ఇకపై ఎమ్ సీ ఏ రెండేళ్ళే..

-

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎమ్ సీ ఏ కాలాన్ని రెండేళ్లకి కుదించింది. బ్యాచులర్ డిగ్రీ తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ లో పీజీ చేసేవారు ఎమ్ సీ ఏ వైపు మళ్ళుతారు. ఇప్పటి వరకూ ఎమ్ సీ ఏ చేయడానికి మూడేళ్ళ కాలం ఉండేది. కానీ ఇక నుండి ఆ కాలాన్ని తగిస్తూ రెండేళ్లకే పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వచ్చాయి. 2021నుండి ఈ విద్యా విధానం అమల్లోకి రానుందని చెబుతున్నారు.

ఐతే ఇంజనీరింగ్ విద్య అభ్యసించేవారు విపరీతంగా పెరగడంతో ఎమ్ సీ ఏ కి ఆదరణ తగ్గింది. డిగ్రీ పూర్తి చేసాక ఎమ్ సీ ఏ చేసేవారు చాలా వరకు తగ్గిపోయారు. కంప్యూటర్స్ లో పీజీ చేయాలనుకునే వారందరూ ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయారు. ఏమ్ సీ ఏ విద్యాకాలం తగ్గించడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. మరి ఇప్పుడైనా ఎమ్ సీ ఏ కి ఆదరణ పెరుగుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news