మీ ఆధార్ నెంబర్ ని మర్చిపోయారా..? అయితే ఇలా ఆన్ లైన్ లో ఈజీగా తెలుసుకోండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వలన ఎన్నో లాభాలను పొందొచ్చు. ఎన్నో స్కీమ్స్ మొదలు ఆధార్ కార్డు ఎన్నో వాటికి అవసరం. అయితే ఒక్కోసారి మనం ఆధార్ ని మన వెంట తీసికెళ్ళడం మర్చిపోతూ ఉంటాం.

అలాంటి సమయం లో ఆధార్ కార్డు నెంబర్ కావాలంటే సులభంగా ఇలా మనం పొందొచ్చు. కార్డు లేకపోయినా నెంబర్ తో పని జరుగుతుందంటే ఇలా ఈజీగా మీరు నెంబర్ ని చూసుకుని మీ పనిని పూర్తి చేసుకోచ్చు.

అదే ఒకవేళ కనుక మీరు మీ కార్డుని పోగొట్టుకున్నట్టయితే.. అప్పుడు 50 ఫీజు చెల్లించి మళ్లీ ఆధార్ కార్డు కోసం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆర్డర్ చేయవచ్చు. 15 రోజుల్లోనే కార్డు వస్తుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మీరు కనుక మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవాలంటే ఇలా ఈ స్టెప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది.

దీని కోసం మీరు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
ఆ తరవాత మై ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇక్కడ గెట్ ఆధార్ సెక్షన్‌లో రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ / యూఐడీ పైన క్లిక్ చెయ్యండి.
నెక్స్ట్ మీరు మీ యొక్క పేరు, మొబైల్‌ నంబర్‌‌తో పాటు అక్కడే కనిపించే క్యాప్చా కోడ్ ని కూడా ఎంటర్ చేసేయండి.
ఆ తరవాత మీరు సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఓటీపీ ని మీరు ఎంటర్ చేసేశాక మొబైల్‌కు ఆధార్ నంబర్‌ మెసేజ్ రూపంలో వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news