యూజర్లకు యాపిల్ బంఫర్ ఆఫర్..!

-

యాపిల్ కంపెనీ గురించి అందరికి తెలిసిందే.. ఈ ఫోన్లకు, వస్తువులకు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అయితే యాపిల్ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే యువత ఎక్కువగా యాపిల్ ను వాడటానికి ఇష్టపడుతున్నారు..ధర ఎక్కువ కావడంతో చాలా మంది వెనక్కి దగ్గుతున్నారు.తాజాగా యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది.తాజాగా ‘బై నౌ పే లేటర్’ అనే సర్వీస్‌ను అధికారికంగా ప్రకటించింది. యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌2022లో ఈ ఫైనాన్షియల్ సర్వీస్ గురించి వివరించింది. ఈ సర్వీసు ద్వారా నాలుగు ఈఎంఐల్లో పేమెంట్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు అందిస్తామని పేర్కొంది. అయితే ఈ సర్వీస్ ప్రజలకు ఎలా హెల్ప్ అవుతుందనేది ఆసక్తిగా మారింది.

కంపెనీ పేమెంట్‌ను ఎలా అందించాలని యోచిస్తోంది? రుణాల ను ఎవరు అందజేస్తున్నారు? యాపిల్ ఏదైనా ఫైనాన్స్ సంస్థతో పార్ట్నర్‌షిప్ కుదుర్చుకోనుందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి.యాపిల్ కంపెనీ స్వయంగా రుణాలను అందించబోతున్నట్లు తేలింది. ఈ వ్యాపారాన్ని మేనేజ్ చేసేందుకు కంపెనీ ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. ఈ అనుబంధ సంస్థ యాపిల్ పే ఎకోసిస్టమ్‌లో భాగంగా యూజర్ల క్రెడిట్‌ని చెక్ చేయడంతోపాటు, షార్ట్-టర్మ్ లోన్స్ ఆఫర్ చేస్తుంది.

యాపిల్ పే లేటర్ అనే పేరిట వస్తున్న ఈ సర్వీస్ యాపిల్ పేని ఉపయోగించి ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే యూజర్లకు ఆరు వారాలు లేదా రెండు నెలలలోపు కట్టాల్సిన డబ్బును నాలుగు ఈఎంఐల్లో చెల్లించేలా వీలు కల్పిస్తుంది.ఐఓఎస్ 16 పబ్లిక్‌గా అందుబాటులోకి రాగానే యాపిల్ పే లేటర్ సర్వీసు ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతుంది. ప్రస్తుతానికి యూఎస్‌లో ఈ సర్వీస్‌ను యాపిల్ ఆఫర్ చేయనుంది. ఆ తర్వాత అన్ని దేశాల్లో సేవలను విస్తరించనుంది. యాపిల్ కార్డ్, యాపిల్ పే లేటర్‌తో, ఐఫోన్ తయారీదారు ఇకపై కేవలం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ మాత్రమే కాదని నిస్సంకోచంగా చెప్పవచ్చు..ఈ సర్వీసు గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news