SBI: ఒక ఫోన్ కాల్ తో ఎస్బీఐ పిన్ జనరేషన్ చేసుకోండి…!

-

దేశీయ నాటి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త సౌకర్యాన్ని తీసుకు రావడం జరిగింది. ఈ ఫెసిలిటీ వలన కస్టమర్స్ ఎంతో ఈజీగా ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసేసుకో వచ్చు.

ఇక దీనికి సంబంధించి వివరాల లోకి వెళితే… ఇప్పుడు ఎస్బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుండి ఐదు నిమిషాల లో ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకో వచ్చని SBI తెలిపింది. పైగా ఎక్కడకి వెళ్ళక్కర్లేదని. మీ ఇంటి నుండి లేదా ఆఫీసు నుండి మీరు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ తన ఖాతాదారులు డెబిట్ కార్డు పిన్ కార్డు జనరేట్ చేసుకోవచ్చు.

అయితే ఇప్పుడు మాత్రం ఎస్బీఐ టోల్ ఫ్రీ ఐవీఆర్ సిస్టమ్ ద్వారా 1800 112 211ఫోన్ నంబర్‌కు గానీ, 1800 425 3800 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి చెప్పాలి. ఇందులో ఉన్న ఎదో ఒక నెంబర్ కి కాల్ చేసి తరువాత పిన్‌ జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్-6 ఎంచుకోవాలని ఎస్బీఐ చెప్పింది. ఆ తర్వాత ఎస్బీఐ కార్డుపై ఉన్న నంబర్, పుట్టిన తేదీ, కార్డు చివరి తేదీ నమోదు చేయాలని తెలిపింది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి లేదా మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసాక ఐవీఆర్‌లో మీ పిన్ జనరేట్ అయిందని కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news