సేవ్‌ అయ్యే డిజిటల్‌ డేటా… చైనా కంపెనీల సర్వర్లలో స్టోర్‌ అవుతుంది. అలా కాకుండా… అహ్మదాబాద్‌ సర్వర్లలో స్టోర్‌ అయ్యేలా మార్పులు చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత ఈ స్మార్ట్‌ పోల్‌ను వాడుకలోకి తీసుకువస్తారు. ఇదిలా ఉండగా..ఇటీవల గాంధీనగర్‌ రైల్వే స్టేషన్‌పై ఉన్న 5 స్టార్‌ హోటల్‌ని ప్రారంభించిన మోడీ. దానిపై ఓ ట్వీట్‌ కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news