ఈపీఎఫ్‌వోకి సంబంధించిన UAN పాస్‌వర్డ్ మర్చిపోయారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

సాధారణంగా మనకి చాలా పాస్ వర్డ్స్ ఉంటాయి. ఎక్కువ పాస్ వర్డ్స్ ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. మనం ఒక్కోసారి వాటిని మరచిపోతూ ఉంటాం. అన్నిటికి ఒకే పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే హ్యాకర్ల చేతిలో మోసపోవాల్సి వస్తుంది.

అందుకే ప్రతి దానికి వేర్వేరు పాస్‌వర్డ్‌లని మెయింటెన్ చేస్తారు. అయితే అన్నిసార్లు ఇలాంటి పాస్‌వర్డ్‌లని గుర్తుంచుకోవడం కష్టమే. ఒకవేళ కనుక ఈపీఎఫ్‌వోకి సంబంధించిన UAN నెంబర్‌, పాస్‌వర్డ్‌ కనుక మరచిపోతే అప్పుడు ఏం చెయ్యాలో చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. UAN అనేది మీ EPF ఖాతాతో మీరు పొందే యూనివర్సల్ ఖాతా సంఖ్య.

అది కనుక మరచిపోయారంటే PF ఖాతాను ఓపెన్‌ చెయ్యడం అవ్వదు. ఒకవేళ దీని పాస్‌వర్డ్‌ మరిచిపోతే మీరు EPFO ​​వెబ్‌సైట్‌కి లాగిన్ అయి కొత్త పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే పాస్‌వర్డ్‌ను మరిచిపోతే అప్పుడు దానిని రీసెట్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం.

దీని కోసం మీరు మొదట UAN అధికారిక పోర్టల్ EPFO UAN లాగిన్ పోర్టల్‌కి వెళ్లండి.
అక్కడ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
ఇప్పుడు స్క్రీన్‌లో మీరు UAN నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి.
మీ యొక్క వివరాలను ఎంటర్ చేసి తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి.
మీ UANకి లింక్ చేసిన మొబైల్ నంబర్ కనిపిస్తుంది.
మీరు మొబైల్ నంబర్‌ని మార్చాలనుకుంటే నంబర్‌ పై వున్న బటన్ క్లిక్ చేయండి
నెక్స్ట్ మీరు మీ పేరు మొదలైన వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి.
వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు మీ కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేయవచ్చు.
మీ కొత్త మొబైల్ నంబర్ కోసం OTP వస్తుంది. నచ్చిన పాస్ వర్డ్ ని రెండుసార్లు నమోదు చేయండి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news